Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Devatha (1982)




చిత్రం: దేవత (1982)
సంగీతం: కె. చక్రవర్తి 
నటీనటులు: శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 04.09.1982



Songs List:



ఎల్లువొచ్చి గోదారమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: దేవత (1982)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

(గమనిక: ఎల్లువచ్చి గోదారమ్మ పాట ని వరుణ్ తేజ్ నటించన గద్దలకొండ గణేష్ (2019) సినిమాలో రీమేక్ చేశారు)

ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లా కిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లూపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో
కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
ఓరయ్యో..రావయ్యో..ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా..
మీగడంతా నీదేలేరా బుల్లోడా
 
ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లా కిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లూపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో
కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే
ఓలమ్మో..రావమ్మో..ఆగమంటే రేగేనమ్మా  సోగ్గాడు..
ఆగడాల పిల్లోడైనా నీవోడు
ఆగమంటే రేగేనమ్మా  సోగ్గాడు..
ఆగడాల పిల్లోడైనా నీవోడు

ఈ కళ్ళకున్న ఆకళ్ళలోనా అందాల విందమ్మ నువ్వు
వాటేసుకుంటే వందేళ్ళ పంట వద్దంటే విందమ్మ నవ్వు
చేయ్యేస్తే చేమంతి బుగ్గా..చెంగావి గన్నేరు మొగ్గ
చేయ్యేస్తే చేమంతి బుగ్గా..చెంగావి గన్నేరు మొగ్గ
ఈడొచ్చి నీ చోటు ఈడుంది రమ్మంటే ఏడేసుకుంటావు గూడు
కౌగిళ్ళలో నన్ను కూడు..ఆకళ్ళకుంటాది కూడు.. 
గుండెల్లో చోటుంది చూడు
 
ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లా కిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లూపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో 
కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే
ఓరయ్యో..రావయ్యో..ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా..
మీగడంతా నీదేలేరా బుల్లోడా
ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు..
ఆగడాల పిల్లోడైనా నీవోడు

నీ కళ్ళు సోక నా తెల్ల కోక అయ్యిందిలే గళ్ళ కోక
నీ మాట విన్న నా జారు పైట పాడిందిలే గాలిపాట 
కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళూ.. నే కోరిన మూడూ ముళ్ళు 
కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళూ.. నే కోరిన మూడూ ముళ్ళు
పొద్దుల్లో కుంకాలు బొట్టెట్టి పోతుంటే కట్టెయ్యనా తాళిబొట్టు
నా మాటకీ యేరు తోడూ.. ఏరెండినా ఊరు తోడు..
నీ తోడులో ఊపిరాడు..

ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లా కిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లూపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో
కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
ఓలమ్మో..రావమ్మో..
ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు
ఆగడాల పిల్లోడైనా నీవోడు
ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా
మీగడంతా నీదేలేరా బుల్లోడా 




చీర కట్టింది సింగారం పాట సాహిత్యం

 
చిత్రం: దేవత (1982)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

చీర కట్టింది సింగారం
చెంప పూసింది మందారం 
మేను మెరిసింది బంగారం 
అమ్మమ్మో కొత్తగుంది ఈ మేళం
ఇన్నాళ్లు ఎక్కడున్నది ఈ వయ్యారం
చీర కట్టింది సింగారం
చెంప పూసింది మందారం 
మేను మెరిసింది బంగారం 
అమ్మమ్మో కొత్తగుంది ఈ మేళం
ఇన్నాళ్లు ఎక్కడున్నది ఈ వయ్యారం

కట్టుకున్న చీరకేమో గీర వచ్చెను 
కట్టుకునే వాడినది గిచ్చి పెట్టెను
హొయ్
నిన్ను చూసి వయస్సుకే వయస్సు వచ్చెను 
హే
వెన్నెలొచ్చి దాన్ని మరీ రెచ్చగొట్టెను
హొయ్
కన్నె సొగసుల కన్ను సైగలు
ముద్దులు ఇచ్చి నిద్దర లేపి వేదించెను
నిన్ను రమ్మని నన్ను ఇమ్మని 
మెలుకువ తెచ్చి పులకలు వచ్చి మెప్పించెను
పొద్దు పొడుపు పువ్వల్లె పువ్వు  చుట్టూ తేటల్లే
నిన్ను నన్ను నన్ను నిన్ను ఆడించెను
హా...


చీర కట్టింది సింగారం
చెంప పూసింది మందారం 
మేను మెరిసింది బంగారం 
అమ్మమ్మో కొత్తగుంది ఈ మేళం
ఇన్నాళ్లు ఎక్కడున్నది ఈ వయ్యారం

ఆహ హ...
ఆహ హ...
ఆహ  హ...

ఆశలన్నీ అందమైన పందిరాయెను
హొయ్
ఆనందం అందుకుని చంద్రుడాయెను
హొయ్
కళ్ళు రెండు నీకోసం కాయలాయెను
హొయ్
పెళ్లినాటికి అవి మాగి ప్రేమ పండును
హొయ్
సన్నజాజులు ఉన్న మోజులు 
విరిసే రోజు మురిసే రోజు రానున్నది
పాలపుంతగా మేను బంతిగా 
జీవితమంతా సెలయేరంతా కానున్నది
నిండు మనసు నావల్లే కొండమీది దివ్వల్లే
నీలో నాలో వెలుగే వెలిగే వలపన్నది

చీర కట్టింది సింగారం
చెంప పూసింది మందారం 
మేను మెరిసింది బంగారం 
అమ్మమ్మో కొత్తగుంది ఈ మేళం
ఇన్నాళ్లు ఎక్కడున్నది ఈ వయ్యారం




కుడికన్ను కొట్టగానే కుర్రాడ్ని పాట సాహిత్యం

 
చిత్రం: దేవత (1982)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

కుడికన్ను కొట్టగానే కుర్రాడ్ని
ఎడం కన్ను కొట్టగానే ఎర్రోడ్ని
కుడికన్ను కొట్టగానే కుర్రాడ్ని
ఎడం కన్ను కొట్టగానే ఎర్రోడ్ని
ఆ రెండు కళ్ళు కొట్టరాదా
నన్ను రెచ్చగొట్టి చూడరాదా
వంకాయ్..
హొయ్.. హొయ్

కుడికన్ను కొట్టగానే కుర్రోడా
ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా
కుడికన్ను కొట్టగానే కుర్రోడా
ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా
ఆ రెండుకళ్ళు కొట్టనేలా
ఈ గుండె తలుపు తట్టనేలా
వంకాయ్..
హయ్.. హయ్

కుడికన్ను కొట్టగానే కుర్రాడ్ని
ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా


గుమ్మా.. ముద్దుగుమ్మా
ముద్దు గుమ్మాలు దాటింది లెమ్మంటా
అరె.. అమ్మో.. ఎవడి సొమ్మో
దాచుకోకమ్మో.. దోచాలి రమ్మంటా
జోరుగా.. నీరునారుగా
పచ్చపైరల్లే ఉర్రూతలూగాలంటా
ఊగాలా.. తత్తరపడి విచ్చలవిడి ఉయ్యాలా
నిద్దరచెడి ముద్దరపడి పొద్దుల గురితప్పాల
ముద్దుల ముడి విప్పాల అల్లరిపడి సందేల
మల్లెలతో చెప్పాలా
వంకాయ్..
హొయ్.. హొయ్ 

కుడికన్ను కొట్టగానే కుర్రోడా
ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా
ఆ రెండు కళ్ళు కొట్టరాదా
నన్ను రెచ్చగొట్టి చూడరాదా
బుగ్గో.. పూతమొగ్గో..

కొత్తబేరాలు కోరింది రమ్మంట
అహ.. సిగ్గో చిలిపి ముగ్గో
పట్టపగ్గాలు లేవంది తెమ్మంట
జోడుగా ఏరు నీరుగా
పల్లెసీమల్లో ఊరేగి పోవాలంట
రేగాలా.. బిత్తర చెలి చూపులు సుడి రేగాలా
నడిరాతిరి కొన ఊపిరి చక్కలిగిలి కాగాలా
దిక్కులు చలికూగాలా చుక్కలు దిగి రావాలా
మొక్కుబడులు చెయ్యాలా..
వంకాయ్...
హొయ్ హొయ్ 

కుడికన్ను కొట్టగానే కుర్రాడ్ని
ఎడం కన్ను కొట్టగానే ఎర్రోడ్ని

కుడికన్ను కొట్టగానే కుర్రాడ్ని
ఎడం కన్ను కొట్టగానే ఎర్రోడ్ని
ఆ రెండు కళ్ళు కొట్టరాదా
నన్ను రెచ్చగొట్టి చూడరాదా
వంకాయ్..
హొయ్ హొయ్ హొయ్

కుడికన్ను కొట్టగానే కుర్రోడా
ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా
కుడికన్ను కొట్టగానే కుర్రోడా
ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా
ఆ రెండుకళ్ళు కొట్టనేలా
ఈ గుండె తలుపు తట్టనేలా





చల్లగాలి చెప్పేది..ఏమని? పాట సాహిత్యం

 
చిత్రం: దేవత (1982)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.పి. శైలజ 

పల్లవి:
చల్లగాలి చెప్పేది..ఏమని?
చల్లగా నూరేళ్ళు..ఉండమనీ..ఈ

చల్లగాలి చెప్పేది..ఏమని?
చల్లగా నూరేళ్ళు..ఉండమనీ..ఈ

పిల్ల ఏరు పాడేది..ఏమనీ..ఈ..?
పిల్ల పాపలతో..మళ్ళిమళ్ళి రమ్మని

మళ్ళి మళ్ళి..రమ్మని
చల్లగాలి చెప్పేది..ఏమని?


చరణం: 1 
Ring-a-ring-a roses
A pocket full of posies
Ashes! Ashes!
We all fall down.

Ring-a-ring-a roses
A pocket full of posies
A-tishoo! A-tishoo!
We all fall down.
హా హా హా హా హా హా
నట్టింట నడయాడే..చిట్టిపూవు ఏదని..?
కడుపు పండి విరబూసే..పసికందులౌవ్వని

నట్టింట నడయాడే..చిట్టిపూవు ఏదని..?
కడుపు పండి విరబూసే..పసికందులౌవ్వని

ఇల్లంట వెలిగించే..సిరి దివ్య ఏదనీ..ఈ..?
ఇల్లు మెచ్చి వచ్చినా..శ్రీదేవి..చూపనీ
కొలుచుకొనే దైవాన్ని..కోరుకొనే దేమనీ..?
ఏమనీ..ఈ..?
దిద్దుకొనే..తిలకానికి..దీర్ఘాయువు..ఇమ్మని
దీర్ఘాయువు ఇమ్మని..ఈ

చల్లగాలి చెప్పేది..ఏమని?
చల్లగా నూరేళ్ళు..ఉండమనీ..ఈ


చరణం: 2 
Johny Johny!
Yes, Papa
Eating sugar?
No, papa
Telling lies?
No, Papa
Open your mouth!
Ha! Ha!! Ha!!!
హా హా హా హా హా

ఏడాదికి ఒకసారి..వచ్చేది ఆమనీ
దాన్ని ఎల్లవేళ..కాపురాన నిలిపేది నీవనీ

ఏడాదికి ఒకసారి..వచ్చేది ఆమనీ
దాన్ని ఎల్లవేళ..కాపురాన నిలిపేది నీవనీ

పగటిపూట ఎండలే..రాత్రిపూట వెన్నెలనీ..ఈ
పంచుకొన్న హృదయాలకు..పగలు రేయి ఒకటనీ

మన జీవిత పయనంలో..చివరికోర్కే..ఏదనీ..??
ఒకరి కన్న ఒకరు ముందు..కన్నుమూసి వెళ్ళాలనీ
మరుజన్మకు..కలవాలనీ..

చల్లగాలి చెప్పేది..ఏమని?
చల్లగా నూరేళ్ళు..ఉండమనీ..ఈ

పిల్ల ఏరు పాడేది..ఏమనీ..ఈ..?
పిల్ల పాపలతో..మళ్ళిమళ్ళి రమ్మని
మళ్ళి మళ్ళి..రమ్మని

లాల లాల లాల లాల లాలలా
లాల లాల లాల లాల లాలలా




ఎండావానా నీళ్ళాడాయి.. పాట సాహిత్యం

 
చిత్రం: దేవత (1982)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
ఎండావానా నీళ్ళాడాయి.. కొండకోనల్లో
కొమ్మా రెమ్మా..పెళ్ళాడాయి.. కోనసీమల్లో 

ఎండావానా నీళ్ళాడాయి.. కొండకోనల్లో
కొమ్మా రెమ్మా..పెళ్ళాడాయి.. కోనసీమల్లో

కొండ కోన దాటాలంటే.. మనమేం చేయాలి.. ఓహో

చెప్పొద్దు చేసేయి.. సందె పొద్దుల్లో
ఈ పొద్దు ముంచేయి ముద్దే ముద్దుల్లో

ఎండావానా నీళ్ళాడాయి..కొండకోనల్లో
కొమ్మా రెమ్మా..పెళ్ళాడాయి..కోనసీమల్లో 

చరణం: 1 
హ్హ హ్హ హ్హ హ్హ హ్హ..
చేయి చేయి కలవంగానే..చెరిగే పొలిమేరా..ఆ
కన్ను కన్ను నీలో నన్ను..కలిపేయ్ కసితీరా..ఆ

ప్రేమకు..పెళ్ళీడొస్తుంటే.. పెదవులు ముద్దాడేస్తుంటే
కాలం ఆపు కాసేపూ.. లోకం రాదు మనవైపు
మల్లెల పందిరి..అల్లరి వయసును..తొందర పెడుతుంటే
సన్నాయి మోగాలి.. గుండెగొతుల్లో
తువ్వాయి..గెంతాలి..కొండ కోనల్లో

ఎండావానా నీళ్ళాడాయి..కొండకోనల్లో
కొమ్మా రెమ్మా..పెళ్ళాడాయి..కోనసీమల్లో
కొండ కోన దాటాలంటే..మనమేం చేయాలి..ఓహో..ఓఓఓ

చెప్పొద్దు చేసేయి..సందె పొద్దుల్లో..హహ్హా
ఈ పొద్దు ముంచేయి ..ముద్దే ముద్దుల్లో

ఎండావానా నీళ్ళాడాయి..కొండకోనల్లో
కొమ్మా రెమ్మా..పెళ్ళాడాయి..కోనసీమల్లో 

చరణం: 2 
చూపు చూపు..కలవంగానే..పొడిచే చుక్కంటా..ఆ
చుక్కా..ఎన్నెల..పక్కే మనకు..మాపటి దిక్కంటా

ఇంకా దగ్గరకొస్తుంటే..ఏ..అందం అక్కరకొస్తుంటే..ఏ

అలలే ఆపు కాసేపూ.. కలలే రేపు నీ చూపు
పొడిచే ఊహల ఊపిరి కబురులు వడగాలౌతుంటే

వెచ్చంగ నిండాలి..పల్లె పాటల్లో..ఓ
పచ్చంగ పండాలి..పైరు పంటలూ..ఓ


ఎండావానా నీళ్ళాడాయి..కొండకోనల్లో
కొమ్మా రెమ్మా..పెళ్ళాడాయి..కోనసీమల్లో

కొండ కోన దాటాలంటే..మనమేం చేయాలి..లోహో..ఓఓఓ

చెప్పొద్దు చేసేయి..సందె పొద్దుల్లో..హహ్హా
ఈ పొద్దు ముంచేయి ..ముద్దే ముద్దుల్లో

ఎండావానా నీళ్ళాడాయి..కొండకోనల్లో
కొమ్మా రెమ్మా..పెళ్ళాడాయి..కోనసీమల్లో

No comments

Most Recent

Default