Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Ramesh Varma"
Khiladi (2022)



చిత్రం: ఖిలాడి (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
నటీనటులు: రవి తేజా, మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి
దర్శకత్వం: రమేష్ వర్మ 
నిర్మాతలు: కోనేరు సత్యనారాయణ, రమేష్ వర్మ 
విడుదల తేది: 11.02. 2022



Songs List:



ఇష్టం పాట సాహిత్యం

 
చిత్రం: ఖిలాడి (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి 
గానం: హరిప్రియ 

చిన్నప్పుడు నాకు అమ్మ గోరుముద్ద ఇష్టం
కాస్త ఎదిగాక బామ్మ గోరింటాకు ఇష్టం
బళ్ళోకెళ్ళే వేళ… రెండు జల్లు అంటే ఇష్టం
పైటేసినాక ముగ్గులెయ్యడం ఇష్టం

కొత్త ఆవకాయ ముక్కంటే ఇష్టం
పక్క ఇంటి పూల మొక్కంటే ఇష్టం
అంతకంటే నేను అంటే నాకు ఇష్టం

కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం
అది నాకోసం నువు పడే కష్టం

తెల్లారంగానే వెచ్చనైన కాఫీ ఇష్టం
ఉల్లాసం పెంచే… స్వచ్ఛమైన సోఫీ ఇష్టం
అద్దం ముందర నాకు… అందమద్దడం ఇష్టం
నా అందం చూసి లోకం… ఆహా ఓహో అంటే ఇష్టం

గొడుగులేని వేళ వానంటే ఇష్టం
వెలుగులేని వేళ తారలు ఇష్టం
నిదుర రాని వేళ జోలపాట ఇష్టం

కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం
అది నా కోసం నువ్ పడే కష్టం

రెప్పల తలుపు మూసి… కలలు కనడమే ఇష్టం
మదికి హత్తుకుపోయే… కథలు వినడమంటే ఇష్టం
చేతి గాజులు చేసే… చిలిపి అల్లరంటే ఇష్టం
కాలి మువ్వలు చెప్పే… కొత్త కబురులంటే ఇష్టం

ఊహల్ని పెంచే ఏకాంతమిష్టం
ఊపిరిని పంచే చిరుగాలి ఇష్టం
ప్రాణమిచ్చే గుండె చప్పుడెంతో ఇష్టం

కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం
అది నా కోసం నువ్ పడే కష్టం





ఖిలాడీ పాట సాహిత్యం

 
చిత్రం: ఖిలాడి (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి 
గానం: రామ్ మిరియాల

హి ఈజ్ ఏ గ్రాండ్ మాస్టర్
హి ఈజ్ ఏ క్రైమ్ పోస్టర్
వీడు ఎదురయ్యే టైమింగు
డేంజర్ తో డేటింగు
యు గాట్ టు రన్ ఫాస్టర్

హి ఈజ్ ఏ స్పెల్ మాస్టర్
మనీ మోన్స్టర్
వీడితో నీకు మీటింగు
హెల్ తోటి గ్రీటింగు
లైఫే రోలర్ కోస్టర్

స్మెల్ చూసి నోట్ నేమ్ చెప్పగలడు సాల
వెయిట్ చూసి కట్టలోన లెక్క చెప్పేవాల
రాబరీకి పాఠశాల మనీ హెయిస్ట్ కె ఇవ్వాళ
కొత్త హైట్ చూపిన హవాలా

కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ
కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ

లోకం యాడున్నా లిక్విడ్ మనీ
ట్రాకర్ లా లాగే వాలా
లాకర్ లో దాక్కున్న సీక్రెట్స్ అన్నీ
హ్యకర్ లా పట్టే వాలా

పోకర్ లో కింగంటి నీ ఫేట్ ని
జోకర్ లా మార్చేవాలా
గురి చూసి కరెన్సీ క్యారమ్స్ ని
స్ట్రైకర్ లా కొట్టేవాలా

బాడీ మొత్తం బ్రెయిన్ దోచేసినా
ఏకైక హ్యూమన్ వీడే
హార్ట్ కోసం ఇచ్చిన స్పాట్ ని కూడా
స్కెచ్ ల్తో నింపేశాడే

కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ
కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ

అకౌంట్ బుక్కులో టాలీ కానీ… లెక్కలకే బ్యాలన్సరు
ఫైనాన్స్ సబ్జెక్టులో పట్టా ఉన్నా… సరికొత్త ఫ్రీలన్సరు
కంట్రీకే అప్పుంది కోట్లల్లోనా… మనకుంటే తప్పేంటి
సలహాలు ఇస్తూనే సర్వం దోచే… అరుదైన అడ్వైజరు

సొంత బాడీనంటి ఉంటోందని
నీడలకే రెంట్ ఏస్తాడే
సెంటీమీటర్ సెంటిమెంటే లేని
సెల్ఫ్ మేడ్ సెల్ఫిష్ వీడే

కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ
కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ




అట్టా సూడకే పాట సాహిత్యం

 
చిత్రం: ఖిలాడి (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి 
గానం: దేవీశ్రీప్రసాద్, సమీరా భరద్వాజ్

అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే
ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే

నీలో స్పీడుకే… ఊపెక్తాంది మూడుకే
సిగ్గే సైడ్కే… అటకేక్తాంది చోడ్కే

మన సెల్ఫీ తీసి పోస్టర్ వేశా
నా గుండె గోడకే

అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే
ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే

ఓ బాటిల్ లోన సముద్రం
ఒక బాడీ లోన ఇంతందం
ప్యాకింగ్ చేయడం అసాధ్యం
ఆ గాడ్ కి వందనం

సూపర్ హీరో ఇమేజు
నీకిచ్చారేమో ప్యాకేజు
నీ వల్లే నాకీకరేజు
నువ్వే నా ఇంధనం

దూరం పెంచకే
మెంట్లెక్తాంది మైండుకే
నీతో బాండ్ కే టెంప్టెక్తాంది గుండెకే
ఒక డీజే మిక్సే మొదలయ్యిందే
నాలో మాస్సు గాడికే

అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే
ఏ, ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే

నువు స్విచ్చే లేని కరెంటు
ఐపోయా నీకే కనెక్టు
నీకే ఇచ్చా నా రిమోటు
నీ ఇష్టం ఆడుకో

నీ పిక్చర్ కాముడి కటౌటు
నీ స్ట్రక్చరు లవ్వుకి లేఔటు
నీ రేంజికి తగ్గ కంటెంటు
నా గ్లామర్ చూసుకో

రావే ట్రేడుకే
ఓ ట్రక్కుడు లవ్వు లోడుకే
వస్తా తోడుకే
నువ్వెక్కడికెల్తే ఆడికే
మన సీనేగాని చూస్తే
షాకే సెన్సారు బోర్డుకే

అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే
ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే





ఫుల్ కిక్కు పాట సాహిత్యం

 
చిత్రం: ఖిలాడి (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి 
గానం: సాగర్, మమతా శర్మ 

ఏందిరా అబ్బాయ్ సిట్యుయేషన్ ఏంటి
మాస్ సాంగ్ అన్న
అయ్యబాబోయ్ మాసే
అః మాస్ మహారాజ్ ఇక్కడ
అంతేనంటవా
అదిగో క్యూట్ చిక్కు
నువ్వు పెట్టెయ్ టిక్కు
ఇంక ఫుల్ కిక్కు

నీ లిప్ లోంచి దూసుకొచ్చే ఫ్లయింగ్ కిస్సు
ఓ నిప్పులాగా నన్ను తాకే పెంచెను పల్సు
అది వంటిలొని చేసిన అల్లరి నీకేం తెల్సు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు

నువ్వు కళ్ళతోటి విసురుతుంటే లవ్ సిగ్నల్సు
నా ఈడులోన షురూ ఇంకా ఎఫ్ వన్ రేస్
ఆ బ్రేకుల్లేని బ్రేక్ డాన్స్ నీకేం తెల్సు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు

నువ్వు చదివేసి పారేసిన లవ్ నోవెల్సు
నువ్వు వాడేసి ఆరేసిన టవల్స్
అవి నాకంట పడుతుంటే 
ఆ మంట నీకేం తెల్సు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు

నీ షేప్ ముందు సరిపోరే ఏ మోడల్స్
కెలికేసిన దానితోటి నా ఛానెల్సు
నీ సోకు ఎంత సైకోనో నీకేం తెల్సు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు

నీ కండలోన దాచావు ఓ డంబెల్సు
అవి చూడగానే హార్మోన్సులో నో బ్యాలన్సు
ఇక రాతిరెన్నో జాతరలో నీకేం తెల్సు
ఫుల్ కిక్కు - ఫుల్ కిక్కు

ఇద్దరి బడి ఫీలింగ్సు మాచింగ్ మాచింగ్సు
ఇక తీసేయ్ మద్యల డిస్టెన్స్ దేనికి న్యూసెన్స్
నువ్వు ఇచ్చేస్తే గ్రీన్ సిగ్నల్స్
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు

నేనున్న చోటు పసిగట్టే నీ  టాలెంట్స్
కనిపెట్టి యూస్ లేదేమో గూగుల్ మ్యాప్స్
అసలుండనీవు మన మధ్యన కొంచెం గ్యాప్స్
ఫుల్ కిక్కు - ఫుల్ కిక్కు

మాగ్నెట్స్ కూడా షాక్ అయ్యే అట్ట్రాక్షన్స్
మన మధ్య మొదలు పెట్టాయి నీ యాక్షన్స్
మన లవ్ కింకా లోకంలో నో ఆప్షన్స్
ఫుల్ కిక్కు - ఫుల్ కిక్కు

మన ఇద్దరి మధ్యన ఫిజిక్స్
సంథింగ్ సొమెథింగ్స్యూ
మన ఇద్దరి మధ్యన లిరిక్స్
ఫుల్ అఫ్ రొమాన్స్
ఇక కుమ్మేద్దాం డాన్సో డాన్స్
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు




క్యాచ్ మీ పాట సాహిత్యం

 
చిత్రం: ఖిలాడి (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి 
గానం: నేహా బాసిన్,  జస్ప్రీత్ జస్జ్

హలో మిస్టర్ మాచో మ్యాన్
నాతో కొంచెం నాచో మ్యాన్
నాటీ డేటే పూచో మ్యాన్
మిస్సయితే రాదు సోచో మ్యాన్

రైటు లేదు రాంగు లేదు
రంగే లేని నైటే లేదు
రంగంలోకి రాబిన్ హుడ్డై
రారా సూపర్ మ్యాన్

హే, విస్కే లేని గ్లాసే లేదు
రిస్కే లేని రేసే లేదు
మాస్కే లేని ఫేసే లేదు
కాస్కో స్పైడర్ మ్యాన్

క్యాచ్ మీ, క్యాచ్ మీ
క్యాచ్ మీ ఇప్ యూ కెన్?
టీచ్ మీ, టీచ్ మీ
టీచ్ మీ వాట్ యూ కెన్?

హే పార్టీ మ్యాన్
నా డీజే మిక్సే నీకు నచ్చిందా
సై అంటే ఫ్లోరోసెంట్ కాంతుల్లోన
ఫెవరెట్ మ్యూజిక్ తో
నా డాన్స్ ఫ్లోరే బద్దలు కొడదాంరా

హేయ్, బేబీ గర్ల్
నీ బ్యూటీ ట్రీటే పిచ్చెక్కించిందే
నువ్వుంటే పౌండ్ నుంచి యూరో దాక
ఉండదింకా మనకే డోకా
చిందులేసి చిత్తే చేద్దాంరా

హే డాలర్ కోసం గాలం వేసే జాలరిలా
ఫిషింగ్ హుక్కే వెయ్యకు ఏదోలా
నీ గ్లామర్ కోసం స్కీమే వేశా ఈ వేళా
ఏ స్కామో చేసి నీ సొత్తంతా దోచేలా

క్యాచ్ మీ క్యాచ్ మీ
క్యాచ్ మీ ఇప్ యూ కెన్?
టీచ్ మీ టీచ్ మీ
టీచ్ మీ వాట్ యూ కెన్?

హేయ్, ఖిల్లాడి
నీ కిల్లర్ చూపుకి ఒళ్ళే అల్లాడి
బుల్లెట్లా గుచ్చుకుంటే గుండెల్లోన
రెచ్చిపోయే నాట్యంతోన
లేడి నెమలై నీతో నా బాడీ

హేయ్ అమ్మాడి..!
నీ అందం ఆయుధమల్లే వెంటాడి
కత్తుల్నే దించుతుంది సోకుల వాడి
దంచుతుందే నాపై దాడి
పెంచుతుందే రక్తంలో వేడి

హే, సిల్లీ సిల్లీ మాటలు చాలింకా
నీలోని రొమాన్స్ ని తీయింకా
నీ షైని షైని మెరుపుల మోజింక
నీ జిలుగులు మొత్తం కాజేస్తానే నేనింకా

క్యాచ్ మీ క్యాచ్ మీ
క్యాచ్ మీ ఇప్ యూ కెన్?
టీచ్ మీ టీచ్ మీ
టీచ్ మీ వాట్ యూ కెన్?

Palli Balakrishna Wednesday, February 9, 2022
Abbayitho Ammayi (2016)



చిత్రం: అమ్మాయితో అబ్బాయి (2016)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: నాగ శౌర్య , పాలక్ లాల్వాని
దర్శకత్వం: రమేష్ వర్మ
నిర్మాతలు: వందన అలేఖ్య జక్కం, శ్రీనివాస్ సమ్మెట, కిరీటి పోటిని
విడుదల తేది: 01.01.2016



Songs List:



రీనా మెకరీనా పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మాయితో అబ్బాయి (2016)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రెహ్మాన్
గానం: పీయూష్ కపూర్

రీనా మెకరీనా
ని వెనకే రానా
లోన లవ్ లోన
నే పడిపోతున్న
జీన య మరణ
ఇక నీతో జానా
పైన ఎద పైన
నే టాటూ కాన
కిస్ మీ ఆర్ కిల్ మీ
హ్యాపీ గానే ఓకే అంటున్న
హోం ఓ
హాగ్ మీ ఆర్ హిట్ మీ
ఎస్ అంటున్న
నో అంటున్న
నిన్నే ఫాలో అవనా

రీనా మెకరీనా
ని వెనకే రానా
లోన లవ్ లోన
నే పడిపోతున్న
రెక్స్ఓనా బుగ్గల్ని తాకి తడిమేనా
క్యాడ్బరి పెదవుల్ని కొంచం టేస్ట్ చేయనా
లవ్లీ గ లవ్ అంట కలిపి
నీతో లంచ్ -ఏ చేయనా
రీనా మేకరీనా
ని వెనకే రానా
లోన లవ్ లోన
నే పడిపోతున్న

కళ్ళలోంచి గుండెల్లోకి చేరినవే
అంతలోనే అందకుండా జారిపోకే
ఉన్నటుండి నా పై రంగు జల్లినవే
మతుల్లోన నన్నే ముంచి పారిపోకే

ఓ పాపా అంత చిన్న చూపా
చిక్కావే నాకు చిరు చేప
నాతో పంతాలెలా రావా
నాకే సొంతం నీవు కావా
తిట్టేస్తున్న నెట్టేస్తున్నా
నిన్నే వదిలేస్తానా

రీనా మెకరీనా
నీ వెనకే రానా
లోన లవ్ లోన
నీ పడిపోతున్న
జీన య మరణ
ఇక నీతో జానా
పైన ఎద పైన
నీ టాటూ కాన

ఎంత సేపు వేచిఉండాలి
నిన్ను చేరి
ముద్దిమ్మంటే ఒప్పుకోవే పిసినారి
ఎదో బట్టి వాదిస్తావ్ ప్రతి సారి
సింగల్ గ ఎం సాధిస్తావే
పిల్ల పోరి

ఓసారి చేయి పట్టుకోవా
లైఫ్ అంతా జంట కట్టుకోవా
నువ్వే ఏమన్నగాని వింటా
నాతో నువ్వే ఉండాలంట
వెయిటింగ్ -ఉలతో ఫైటింగ్ -ఉలతో
లాభం ఎంతంతున్నా

రీనా మెకరీనా
నె వెనకే రానా
లోన లవ్ లోన
నె పడిపోతున్న
కిస్ మీ ఆర్ కిల్ మీ
హ్యాపీ గానే ఓకే అంటున్న
హోం ఓ
హాగ్ మీ ఆర్ హిట్ మీ
ఎస్ అంటున్న
నో అంటున్న
నిన్నే ఫాలో అవన

రీనా మెకరీనా
నె వెనకే రానా
లోన లవ్ లోన
నె పడిపోతున్న
రెక్స్ ఓనా బుగ్గల్ని తాకి తడిమేనా
క్యాడ్బరి పెదవుల్ని కొంచం టేస్ట్ చేయనా
లవ్లీ గ లవ్ అంతా కలిపి
నీతో లంచ్ -ఏ చేయనా
రీనా మేకరీనా
నె వెనకే రానా
లోన లవ్ లోన
నె పడిపోతున్న




ఎదురు చూస్తున్న పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మాయితో అబ్బాయి (2016)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రెహ్మాన్
గానం: విభావరి

ఎదురు చూస్తున్న కనులే ఈవేళ
మెరుపులా మారే నీవల్ల
ఎదుట నువ్వుంటే ఎద ఈవేళ
మురిసి ఊగింది ఉయ్యాలా

దారేలేని హాయిలోన
నిలిచ బొమ్మల
మాటే రాణి మాయ లోన
పిలిచి నిన్నిలా
కళలు నిజమైన
వలపు జడి వాన
నన్ను తడిపెను నీల
ఎదురు చూస్తున్న కనులే ఈవేళ
మెరుపులా మారే నీవల్ల

ఎదుట నువ్వుంటే ఎద ఈవేళ
మురిసి ఊగింది ఉయ్యాలా

ఆపలేని ఏ హైరానా
నన్ను అల్లుకున్న
అంతులేని సంతోషానా అంతుచిక్కకున్న
చిగురే తొడిగే చిన్ని ఆశలు
పెరిగే ప్రేమను గెలిచి
నిదురే మరిచి తిరిగే అడుగులు
ఎగిరే నేలను విడిచే
చూపే వీలుకాని ఆశ లేదు లోపల
గుండెలోన ఉండలేక మాయే మాటల
పెదవి కలిసింది
పదము మెరిసింది ప్రేమే అక్షరాలా

ఎదురు చూస్తున్న కనులే ఈవేళ
మెరుపులా మారే నీవల్ల
ఎదురు చూస్తున్న కనులే ఈవేళ
మెరుపులా మారే నీవల్ల
ఎదుట నువ్వుంటే ఎద ఈవేళ
మురిసి ఊగింది ఉయ్యాలా

ఊహలాగా నువ్వే చేరి ఊపిరాడకున్న
గాలిలాగా నేనే మారి తేలిపోతూ ఉన్న
కదిలే నదిలా తనువే మారెను
కదిలే నీవని తెలిసి
మనసే ఎగిసే అలల పొంగెను
ఇప్పుడే నీ జత కలిసి
ఆకాశాలు దాటుతున్న అలుపే లేదు గ
ఏ దూరాలు ఏకమైనా
వలపే బాటగా
కుదుట పడలేక నిదుర మరిచాక
కలిసే నింగీ నెల

ఎదురు చూస్తున్న కనులే ఈవేళ
మెరుపులా మారే నీవల్ల
ఎదుట నువ్వుంటే ఎద ఈవేళ
మురిసి ఊగింది ఉయ్యాలా

దారిలేని హాయిలోన
నిలిచ బొమ్మల
మాటే రాని మాయ లోన
పిలిచ నిన్నిలా
కళలు నిజమైన
వలపు జడి వాన
నన్ను తడిపెను నీల

ఎదురు చూస్తున్న కనులే ఈవేళ
మెరుపులా మారే నీవల్ల
ఎదుట నువ్వుంటే ఎద ఈవేళ
మురిసి ఊగింది ఉయ్యాలా




తొలి పరువం పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మాయితో అబ్బాయి (2016)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రెహ్మాన్
గానం: సత్య ప్రకాష్, విభావరి

తొలి పరువం చేరి సగం
ఎద మధనం పరవశం వయసుకోరే
చెలి ఆదరం పరిచయం అతి మధురం
అనుభవం వరమై చేరే
తనువు లోని పెను దాహం
తపనలు తీరు సాహవాసమ్
మది కోరింది సాయం
పెనవేసే ప్రాయం
పెడదోసే ఈ మైకం
వదిలేసే లోకం

తొలి పరువం చేరి సగం
ఎద మధనం పరవశం వయసుకోరే
చెలి ఆదరం పరిచయం అతి మధురం
అనుభవం వరమై చేరే

శ్వాసల్లో వేస
శాసించే కోరికలు
రేగేలే వూరేగేలే
ఊహల్లో పెదలు
ఊరించే సంగతులు
రేగేలే చెలరేగేలే
ఆపాలనంటే ఆగేనా
దాచాలంటే దాగేనా
అల్లుకున్న హాయి తెరలోన
ఇద్దరుంటే ఓచోట
గుచ్చుకున్న చూపు సెగ లోన
ముచ్చటైన సయ్యాట
ఎవరెవరో ఎవరికీ తెలియదులే
చివరికి ఈ పూట

తొలి పరువం చేరి సగం
ఎద మధనం పరవశం వయసుకోరే
చెలి ఆదరం పరిచయం అతి మధురం

లేవంటూ తీరికలు చుట్టేసే వేడుకలు
ఆగేనా ఆరాటాలే
వేడెక్కే ఊపిరులు
వెచ్చగా ఆవిరులు
జారేలే పూ ఈ రాలే
తీయనైన తీరాన
మోయాలేని భారనా
తాకుతుంటే చేయి ఎద పైన
తప్పదింకా ఏదైనా
పంచుకుంటే రేయి పగలైనా
ఆగిపోనీ తిల్లానా
ఎవరెవరో ఎవరికీ తెలియదులే
చివరికి ఒక జంట

తొలి పరువం చేరి సగం
ఎద మధనం పరవశం వయసుకోరే
చెలి ఆదరం పరిచయం అతి మధురం
అనుభవం వరమై చేరే

తనువు లోని పెను దాహం
తపనలు తీరు సాహవాసమ్
మది కోరింది సాయం
పెనవేసే ప్రాయం
పడదోసే ఈ మైకం
వదిలేసే లోకం
తొలి పరువం చేరి సగం
ఎద మధనం పరవశం
చెలి ఆదరం పరిచయం అతి మధురం
అనుభవం





మాటల్లో చెప్పలేని పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మాయితో అబ్బాయి (2016)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రెహ్మాన్
గానం: కార్తీక్

మాటల్లో చెప్పలేని కథ తెలిసిందే
మౌనం లో ఆగలేని ఎద ఎగిసింది
మాటల్లో చెప్పలేని కథ తెలిసిందే
మౌనం లో ఆగలేని ఎద ఎగిసింది
ఇన్నాళ్లుగా నాలో ఉంది నాకు తెలియలేదే
ఇప్పుడిప్పుడే గుండె చప్పుడై నన్ను కలుసుకుందే
ఓ నా ప్రేమ
ఔనా నా ప్రేమ
మాటల్లో చెప్పలేని కథ తెలిసిందే
మౌనం లో ఆగలేని ఎద ఎగిసిందే

ఎప్పుడెప్పుడంటూ తరిమిందే
నన్ను పదమంటూ నీ
వైపే ఆరాటమే నన్నిలా

ఎక్కడెక్కటంటూ వెతికిందే
నిన్ను వీడనంటూ నా
చూపే నీకోసమే ఇంతలా

ఏమి చేసిన ఏది చూసిన
తనివి తీరక
ఎంత ఆపిన వింత
మాయలో అడుగు ఆగక
నీ ఊహల వెన్నెల దారిలో
ఆశలు ఎగురుతున్నవే
మాటల్లో చెప్పలేని కథ తెలిసిందే
మౌనం లో ఆగలేని ఎద ఎగిసిందే

చిన్నదైనాగాని ఒక మాట
చిచ్చుపెడుతుంటే ఈపూట
నీతోటి చెప్పేదెలా

కళ్ళుమూసుకున్న కనిపించే
ఎన్ని కళలంటే నా వెంట
నీతోటి పంపేదెలా
రెప్ప చాటున రెక్క
విప్పిన చిలిపి కోరిక
రేయి దాటినా జోల
పాడిన నిదురపొధీక
నీ నవ్వుల పూవ్వుల తేనెలు
నా ఎద వెతుకుతున్నదే

మాటల్లో చెప్పలేని కథ తెలిసిందే
మౌనం లో ఆగలేని ఎద ఎగిసిందే
ఇన్నాళ్లుగా నాలో ఉంది నాకు తెలియలేదే
ఇప్పుడిప్పుడే గుండె చప్పుడై నన్ను కలుసుకుందే
ఓ నా ప్రేమ
ఔనా నా ప్రేమ





కనులు కళలు పిలిచే పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మాయితో అబ్బాయి (2016)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రెహ్మాన్
గానం: హరిచరణ్, చిన్మయి

కనులు కళలు పిలిచే
నిదుర తలపు తెరిచే
మనసు పరుపు పరిచే
చెలిమి జతగా నిలిచే
మేఘాల్లోతెలి ని చెంత
వాలి మనసా ఓ
ఈ చల్ల గాలి పాడింది
లాలి తెలుసా ఓ
కనులు కళలు పిలిచే
నిదుర తలపు తెరిచే
మనసు పరుపు పరిచే
చెలిమి జతగా నిలిచే

బదులు రాని పిలుపు లాగ
గతము మిగిలిన
విడిచిపోని గురుతులాగా
అడుగు కలపన
తెలుపలేని తపనలేవో
ఏదని తొలిచిన
మరుపురాని మమతాలాగా
ఎదుట నిలవన
బతుకులోని బరువులన్ని
వదిలి కదిలిపో
కలత తీర కళలు
చేరి ఒదిగి ఒదిగి పో
నిదుర పో నిదుర పో
నిదుర లో కలిసి పో
అలసి సొలసి నిదుర
నాడిన కునుకు పడవ
కనులు కళలు పిలిచే
నిదుర తలపు తెరిచే
మనసు పరుపు పరిచే
చెలిమి జతగా నిలిచే

ఎవరు నీవు ఎవరు నేను
ఎవరికెవరులే
మధురమైన వరము ఎదో
మనని కలిపేలే
చెదిరిపోయే ఎగిరిపోయి
వెలుగు ముగిసిన
నిశిని దాటి దిశలు
మారే ఉదయమవునులే
శిశిరమైన పసిడి పూలు
మరల పూయ్యులే
శిధిలమైన హృదయ వీధి
తిరిగి వెలుగులే
తెలుసుకో తెలుసుకో
మనసునే గెలుచుకో
మనసుగెలిచి తెగువ మరచి
కళలు కనవ
కనులు కళలు పిలిచే
నిదుర తలపు తెరిచే

మనసు పరుపు పరిచే
చెలిమి జతగా నిలిచే
మేఘాల్లోతెలి ని చెంత
వాలి మనసా ఓ
ఏ చల్ల గాలి పాడింది
లాలి తెలుసా ఓ
కనులు కళలు పిలిచే
నిదుర తలపు తెరిచే
మనసు పరుపు పరిచే
చెలిమి జతగా నిలిచే




ఒక్కసారి ఓ వయ్యారి పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మాయితో అబ్బాయి (2016)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రెహ్మాన్
గానం: యాజిన్ నిజార్, రీటా, బ్లేజ్

ఒక్కసారి ఓ వయ్యారి
నన్ను చెర రా మరి
నిన్ను కోరి చేయ్యిజారి
వెళ్లిపోయే ఊపిరి
బ్రహ్మచారి రూట్ మారి
అల్లుకుంటే అల్లరి
హద్దుమీరి సోకు చోరీ
చేయమాకా పోకిరి
గుండె జారీ ప్రేమ దారి
ఎనుకుంటే రాతిరి
కొంగుతీరి తేనెలూరి
ఒక్కటైతే లాహిరి
ఒక్కసారి ఓ వయ్యారి
నన్ను చెర రా మరి
నిన్ను కోరి చేజారి
వెళ్లిపోయే ఊపిరి

గురి చూస్తా
గుట్టులాగి గొడవే చేస్తా
ముడివేస్తా ముద్దుతోటి ముడుపు ఇస్తా
వందేళ్ల సంకెళ్లు వేస్తా
అందాల గంధాలు తీస్తా
సందెల్ల వాకిళ్లు మూస్తా
సంతోష తీరాలు చూస్తా
నిన్ను నాలో దాచుకుంటే
ఎంత హాయ్యో సుందరి
బ్రహ్మచారి రూట్ మరి
అల్లుకుంటే అల్లరి
హద్దుమీరి సోకు చోరీ
చేయమాకా పోకిరి

మునకేస్తా ముంచుకొస్తే
వాడినై దాస్తా
అడుగేస్తా అందకుంటే
అలనై లేస్త
వెన్నెల్లో స్నానాలు చేస్తా
మందార పూవల్లే పూస్తా
రంగుల్లో రాత్రుల్లో నేస్త
శృంగార గ్రంధాలు రాస్త
నిన్ను నాలో చేర్చుకుంటే
నిలువెల్లా ఆవిరి
ఒక్కసారి ఓ వయ్యారి
నన్ను చెర రా మరి
నిన్ను కోరి చేయ్యిజారి
వెళ్లిపోయే ఊపిరి
బ్రహ్మచారి రూట్ మరి
అల్లుకుంటే అల్లరి
హద్దుమీరి సోకు చోరీ
చేయమాకా పోకిరి
గుండె జారీ ప్రేమ దారి
ఎనుకుంటే రాతిరి
కొంగుతీరి తేనెలూరి
ఒక్కటైతే లాహిరి
ఒక్కసారి ఓ వయ్యారి
నన్ను చెర రా మరి
నిన్ను కోరి చేజారి
వెళ్లిపోయే ఊపిరి





సరదాలే పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మాయితో అబ్బాయి (2016)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: చైతన్య వర్మ 
గానం: ఎం.ఎం. మనసి, రమ్యా ఎన్ఎస్కె, రీటా, రీనా రెడ్డి	

సరి సరి సరి
సరి సరి సరి
సరదాలే చిరుగాలి యెదలో
ప ప ప
ప ప ప
సరద్దాగా విరిశాయి మదిలో
జ జ జ
జ జ జ
ఆనందం ఎదో విరిసింది యెదలో
సంతోషం సగమై
సాగింది మనతో
కలకాలం నిలవాలి
మనం ఈ హాయిలో
సరదాలే చిరుగాలి యెదలో
ప ప ప
ప ప ప
సరద్దాగా విరిశాయి మదిలో
జ జ జ
జ జ జ

పడిపోని చాలా ఆనందాలు
అందాలే మనకి అంతే చాలు
యెనలేని ఏవో సంతోషాలు
ఎన్నటికీ మంత్తో ఉంటె చాలు
తగువేదో మనమీ
తరిమింది పదన్ని
తెలిసే తాను
కలిపింది ఏ తీరని
చెలిమేదో దారిగా
చెరిపింది మనని
గతమంతా మరిచింది
గురుతే లేదే
ఏ బంధం లేని
అనుబంధాలేవో
ముడి వేసుకుంటున్నాయి ఏమిటో
మునిపంటు లేని ఆనందాలేవో
పెనవేసుకుంటున్నాయి దేనికో
చిరు స్నేహం చిగురులుగా వేసి
చిరుబురులు చిటపటలు మాసి
చివరికిలా చెలిమోకటె
నిలిచే మాయే చేసి
సరద్దాలే వరదల్లె మదిలో
ప ప ప
ప ప ప
కురిశాయి వరమల్లే మనలో
జ జ జ
జ జ జ

ప్రతి రోజు ఇలలో
ప్రతి రేయి కలలో
ప్రతి నిమిషం
పంచింది సంతోషాలే
ప్రతి సారి తనలో
ప్రతి మాట తనతో
ప్రతి పలుకు
పలికింది ప్రియా రాగాలు
ఏనాడో లేని వసంతాలేవో
మన సొంతం అంటున్నాయి నేటితో
ఏమైనా కానీ
మనసైతే మాత్రం
ఏ మునకే కావాలంది దేనికో
కలహాలే కుసలాలై
కలిసి పంథాలో
పరదాలై విడిచి
చివరికిలా చెలిమోకటె
నిలిచే మాయే చేసి
సరదాలే వరదల్లె మదిలో
ప ప ప
ప ప ప
కురిశాయి వరమల్లే మనలో
జ జ జ
జ జ జ

ఆనందం ఎదో విరిసింది యెదలో
సంతోషం సగమై
సాగింది మనతో
కలకాలం నిలవాలి
మనం ఏ హాయిలో
సరదాలే వరదల్లె మదిలో
ప ప ప
ప ప ప
కురిశాయి వరమల్లే మనలో
జ జ జ
జ జ జ




అమ్మాయితో అబ్బాయి (Male) పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మాయితో అబ్బాయి (2016)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరాశ్రీ
గానం: పీయూష్ కపూర్

అమ్మాయితో అబ్బాయి
అబ్బాయితో అమ్మాయి
దొబొచేదో ఆడిస్తుంటే
దాగుడుమూతే ఆడిస్తుంటే
ముందు వెనక తేడా లేక
ఆటో ఇటో పోతు ఉంటె
మైమరచే వేళా
చుట్టూ ఎందరున్నా
ఎవరు లేనట్టేనా
అబ్బాయితో అమ్మాయి
అమ్మాయితో అబ్బాయి





అమ్మాయితో అబ్బాయి (Female) పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మాయితో అబ్బాయి (2016)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరాశ్రీ
గానం: అపర్ణ

అబ్బాయితో అమ్మాయి
అమ్మాయితో అబ్బాయి
ఊహల్లోనే స్వారీ చేసేస్తూ
మైదానంలో ప్రేమే పండిస్తూ
ఏకాంతన సాగే వేళా
ఎన్నెన్నో ఉల్లాసాలే
దూరాన మెరిసే
చూసే కళ్ళలోన కొత్త కాంతులేవో
అబ్బాయితో అమ్మాయి
అమ్మాయితో అబ్బాయి


Palli Balakrishna Wednesday, February 17, 2021
Ride (2009)



చిత్రం: రైడ్ (2009)
సంగీతం: హేమచంద్ర ( బ్యాక్ గ్రౌండ్ స్కోర్: చిన్నా)
నటీనటులు: నాని, తనిష్, అక్ష, శ్వేత బసు ప్రసాద్
దర్శకత్వం: రమేష్ వర్మ
నిర్మాత: బెల్లంకొండ సురేష్
విడుదల తేది: 05.06.2009



Songs List:



రంగుల లోకం పాట సాహిత్యం

 
చిత్రం: రైడ్ (2009)
సంగీతం: హేమచంద్ర 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: క్లింటన్ , శ్రావణ భార్గవి, భార్గవి పిళ్ళై 

రంగుల లోకం 




ఏదో ఏదో పాట సాహిత్యం

 
చిత్రం: రైడ్ (2009)
సంగీతం: హేమచంద్ర 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హేమచంద్ర  , శ్రావణ భార్గవి, గీతామాధురి

ఏదో ఏదో 



నా మనసంతా పాట సాహిత్యం

 
చిత్రం: రైడ్ (2009)
సంగీతం: హేమచంద్ర 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హేమచంద్ర  , సుచిత్ర 

నా మనసంతా 




దంచవే మేనత్త కూతురా పాట సాహిత్యం

 
చిత్రం: రైడ్ (2009)
సంగీతం: హేమచంద్ర 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సాయి శివాని, జి.వేణుగోపాల్

(ఇది రీమిక్స్ సాంగ్  బాలకృష్ణ , సుహాసిని   నటించిన మంగమ్మగారి మానవుడు చిత్రం లోనిది) 

దంచవే మేనత్త కూతురా 
వడ్లు దంచవే నా గుండెలదరా 
దంచు దంచు బాగ దంచు 
ఆ దంచు దంచు బాగ దంచు 

దంచవే మేనత్త కూతురా 
వడ్లు దంచవే నా గుండెలదరా
దంచవే మేనత్త కూతురా 
వడ్లు దంచవే నా గుండెలదరా 
దంచవే మేనత్త కూతురా 
వడ్లు దంచవే నా గుండెలదరా 
దంచు దంచు బాగ దంచు 
దంచు దంచు బాగ దంచు 
దప్పి పుట్టినా.. కాస్త నొప్పి పెట్టినా.. 
ఆగకుండ, ఆపకుండ, అందకుండ, కందకుండ.. 

దంచవే మేనత్త కూతురా 
వడ్లు దంచవే నా గుండెలదరా
దంచవే మేనత్త కూతురా 
వడ్లు దంచవే నా గుండెలదరదర

హే దంచు దంచు దంచు...

పోటు మీద పోటు వెయ్యి..కోక వయసు పొంగనియ్యి.. 
ఎడమ చేత ఎత్తిపట్టు.. కుడి చేత కుదిపి కొట్టు 
పోటు మీద పోటు వెయ్యి..కోక వయసు పొంగనియ్యి.. 
ఎడమ చేత ఎత్తిపట్టు.. కుడి చేత కుదిపి కొట్టు 

ఏ చెయ్యి ఎత్తితేమి...మరి ఏ చెయ్యి దించితేమి 
కొట్టినా నువ్వే..పెట్టినా నువ్వే 
పట్టుబట్టి తాళిబొట్టు కట్టినా నువ్వే!! 

హ.. దంచుతా మంగమ్మ మనవడా 
ఓయ్..నేను దంచితే నీ గుండె దడదడ 
దంచుతా మంగమ్మ మనవడా 
ఓయ్..నేను దంచితే నీ గుండె దడ దడ దడ దడ 

హే దంచు బేబీ దంచు దంచు బేబీ దంచు

కోరమీసం దువ్వబోకు, కోక చుట్టూ తిరగమాకు.. 
ఎగిరెగిరీ పైన పడకు ఇగురు చూస్తే టముకు టముకు 
కోరమీసం దువ్వబోకు, కోక చుట్టూ తిరగమాకు.. 
ఎగిరెగిరీ పైన పడకు ఇగురు చూస్తే టముకు టముకు 

ఏ కంటపడితేమి ఎవ్వరేమంటే మనకేమీ 
నువ్వు పుట్టంగానే, బట్టకట్టంగానే.. 
నిన్ను కట్టుకునే హాక్కున్న పట్టాదారున్ని నేను 

అరె దంచవే మేనత్త కూతురోయ్.. 
వడ్లు దంచవే నా గుండెలదర
దంచుతా మంగమ్మ మనవడోయ్
నేను దంచితే నీ గుండె దడదడ



రైడ్ పాట సాహిత్యం

 
చిత్రం: రైడ్ (2009)
సంగీతం: హేమచంద్ర 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: దీపు, బబ్లు 

రైడ్



మహివే పాట సాహిత్యం

 
చిత్రం: రైడ్ (2009)
సంగీతం: హేమచంద్ర 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హేమచంద్ర 

మహివే 

Palli Balakrishna Monday, March 19, 2018
Oka Oorilo (2005)


చిత్రం: ఒక ఊరిలో (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం:
గానం: మల్లికార్జున్
నటీనటులు: తరుణ్ కుమార్ , రాజా , సలోని
దర్శకత్వం: రమేష్ వర్మ
నిర్మాత: చంటి అడ్డాల
విడుదల తేది: 01.07.2005

ఒక ఊరిలో మొదలు అయింది
ఒక ప్రేమ కథే ఆ రోజు
ఈ చోటుకే ఏక చరణ మన కనుల ముందే ఈ రోజు

ఒక ఊరిలో మొదలు అయింది
ఒక ప్రేమ కథే ఆ రోజు
ఈ చోటుకే ఏక చరణ మన కనుల ముందే ఈ రోజు

ఏ చోట మలుపు తిరిగెనో తన చివర అ ఆ ఏదో
కథ కంచికె ఎపుడు వెళుతుందో తెలిపేది ఎవరో...

ఒక ఊరిలో మొదలు అయింది
ఒక ప్రేమ కథే ఆ రోజు
ఈ చోటుకే ఏక చరణ మన కనుల ముందే ఈ రోజు

ఒంటరిగా నువ్వుంటే జత చేసుకున్నానే
జంటగానే నన్ను అనుకుంటే నేను ఒంటరిగా చేయిచ్చనే
చితిమంట నను రమ్మందే బ్రతుకింక నాకు లేదే
కడసారి నేను చూడాలి కోన ఊపిరుండగా

ఒక ఊరిలో మొదలు అయింది
ఒక ప్రేమ కథే ఆ రోజు
ఈ చోటుకే ఏక చరణ మన కనుల ముందే ఈ రోజు

తుది క్షణమే ఒక హృదయం  అందే ఒక మాట ఏమందే
ఆ నిజమే కడదాక నాలో అంటుందే
మెతకటి నను చూడందే అటువైపు నువునా
నీ ప్రేమ నేను కాదు అనా ఈ స్నేహము ఉందిలే

ఒక ఊరిలో మొదలు అయింది
ఒక ప్రేమ కథే ఆ రోజు
ఈ చోటుకే ఏక చరణ మన కనుల ముందే ఈ రోజు

Palli Balakrishna Wednesday, December 6, 2017
Veera (2011)


చిత్రం: వీర (2011)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కార్తిక్ , గీతామధురి
నటీనటులు: రవితేజ , కాజల్ అగర్వాల్ , తాప్సి పన్ను
దర్శకత్వం: రమేష్ వర్మ
నిర్మాత: ఇందుకూరి గణేష్
విడుదల తేది: 20.05.2011

ఓసి నా చిట్టీ చిట్టీ ముద్దులే పెట్టీ పెట్టీ
మూడే రప్పిస్తున్నావే
నువ్వు నా గల్లా పెట్టీ గుండెలో గంటే కొట్టి
మోతే మోగిస్తున్నావే

చలో మరి చెయ్యెసుకో నా మీద
మడతేశాక నాతో మరి ప్రమాదాన్నే పర్లేదా
అరె నిన్ను చూసి దిల్లే ఇట్టా దూకేస్తున్నాదే
నీ బొటా బొటి నడుము బలేగుందే

నా కొంగే ఇలా పచ్చ జండా ఊపేస్తున్నాదే
ఈ దూకుడుకు ఊపుడు బండి నీదే

ఓసి నా చిట్టీ చిట్టీ ముద్దులే పెట్టీ పెట్టీ
మూడే రప్పిస్తున్నావే

నన్ను ఎగబడమని ఎదురుగ పడి అందం గిల్లేస్తుందే
ఇక త్వరపడమని తడి పెదవుల తేలే కుట్టేస్తుందే

నిన్ను వదలను అని వయుసుని సెగ రాట్నం తిప్పేస్తున్నాదే
నా అడుగడుగున చలిపిడుగుల తాపం చంపేస్తుందే

పొగిడేసి పడి పడి నీకే మొక్కుతా
నీ బుగ్గే నొక్కుతా నీ మొగ్గే తొక్కేస్తా

శివ శివ కాశీ చిటపటలేంటో చూసేస్తా
నీ వెంటే వచ్చేస్తా

అరె నిన్ను చూసి దిల్లే ఇట్టా దూకేస్తున్నాదే
నీ బొటా బొటి నడుము బలేగుందే

నా కొంగే ఇలా పచ్చ జండా ఊపేస్తున్నాదే
ఈ దూకుడుకు ఊపుడు బండి నీదే

నీ సొగసుల పొడి చిటికెడు పడి
మైకం కమ్మేస్తుందే
నీ కులుకుల ఉలి గది గది గది గుండె చెక్కుతుందే

కొసమెరుపుల ఘని గునపంవలె
చూపే తవ్వేస్తుందే
కసి ముదిరెను కద పదమని
ఈడే దొర్లేస్తున్నాదే

అదిరిందే
పిట పిట మిర్చి మసాలా
నీ నవ్వే  వాంఛలా నా సిల్క్ రుమాల

రుచిమరిగిందే మరి మరి కావాలందే
నీ మీదే పడేలా నా మదే చెడేలా

అరె నిన్ను చూసి దిల్లే ఇట్టా దూకేస్తున్నాదే
నీ బొటా బొటి నడుము బలేగుందే

నా కొంగే ఇలా పచ్చ జండా ఊపేస్తున్నాదే
ఈ దూకుడుకు ఊపుడు బండి నీదే

Palli Balakrishna Sunday, November 26, 2017

Most Recent

Default