Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Veera Simha Reddy (2022)




చిత్రం: వీరసింహారెడ్డి (2023)
సంగీతం: థమన్. యస్
నటీనటులు: బాలకృష్ణ , శృతి హసన్ 
దర్శకత్వం: గోపీచంద్ మలినేని 
నిర్మాత: నవీన్ యెర్నేని, రవిశంకర్, యలమంచిలి 
విడుదల తేది: 12.01.2023



Songs List:



జై బాలయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: వీరసింహారెడ్డి (2023)
సంగీతం: థమన్. యస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: కరిముల్లా

రాజసం నీ ఇంటిపేరు
పౌరుషం నీ ఒంటి తీరు
నిన్ను తలచుకున్నవారు
లేచి నించొని మొక్కుతారు

అచ్చ తెలుగు పౌరుషాల… రూపం నువ్వయ్యా
అలనాటి మేటి రాయలోరి… తేజం నువ్వయ్యా
మా తెల్లవారే పొద్దు… నువ్వై పుట్టినావయ్యా
మా మంచిచెడ్డల్లోనా జతకట్టినావయ్యా
జన్మబంధువంటు నీకు జైకొట్టినామయ్యా

జై బాలయ్య… జై బాలయ్యా
జై జై బాలయ్య…  జై బాలయ్యా
జై బాలయ్య… జై బాలయ్యా
మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా

(జై బాలయ్య… జై బాలయ్యా
జై జై బాలయ్య…  జై బాలయ్యా
జై బాలయ్య… జై బాలయ్యా
మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా)

రాజసం నీ ఇంటిపేరు
పౌరుషం నీ ఒంటి తీరు
నిన్ను తలచుకున్నవారు
లేచి నించొని మొక్కుతారు

ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

సల్లంగుంది నీ వల్లే
మా నల్లపూస నాతాడు
మా మరుగు బతుకులలోనే
పచ్చబొట్టు సూరీడు

గుడిలో దేవుడి దూత నువ్వే
మెరిసే మా తలరాత నువ్వే
కురిసే వెన్నెల పూత నువ్వే
మా అందరి గుండెల మోత నువ్వే

ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

ఏ, తిప్పుసామి కోరమీసం
తిప్పు సామి ఊరికోసం
నమ్ముకున్న వారి కోసం
అగ్గిమంటే నీ ఆవేశం

నిన్ను తాకే దమ్మున్నోడు
లేనే లేడయ్యా
ఆ మొల్తాడు కట్టిన
మొగ్గోడింకా పుట్నే లేదయ్యా

పల్లె నిన్ను చూసుకుంటా
నిమ్మలంగా ఉందయ్యా
నీదే పేరు రాసి రక్షా రేకు కట్టుకుందయ్యా
మూడు  పొద్దుల్లోన
నిన్ను తలిచి మొక్కుతాందయ్యా

జై బాలయ్య… జై బాలయ్యా
జై జై బాలయ్య…  జై బాలయ్యా
జై బాలయ్య… జై బాలయ్యా
మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా



సుగుణ సుందరి పాట సాహిత్యం

 
చిత్రం: వీరసింహారెడ్డి (2023)
సంగీతం: థమన్. యస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: రామ్ మిరియాల, స్న్గిగ్డ శర్మ 

సీమ కుట్టిందేయ్
సిట్టి సీమ కుట్టిందేయ్
దిల్లు కందిపొయ్యేలాగా
దిట్టంగా కుట్టిందేయ్

ప్రేమ పుట్టిందే..
పిచ్చి ప్రేమ పుట్టిందే..
నిన్ను చూసి చూడంగానే
కుడి కన్ను కొట్టిందే

నువ్వు హాట్’యు హాట్’యు
ఘాటు నాటు సీమ పటాస్ యే
నా స్వీట్'యు స్వీట్'యు
లిపు యు నీకు జ్యూసు యూ గలసే

నీ సోకు టాప్ క్లాసే
నిన్నొద్దులుకుంటే లాసే
మన క్లాస్’యు మాసూ
కలయిక అబ్భో అదుర్స్ యే

సుగుణ సుందరి
సుగుణ సుందరి
సుర సుర సూపులా
రాకుమారి
(ఏయ్ మల్లా)

సుగుణ సుందరి
సుగుణ సుందరి
పెళ్లి గంట కొట్టినాధే
అత్తింటికి రా మరి

సీమ కుట్టిందేయ్
సిట్టి సీమ కుట్టిందేయ్
దిల్లు కందిపొయ్యేలాగా
దిట్టంగా కుట్టిందేయ్

ప్రేమ పుట్టిందే
పిచ్చి ప్రేమ పుట్టిందే
నిన్ను చూసి చూడంగానే
కుడి కన్ను కొట్టిందే

ఊరకుండదు తీరికుండదు
ఊసుపోని చీమ
మనసులోకి ధూరీ ధూరీ
మంట పెడదమ్మా

ఊపు తగ్గని, ఉడుకు తగ్గని
ఊర మాస్’యూ చీమా
తీపి చెరుకు జంట చూసి
గంటా కొడతాదమ్మా

హే సిట్టి సిట్టి సిట్టి సిట్టి
సిట్టి సిట్టి సీమ
హే కుట్టి కుట్టి కుట్టి కుట్టి
సంపుతాందీ మామ

హే సిట్టి సిట్టి సిట్టి సిట్టి
సిట్టి సిట్టి సీమ
హే కుట్టి కుట్టి కుట్టి కుట్టి
సంపుతాందీ మామ

సన్నజాజి తీగనడుం ఒంపుల్లో
సన్న ధరం ఉయ్యాలేసి ఊగలే
సీమకారం కోర మీసం మెలికల్లో
సిట్టి పెదవి తేనే సీసా పొంగాలే

బాగా నచ్చవే బాలమణి
భలేగా పెంచావే బంగారాన్ని
అలాగ ఐతే ఈ అందాలను
నిన్ను చుట్టు ముట్టి చుట్టుకునేయ్
చుట్టలైపోనీ..

సుగుణ సుందరి
సుగుణ సుందరి
సుర సుర సూపులా
రాకుమారి
(ఏయ్ మల్లా)

సుగుణ సుందరి
సుగుణ సుందరి
పెళ్లి గంట కొట్టినాదే
అత్తింటికి రా మరి

సీమ కుట్టిందేయ్
సిట్టి సీమ కుట్టిందేయ్
దిల్లు కందిపొయ్యేలాగా
దిట్టంగా కుట్టిందేయ్

ప్రేమ పుట్టిందే
పిచ్చి ప్రేమ పుట్టిందే
నిన్ను చూసి చూడంగానే
కుడి కన్ను కొట్టిందే..



మా బావ మనోభావాలు పాట సాహిత్యం

 
చిత్రం: వీరసింహారెడ్డి (2023)
సంగీతం: థమన్. యస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సాహితి చాగంటి, యామిని, రేను కుమార్ 

బావ బావ బావ
బావ బావ బావ
చుడీదారు ఇస్తామంటా ఆడికి
వొద్దొద్దు అన్నా ఎండలకాలం వేడికి
ఎంచక్కా తెల్ల చీర కట్టి
జళ్ళో మల్లె పూలే చుట్టి
వెళ్లేలోపే ముఖం ముడుసుకున్నడే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
బావ బావ బావ

అత్తరు ఘాటు నచ్చదంట ఆడికి
అదే రాసుకెల్లా నేను ఒంటికి
ఇక చుస్కో నానా గత్తర చేసి
ఇల్లు పీకి పందిరెసి
కంచాలొదిలి మంచం కరుసుకున్నడే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
బావ బావ బావ

బావ బావ బావ
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
ఖతార్ నుండి కన్నబాబని
ఇస్కూలు ఫ్రెండు ఇంటికొస్తేను
ఈడేందుకు వచ్చిండని
ఇంతెత్తుని ఎగిరి రేగాడిండే
ఓటర్ లిస్ట్ ఓబుల్ రావు
వయసెంతని నన్నడిగితేనూ
గదిలో దూరి గొల్లలేసి
గోడలు బీరువాలు గుద్దేసిండే
యేటి సేద్ధమే తింగరి బుచ్చి
ఆదికేమో నువ్వంటే పిచ్చి
ఏదో బతిమాలి బుజ్జగించి
చేసేసుకో లాలూచి
హే మెత్తగుండి మొండిగుంటడు
ఎడ్డం అంటే తెడ్డం అంటడు
సిటీకి మాటికీ సిన్నబుచ్చుకుంటాడే

మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
బావ బావ బావ





మాసు మొగుడొచ్చాడే పాట సాహిత్యం

 
చిత్రం: వీరసింహారెడ్డి (2023)
సంగీతం: థమన్. యస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: మనో, రమ్యా బెహ్రా

ఏంది రెడ్డి ఏంది రెడ్డి
ఏడ చూడు నీదే జోరు
తొడలు కోట్టి హడలగోట్టి
మొగతాంది నీదే పేరు
ఏడ నుంచి తన్నుకొస్తదో
తాటదీసే నీలో ఊపు
ఎంత పొడుగు పోటుగాడు
రానేలేడు నీ దరిదాపు
పుటకతోనే మనలో ఉన్నాయ్
నాన్న గారి జీన్స్లో జీన్సు
సేమ్ టు సేమ్ ఆ కటౌటే
మనకు రెఫెరెన్సు
నీ దున్నుడు దూకుడు
ముట్టడి చేస్తాందే
నీ లాగుడు ఊగుడు
నను అట్టుడుకిస్తాందే
మాసు మొగుడొచ్చాడే
మ మాస్ మొగుడొచ్చాడే
ఏ కొక రైక గ్యాప్ చూసి
గిల గిల గిచ్చాడే
మాసు మొగుడొచ్చాడే
మ మాస్ మొగుడొచ్చాడే
అరె మూతి ముద్దుల్
కానూకిచ్చి మీసం గుచ్చాడే

ఏంది రెడ్డి ఏంది రెడ్డి
ఏడ చూడు నీదే జోరు
తొడలు కోట్టి హడలగోట్టి
మొగతాంది నీదే పేరు
జింగిలాలో జింగిలాలో
అరె జింగిలాలో జింగిలాలో
హే జింగి జింగి లాలలో
జింగిలాలో జింగిలాలో
అరె జింగిలాలో జింగిలాలో
జింగి జింగి జింగి జింగిలాలో

ఏ రంగు రంగు రెక్కలా గుర్రంలా
చెంగు చంగునోస్తివే ఓ పిల్లా
నీ మల్లెపూల కళ్ళేమిచ్చి నాకిలా
మంచి చెడ్డ చూసుకో మరదలా
హే సీమ కత్తి చూపుతో
సిగ్గులేని కొస్తివె సిలుకు లుంగీ చుట్టుకున్న సింగంలా
నా కట్టుబొట్టుతో సహా
పుట్టుమచ్చతో భలే
పులకరింతలొచ్చెనే నీ దయ వల్ల
కులుకు చుస్తే కులుమనాలి
పట్టపగలే పొగలో సెగలు
పూల రెక్కలు పులకించందే
తీరదే గుబులు
నీ మాటకి ధాటికి బుగ్గలు కితకితలే
నా ఆటకి పోటెత్తవ రాతిరి రాసి కథలే
మాసు మొగుడొచ్చాడే
మ మాస్ మొగుడొచ్చాడే
ఏ కొక రైక గ్యాప్ చూసి
గిల గిల గిచ్చాడే
మాసు మొగుడొచ్చాడే
మ మాస్ మొగుడొచ్చాడే
అరె మూతి ముద్దుల్
కానూకిచ్చి మీసం గుచ్చాడే

No comments

Most Recent

Default