Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Abhinandana (1988)





చిత్రం: అభినందన (1988)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: కార్తిక్, శోభన, శరత్ బాబు
దర్శకత్వం: అశోక్ కుమార్
సమర్పణ: జి. బాబు
నిర్మాత: ఆర్.వి.రమణమూర్తి 
విడుదల తేది: 01.01.1988



Songs List:



అదే నీవు అదే నేను..పాట సాహిత్యం

 
చిత్రం: అభినందన (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్. పి. బాలు


పల్లవి:
ఆ హా హా హా....
ఆ ఆ ఆ....
ఆ....

అదే నీవు అదే నేను.. అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను.. అదే గీతం పాడనా
కధైనా... కలైనా... కనులలో చూడనా
అదే నీవు అదే నేను.. అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను.. అదే గీతం పాడనా...

చరణం: 1
కొండా కోన గుండెల్లో ఎండా వానలైనాము
కొండా కోన గుండెల్లో ఎండా వానలైనాము
గువ్వా గువ్వ కౌగిళ్ళో గూడుచేసుకున్నాము
అదే స్నేహము అదే మోహమూ
అదే స్నేహము అదే మోహమూ.. ఆది అంతము ఏదీ లేని గానము 

అదే నీవు అదే నేను.. అదే గీతం పాడనా
కధైనా... కలైనా... కనులలో చూడనా

చరణం: 2
నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావూ...
నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు
కన్నీరైన ప్రేమల్లో పన్నీరవుదామన్నావు
అదే బాసగా... అదే ఆశ గా...
అదే బాసగా... అదే ఆశ గా... ఎన్ని నాళ్ళు ఈ నిన్న పాటే పాడను 

అదే నీవు అదే నేను.. అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను.. అదే గీతం పాడనా
కధైనా... కలైనా... కనులలో చూడనా
అదే నీవు అదే నేను.. అదే గీతం పాడనా




చుక్కలాంటి అమ్మాయి పాట సాహిత్యం

 
చిత్రం: అభినందన (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్. జానకి

పల్లవి: 
ఊ..ఊ..ఊ..ఊ..ఊ.. 
ఊ..ఊ..ఊ... 
చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి 
చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి 
ఇద్దరొద్ధికైనారు ముద్దు ముద్దుగున్నారు 
ఇద్దరొద్ధికైనారు ముద్దు ముద్దుగున్నారు 
చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి 

చరణం: 1
ఈ పిల్లకు మనసైంది... ఆ కళ్ళకు తెలిసింది.. 
ఆ పిల్లాడు వలచింది... ఈ బుగ్గకు సిగ్గైంది.. 
కళ్యాణం ..వైభోగం.. నేడో రేపో ఖాయం అన్నారు.. 
మేళాలు.. తాళాలు.. బాణసంచా కలలే కన్నారు... 

పెళ్ళికి మాకేం ఇస్తారు.... 
కొత్త బట్టలు కుట్టిస్తారు గుర్రం సార్టు ఎక్కిస్తారు ... 
కొత్త బట్టలు కుట్టిస్తారు గుర్రం సార్టు ఎక్కిస్తారు 
ఊరంతా ఊరేగిస్తారు 

చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి 
ఇద్దరొద్ధికైనారు ముద్దు ముద్దుగున్నారు 
ఇద్దరొద్ధికైనారు ముద్దు ముద్దుగున్నారు 
చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి 

చరణం: 2
కొత్త బట్టలు కుట్టిస్తారు గుర్రం సర్తు ఎక్కిస్తారు ... 
కొత్త బట్టలు కుట్టిస్తారు గుర్రం సర్తు ఎక్కిస్తారు 
ఊరంతా ఊరేగిస్తారు 

చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి 
ఇద్దరొద్ధికైనారు ముద్దు ముద్దుగున్నారు 
ఇద్దరొద్ధికైనారు ముద్దు ముద్దుగున్నారు 
చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి




చుక్కలాంటి అమ్మాయి పాట సాహిత్యం

 
చిత్రం: అభినందన (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్. జానకి

పల్లవి:
చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి
చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి
ఇద్దరొద్దికైనారు ముద్దు ముద్దుగున్నారు
ఇద్దరొద్దికైనారు ముద్దు ముద్దుగున్నారు
చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి

చరణం: 1
ఒక బంధువు వచ్చాడు తానొంటరినన్నాడు
ఆ బంధం వేసాడు సంబంధం చేసాడు
ఆ పిల్ల అతనికి అనుకోకుండా ఇల్లాలయ్యింది
అనుకోకుండా ఇల్లాలయ్యింది
ఇన్నాళ్ళు ప్రేమించిన పిల్లాడేమో పిచ్చాడయ్యాడు
పిల్లాడేమో పిచ్చాడయ్యాడు



ఎదుటా నీవే పాట సాహిత్యం

 
చిత్రం: అభినందన (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్. పి. బాలు

పల్లవి:
ఎదుటా నీవే యదలోనా నీవే
ఎదుటా నీవే యదలోనా నీవే
ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే
ఎదుటా నీవే యదలోనా నీవే

చరణం: 1
మరుపే తెలియని నా హృదయం
తెలిసి వలచుట తొలి నేరం అందుకే ఈ గాయం
మరుపే తెలియని నా హృదయం
తెలిసి వలచుట తొలి నేరం అందుకే ఈ గాయం

గాయాన్నైనా మాననీవు హృదయాన్నైనా వీడిపోవు
కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు
పిచ్చి వాడ్ని కానీదు అహహా ఓహొహో ఊఁహుఁహుఁహూఁహూ...

ఎదుటా నీవే యదలోనా నీవే
ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే
ఎదుటా నీవే యదలోనా నీవే

చరణం: 2
కలలకు భయపడి పోయాను
నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను
కలలకు భయపడి పోయాను
నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను
స్వప్నాలైతే క్షణికాలేగా సత్యాలన్నీ నరకాలేగా
స్వప్నం సత్యమైతే వింత సత్యం స్వప్నమయ్యేదుందా
ప్రేమకింత బలముందా అహహా ఓహొహో ఊఁహుఁహుఁహూఁహూ...

ఎదుటా నీవే యదలోనా నీవే
ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే
ఎదుటా నీవే యదలోనా నీవే




మంచు కురిసే పాట సాహిత్యం

 
చిత్రం: అభినందన (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్. పి. బాలు, ఎస్. జానకి 

పల్లవి: 
మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో 
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో 
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో 
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో 
మంచు కురిసే వేళలో 

చరణం: 1
నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో 
నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో 
జలకమాడి పులకరించే సంబరంలో 
జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో 
జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో 
ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో..

మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో 
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో 
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో 
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో 
మంచు కురిసే వేళలో… 

చరణం: 2
మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో 
మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో 
మన్మధునితో జన్మ వైరం చాటినపుడో 
ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో 
ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో..
మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడో..

మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో 
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో 
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో 
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో 
మంచు కురిసే వేళలో…




ప్రేమ ఎంత మధురం పాట సాహిత్యం

 
చిత్రం: అభినందన (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్. పి. బాలు 


పల్లవి: 
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం 
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం 
చేసినాను ప్రేమక్షీర సాగర మదనం మింగినాను హలాహలం

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం 

చరణం: 1
ప్రేమించుటేనా నా దోషము 
పూజించుటేనా నా పాపము 
ఎన్నాళ్ళని ఈ యదలో ముల్లు 
కన్నీరుగ ఈ కరిగే కళ్ళు 
నాలోని నీ రూపము నా జీవనాధారము 
అది ఆరాలి పోవాలి ప్రాణం 

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం 
చేసినాను ప్రేమక్షీర సాగర మదనం మింగినాను హలాహలం 
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం 

చరణం: 2
నేనోర్వలేను ఈ తేజము 
ఆర్పేయరాదా ఈ దీపము 
ఆ చీకటిలో కలిసేపోయి నా రేపటిని మరిచేపోయి 
మానాలి నీ ధ్యానము కావాలి నే శూన్యము 
అపుడాగాలి ఈ మూగ గానం 

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం 
చేసినాను ప్రేమక్షీర సాగర మదనం మింగినాను హలాహలం 
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం




ప్రేమ లేదని పాట సాహిత్యం

 
చిత్రం: అభినందన (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్. పి. బాలు

పల్లవి:
లాలల లలాలాల
ప్రేమ లేదని ప్రేమించరాదని
ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని
ఓ ప్రియా జోహారులు ...

ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని
ఓ ప్రియా జోహారులు
లాలల లలాలాల

చరణం: 1
మనసు మాసిపోతే మనిషే కాదని
కఠికరాయికైనా కన్నీరుందని
వలపు చిచ్చు రగులుకుంటే ఆరిపోదని
గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పని
ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరీ
ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరీ
మోడువారి నీడ తోడు లేకుంటినీ
ప్రేమ లేదని లలలాలలాలలా

చరణం: 2
గురుతు చెరిపివేసి జీవించాలని
చెరపలేకపోతే మరణించాలని
తెలిసికూడ చెయ్యలేని వెర్రివాడిని
గుండె పగులుపోవు వరకు నన్ను పాడని
ముక్కలలో లెక్కలేని రూపాలలో
ముక్కలలో లెక్కలేని రూపాలలో
మరల మరల నిన్ను చూసి రోదించనీ 

ప్రేమ లేదని ప్రేమించరాదని
ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని
ఓ ప్రియా జోహారులు
లాలలాల ల లల లాలలాల లా
లాలలాల ల లల లాలలాల లా



రంగులలో కలవో పాట సాహిత్యం

 
చిత్రం: అభినందన (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్. పి. బాలు, ఎస్. జానకి

పల్లవి:
రంగులలో కలవో యద పొంగులలో కళవో
రంగులలో కలవో యద పొంగులలో కళవో
నవశిల్పానివో ప్రతిరూపానివో తొలి ఊహల ఊయలవో
రంగులలో కలవో యద పొంగులలో కళవో

చరణం: 1
కాశ్మీర నందన సుందరివో.. కాశ్మీర నందన సుందరివో
కైలాస మందిర లాస్యానివో
ఆమని పూచే యామినివో.. ఆమని పూచే యామినివో
మధుని బాణమో.. మదుమాస గానమో
నవ పరిమళాల పారిజాత సుమమో

రంగులలో కలనై.. యద పొంగులలో కళనై
నవశిల్పాంగినై రతిరూపాంగినై నీ ఊహలా ఊగించనా
రంగులలో కలనై

చరణం: 2
ముంతాజు అందాల తానివో.. ముంతాజు అందాల తానివో
షాజాను అనురాగ సౌధానివో
లైలా కన్నుల ప్రేయసివో.. లైలా కన్నుల ప్రేయసివో
ప్రణయ దీపమో నా విరహ తాపమో
నా చిత్రకళా చిత్ర చైత్ర రథమో

రంగులలో కలనై యద పొంగులలో కళనై
నవశిల్పాంగినై రతిరూపాంగినై నీ ఊహలా ఊరించనా
రంగులలో కలనై యద పొంగులలో కళనై

1 comment

Sandeep said...

Nice ... Thank You Sooo Much ..🙏🙏 Awesome Songs ... 😍😍 ... Keep It Up Sir

Most Recent

Default