Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Thene Manasulu"
Thene Manasulu (1987)



చిత్రం: తేనె మనసులు (1987)
సంగీతం: బప్పి లహరి
సాహిత్యం: వేటూరి (All)
నటీనటులు: కృష్ణ , జయప్రద , సుహాసిని
దర్శకత్వం: రాజేంద్ర సింగ్ బాబు
నిర్మాత: కె. సి. ఎన్. చంద్రశేఖర్
విడుదల తేది: 24.04 1987



Songs List:



వీడ్కోలిదే సోదరి పాట సాహిత్యం

 
చిత్రం: తేనె మనసులు (1987)
సంగీతం: బప్పి లహరి
సాహిత్యం: వేటూరి
గానం: పి. సుశీల

వీడ్కోలిదే సోదరి




అలరే అలరే పాట సాహిత్యం

 
చిత్రం: తేనె మనసులు (1987)
సంగీతం: బప్పి లహరి
సాహిత్యం: వేటూరి
గానం: పి. సుశీల

అలరే అలరే




నా ప్రాణమే పాట సాహిత్యం

 
చిత్రం: తేనె మనసులు (1987)
సంగీతం: బప్పి లహరి
సాహిత్యం: వేటూరి
గానం: పి. సుశీల

నా ప్రాణమే




గోవింద గోవింద పాట సాహిత్యం

 
చిత్రం: తేనె మనసులు (1987)
సంగీతం: బప్పి లహరి
సాహిత్యం: వేటూరి
గానం: రాజ్ సీతారాం

గోవింద గోవింద



మమ్మీ మమ్మీ పాట సాహిత్యం

 
చిత్రం: తేనె మనసులు (1987)
సంగీతం: బప్పి లహరి
సాహిత్యం: వేటూరి
గానం: రాజ్ సీతారాం, పి. సుశీల

మమ్మీ మమ్మీ




మామయ్య మామయ్య పాట సాహిత్యం

 
చిత్రం: తేనె మనసులు (1987)
సంగీతం: బప్పి లహరి
సాహిత్యం: వేటూరి
గానం: రాజ్ సీతారాం, పి. సుశీల

మామయ్య మామయ్య




నీవే చంటే సీతారాం పాట సాహిత్యం

 
చిత్రం: తేనె మనసులు (1987)
సంగీతం: బప్పి లహరి
సాహిత్యం: వేటూరి
గానం: రాజ్ సీతారాం, పి. సుశీల

నీవే చంటే సీతారాం

Palli Balakrishna Tuesday, August 24, 2021
Thene Manasulu (1965)



చిత్రం: తేనె మనసులు (1965)
సంగీతం: కె.వి.మహాదేవన్
సాహిత్యం: ఆత్రేయ, దాశరధి
గానం: సుశీల, ఘంటసాల
నటీనటులు: వారణాసి రామ్మోహన్ రావు, కృష్ణ, సంధ్యా రాణి, సుకన్య
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
సహాయ దర్శకుడు: కె.విశ్వనాథ్
నిర్మాత: సి.సుందరం
విడుదల తేది: 31.03.1965



Songs List:



ఒన్ టూ త్రీ ఫోర్ పాట సాహిత్యం

 
చిత్రం: తేనె మనసులు (1965)
సంగీతం: కె.వి.మహాదేవన్
సాహిత్యం: ఆత్రేయ 
గానం: పి.సుశీల, పద్మనాభం 

ఒన్ టూ త్రీ ఫోర్
ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్
మాస్టారూ డ్రిల్ మాస్టారూ
8 7 6 5 4 3 2 1
మానేస్తారా ఇక మానేస్తారా
ఉద్యోగం ఇస్తాము చేస్తారా ఒక
ఉద్యోగం ఇస్తాము చేస్తారా
ఒళ్ళు పంచి పని చేయాలి
మెదడుకు పదును పెట్టాలి
అమ్మయ్యే మెదడే
అది లేకున్నా పరవలేదు
మీకు తోడుగా వుంటాను
అమ్మయ్యా వుంటారా
మెలుకువగా పని చేశారంటే
మీరే దొరలా వస్తారు మరి జీతం
నెలకు ముప్పై రోజులు జీతం
రోజుకు రెండే పూటలు బత్తెం చిత్తం
పూటపూటకు పని వుంటుంది
నాలుగు రోజులు సెలవుంటుంది
సెలవుల్లో ఏం చేయాలి
మా కొలువుననే మీరుండాలి
మా కనుసన్నలలో మెలగాలి
దానికి జీతం నా జీవితం




అనాదిగా జరుగుతున్న పాట సాహిత్యం

 
చిత్రం: తేనె మనసులు (1965)
సంగీతం: కె.వి.మహాదేవన్
సాహిత్యం: ఆత్రేయ 
గానం: పి.సుశీల

అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇదిలే
అదేమిటో! ఆడదంటే మగవాడికి అలుసులే

ఎవడో ఒకడన్నాడని
అదియే ప్రజావాక్యమని
అగ్ని వంటి అర్థాంగిని అడవి కంపె రాముడు
శ్రీరాముడు 

ధర్మం ధర్మమని జూదమాడి ఒక రాజు
ఆలి నోడినాడు సత్యం సత్యమని ఒక మగడు
సతిని అమ్మినాడు అదేమిటో ఆడదంటె మగవాడికి అలుసులే




పురుషుడు నేనై పుట్టాలి పాట సాహిత్యం

 
చిత్రం: తేనె మనసులు (1965)
సంగీతం: కె.వి.మహాదేవన్
సాహిత్యం: ఆత్రేయ 
గానం: పి.సుశీల, పి.బి.శ్రీనివాస్.

పురుషుడు నేనై పుట్టాలి
ప్రకృతి నీవే రావాలి
ఇరువురి మనసులు కలవాలి
ఆ కలయిక కళకళలాడాలి 

పుడమే నేనై పుట్టాలి
ఒడిదుడుకులను ఓర్వాలి
కడలిని నదినీ కలపాలి
ఆ కలయిక కళకళలాడాలి 

మెరమెరలాడే వయసు నేనై
మిసమిసలాడే సొగసు నీవై
వెల్లువలాగా వెన్నెలలాగా
ముల్లోకాలను ముంచాలి 

పైమెరుగులకే పరవశమయ్యే
పరువానికి పగ్గం వేసి
పగ్గం కట్టిన కన్నె మనసులో
లోతులు తెలిసి మసలాలి 

దేవుడు నేనై పుట్టాలి
దేన్నో తాను ప్రేమించి
ఆడదాని మనసంటేనే
విషమని తెలిసి ఏడ్వాలి 

గాజు వంటి హృదయం తనది
రాతి వంటి నాతికి తగిలి
ముక్కలు చెక్కలుగా పగిలి
నెత్తురు కన్నీరవ్వాలి





ఏం ఎందుకని పాట సాహిత్యం

 
చిత్రం: తేనె మనసులు (1965)
సంగీతం: కె.వి.మహాదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి.సుశీల, పి.బి.శ్రీనివాస్.

ఏం ఎందుకని
ఈ సిగ్గెందుకని
ఎవరికి తెలియదని 

దీపముంటే సిగ్గంటిని
చీకటైనా సిగ్గెందుకు
మొగ్గ విరిసే తీరాలి
సిగ్గు విడిచే పోవాలి 

ఆ గదిలో నీ హృదిలో
కౌగిలిలో ఈ బిగిలో
ఏలా వుందో ఏమౌతుందో
ఏం చేయాలని నీకుందో చెప్పు 

ఊహు! పక్కన చేరాడా చెల్లీ
చెక్కిలి నొక్కాడా
ఇక్కడనా చెక్కిలినా
ఏమిటిదీ గిల్లినదా
పంటికి గోటికి తేడా లేదా
ఎందుకంటే ఈ బుకాయింపులు 

పగటి వేషం నాదమ్మా
రాత్రి నాటకం నీదమ్మా
అందుకని అందుకని
నువు చేసినదంతా చెప్పాలి
నే చెప్పినట్లు నువు చేయాలి 




దివినుండి భువికి దిగివచ్చే పాట సాహిత్యం

 
చిత్రం: తేనె మనసులు (1965)
సంగీతం: కె.వి.మహాదేవన్
సాహిత్యం:  దాశరధి
గానం: పి.సుశీల, ఘంటసాల

దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై
దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై
గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది కోటి ప్రభలతో నీవై నీవై
గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది కోటి ప్రభలతో నీవై నీవై
దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై
అందని జాబిలి అందాలు పొందాలి 
అనుకున్నానొకనాడు ఆనాడు
అందని జాబిలి అందాలు పొందాలి 
అనుకున్నానొకనాడు ఆనాడు
అందిన జాబిలి పొందులో అందాలు
అందిన జాబిలి పొందాలో అందాలు
పొందాను ఈనాడు ఈనాడు
పొందాను ఈనాడు ఈనాడు
దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే 
పారిజాతమే నీవై నీవై
కనరాని దేవుని కనులా జూడాలని 
కలగంటి నొకనాడు ఆనాడు
కనరాని దేవుని కనులా జూడాలని 
కలగంటి నొకనాడు ఆనాడు
కల నిజము చేసి కౌగిలిలో జేర్చి 
కల నిజము చేసి కౌగిలిలో జేర్చి
కరిగించే ఈనాడు ఈనాడు
కరిగించే ఈనాడు ఈనాడు
గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది 
కోటి ప్రభలతో నీవై నీవై
కడలిలో పుట్టావు అలలపై తేలావు 
నుఱగవై వచ్చావు ఎందుకో …
కడలిలో పుట్టావు అలలపై తేలావు 
నుఱగవై వచ్చావు ఎందుకో
కడలి అంచువు నిన్ను కలిసి నీ ఒడిలో ..
కడలి అంచువు నిన్ను కలిసి నీ ఒడిలో
ఒరిగీ కరగాలని ఆశతో ….
దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే 
పారిజాతమే నీవై నీవై
అ …. గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది 
కోటి ప్రభలతో నీవై నీవై
దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే 
పారిజాతమే నీవై నీవై



ఏవఁమ్మా నిన్నేనమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: తేనె మనసులు (1965)
సంగీతం: కె.వి.మహాదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి.సుశీల, ఘంటసాల

ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు
ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను
ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు
ఊఁ ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను
ఆలాగంటే ఏలాగండి అయినవాళ్ళని అడిగాము
ఆలాగంటే ఏలాగండి అయినవాళ్ళని అడిగాము
అంతేలెండి అంతకు మించి ఏదో ఏదో ఉందని అన్నానా
ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు
ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను

నడవకు నడవకు అమ్మయ్యో నడిచావంటే అమ్మయ్యో
నడుమే నలిగిపోతుంది నీ నడుమే నలిగిపోతుంది
పొగడకు పొగడకు అయ్యయ్యో పొగిడారంటే అయ్యయ్యో
మనిషే వెగటైపోతారు మనిషే వెగటైపోతారు
ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు
ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను

చూడకు అలా చూడకు ..
చూసావంటే ఏదో ఏదో ఔతోంది .. ఎదలో ప్రేమే పుడుతోంది
ఏదో ఏదో ఔతోంది .. ఎదలో ప్రేమే పుడుతోంది
పుట్టనీ పాపం పుట్టనీ ప్రేమే పుడితే
పెంచేదాన్నీ నేనున్నాలాలించేదాన్నీ నేనున్నా
జోజోజో… జోజోజో… 
ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు
ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను
ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు
ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను





నీ ఎదుట నేను వారెదుట నీవు పాట సాహిత్యం

 
చిత్రం: తేనె మనసులు (1965)
సంగీతం: కె.వి.మహాదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి.సుశీల

చందమామా అందాలమామా
నీ ఎదుట నేను వారెదుట నీవు
మా ఎదుట ఓ మామ ఎప్పుడుంటావు
పెళ్ళి చూపులకు వారొచ్చారు
చూడాలని నే ఓరగ చూశా
వల్లమాలిన సిగ్గొచ్చింది
కన్నుల దాకా కన్నులు పోక
మగసిరి ఎడదనె చూశాను
తలదాచుకొనుట కది చాలన్నాను

పెళ్ళి చూపులలో బిగుసుకొని
పేరేమి నీ చదువేమి
నను ప్రేమిస్తావా వయసెంత
అని అడిగారా అసలొచ్చారా
నాలో వారు ఏం చూశారో
నా వారయ్యారుఅందులకే
మా ఇద్దరి జంట అపురూపం అంట 

చల్లని వెన్నెల దొరవంటారు
తియ్యని నవ్వుల సిరివంటారు
ఆ వెన్నెలలో వేడిగాడ్పులు
నవ్వులలోని నిప్పురవ్వలు
అనుభవించి అనమంటాను
వయసుకు వైరవి నీవంటాను
చందమామా! అందాలమామ





ఎవరో ఎవరో నీవాడు పాట సాహిత్యం

 
చిత్రం: తేనె మనసులు (1965)
సంగీతం: కె.వి.మహాదేవన్
సాహిత్యం: దాశరధి
గానం: పి.సుశీల

ఎవరో ఎవరో నీవాడు 


Palli Balakrishna Saturday, December 2, 2017

Most Recent

Default