
చిత్రం: జాను (2020)
సంగీతం: గోవింద్ వసంత
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: ప్రదీప్ కుమార్
నటీనటులు: శర్వానంద్, సమంత
దర్శకత్వం: సి. ప్రవీణ్ కుమార్
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 07.02.2020
ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా
ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా
ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా
ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా
కదలని ఓ శిలనే అయినా
త్రుటిలో కరిగే కలవే అయినా
ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా
ఇల్లాగే కడదాకా ఓ పశ్నై ఉంటానంటున్నా
ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతు ఉన్నా
నా వెంట పడి నువ్వింత ఒంటరి
అనొద్దు అనొద్దు దయుంచి ఎవరూ
ఇంకొన్ని జన్మాలకి సరిపడు
అనేక స్మృతుల్ని ఇతరులు ఎరుగరు
నా ఊపిరిని ఇన్నాళ్లుగా
తనవెన్నంటి నడిపిన చేయూత ఎవరిది
నా ఎద లయను కుశలము అడిగిన రుసరుస కబురుల ఘుమ ఘుమ లెవిరివీ...
ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా
కాలం ఇపుడే నను కనగా
అనగనగా... అంటూనే ఉంటా
ఎపుడూ పూర్తవనే అవక
తుధి లేని కథ నేనుగా
గాలి వాటం లాగ.. ఆగే అలవాటే లేక కాలం నిలవదు ఏ చోట నిలకడగా
యే చిరునామాలేక యే బదులు పొందని లేఖ
ఎందుకు వేస్తుందో కేక.. మౌనంగా
నా వెంట పడి నువ్వింత ఒంటరి
అనొద్దు అనొద్దు దయుంచి ఎవరూ
ఇంకొన్ని జన్మాలకి సరిపడు
అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్నాళ్లుగా
తనవెన్నంటి నడిపిన చేయూత ఎవరిది
నా ఎద లయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమ ఘుమ లెవిరివీ
లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం
నాకే సొంతం అంటున్నా విన్నారా
నేనూ నా నీడ ఇద్దరమే చాలంటున్నా
రాకూడదు ఇంకెవరైనా
అమ్మ వడిలో మొన్న అందని ఆశలతో నిన్న
ఎంతో ఊరిస్తూ ఉందీ జాబిల్లి
అంత దూరానున్నా వెన్నెలగా చెంతనే ఉన్నా
అంటూ ఉయాలలూపింది జొలాలి
No comments
Post a Comment