Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Puttillu"
Puttillu (1953)




చిత్రం: పుట్టిల్లు (1953)
సంగీతం: టి.చలపతిరావు, మోహన్ దాస్ 
సాహిత్యం: శ్రీ అయ్యపు వెంకట కృష్ణయ్య,
గానం: టి.జి.కృష్ణవేణి (జిక్కి), ఎ.పి.కోమల, కె.రాణి, టి.జి.కమల, మాధవపెద్ది సత్యం, పి.నాగేశ్వరరావు
నటీనటులు: గరికిపాటి రాజారావు, జమున
దర్శక నిర్మాత: గరికిపాటి రాజారావు
విడుదల తేది: 19.02.1953

(ఈ చిత్రం ద్వారా జమున తొలిసారిగా వెండితెరకు పరిచయమయ్యింది)



Songs List:



# పాట సాహిత్యం

 
చిత్రం: పుట్టిల్లు (1953)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: శ్రీ అయ్యపు వెంకట కృష్ణయ్య
గానం: పి.సుశీల & బృందం

మనది భారతదేశమమ్మా 
మనది భారత జాతితల్లి 
భోగాల పుట్టిల్లు తల్లి... 
భూలోక స్వర్గమే సమ్మా 
వీరరుద్రమదేవి ధీరదుర్గారాణి 
రాణాప్రతాపుడూ రసపుత్ర వీరులూ 
తమ శౌర్యమయరక్త ధారాస్రవంతిలో 
తడిపి మెదిపిన వీరధాత్రి ఇదే మా తల్లీ 
ఝాన్సీ మహారాణి అదిగో 
ఆమెయే ఝానిసీ లక్ష్మీ 
ఒక చేతిలో బల్లెమమ్మా 
ఒక చేతిలో కళ్లెమమ్మా 
నడుమునకు ఖడ్గమోయమ్మా 
ఒడలెల్ల రక్తమే తల్లి
మూపుపై పసిబిడ్డతల్లి
అదిగో ! అదిగో ! అదిగో ! అదిగో ! అదిగో !!
ఆమెయే ఝానిస రాణి
ఆమెయే ఝాన్సి లక్ష్మీ
మనకామె తోబుట్టువమ్మా 
మనమామె చెల్లెండ్రమమ్మా 
స్త్రీ వంట ఇంటికై సృష్టించబడినదో!
స్త్రీ విలాసమునకె చిత్రించబడినదో !!
స్త్రీ దాస్యవృత్తికై చేతనంబైనదో !!! 
చెప్పవే మాయమ్మ చెప్పవే మాతల్లీ !



మా అన్నయ్య చదివిస్తాడు పాట సాహిత్యం

 
చిత్రం: పుట్టిల్లు (1953)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: 
గానం: పి.సుశీల

చదివిస్తాడు అన్నయ్య చదివిస్తాడు 
మా అన్నయ్య చదివిస్తాడు

చకచక చదివి టకటక పేపై 
నాన్నను మెప్పిస్తా
మా అమ్మను మురిపిస్తా 
ఆటలు ఆడి పాటలుపాడి 
యాక్టరునైపోతా సినిమా యాక్టరునై పోతా 
పల్లెపల్లె వాడవాడలా పాటను వినిపిస్తా 
నా ఆటను చూపిస్తా
అలలా లలలా

తేటతెలుగులో పాటలు వ్రాస్తా
తీయని తేనియ లొలికిస్తా
నే తీయని తేనియ లొలికిస్తా 
కలిగిన కండల విరిగిన గుండెల 
నవభావం కురిపిస్తా నవజీవం నింపేస్తా
యం.బి.బి.యస్. ప్యానవుతా 
డాక్టర్ నైపోతా 
లేడీ డాక్టరునైపోతా 
తల్లిపిల్లలకు పేదసాదలకు
చక్కని వైద్యం చేస్తా
ఆ... ఆ....ఆ....
చల్లని చేయనిపిస్తా




కనుమోయీ ఓ నెలరాజా పాట సాహిత్యం

 
చిత్రం: పుట్టిల్లు (1953)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: 
గానం: పి.సుశీల

కనుమోయీ ఓ నెలరాజా
కలువల వాణిని కమమోయీ 
అన్నెము పున్నెము తెలియనిదీ 
నిన్నే మిన్నగ నమ్మినదీ 
ఆశనిరాశను చేయకుమా 
కనుమోయి ఓ నెలరాజా

ఆ... ఆ....ఆ....

నీపై మనసును నిలిపినది 
నీ హృదయమునే కోరినదీ 
కోరిక తీర్చుము నెలరాజు
ఆశనిరాశను చేయకుమా
ఆ... ఆ....ఆ....





తొలిచూపులే మరుతూపులై పాట సాహిత్యం

 
చిత్రం: పుట్టిల్లు (1953)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: 
గానం: జిక్కి 

తొలిచూపులే మరుతూపులై
జాగేలనోయ్ సరసుడా 
ఏలనోయ్ సరసుడా
ఏలనోయ్ సరసుడా

జాగేలనోయ్ సరసుడా
ఇదివేళరా రమ్మురా
ఇదివేళరా రమ్మురా
జాగేలనోయ్ సరసుడా
జాగేలనోయ్ సరసుడా

పలుమారు వేడితిని రా
పలుమారు వేడితినిరా
ననుచేరా, నాప్రియుడా రావేరా!
ఏలనోయ్ సరసుడా
జాగేలనోయ్ సరసుడా

వలపు నిలుప జాలనేయి 
వన్నెకాడరాగదోయి 
కరువుదీర కౌగలించి 
మరులు దీర్చరా 
నా మనసు దీర్చరా 
నా మనసు దీర్చరా 
నా మనసు దీర్చరా




ఓహె హెూ బ్యూటీ పాట సాహిత్యం

 
చిత్రం: పుట్టిల్లు (1953)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: 
గానం: కె.రాణి, పిఠాపురం

ఓహె హెూ బ్యూటీ 
దిస్ ఈస్ మై డ్యూటీ
ఆహాహా బ్యూటీ 
మై డియర్ స్వీటీ 
నా హృదిలో నీవొక గదివి 
నీవే నాదేవుని గుడివి
నా కనులకు నివేతార
ఈ జీవికి నీవేడేరా ॥నాక॥

నా చదువే నీ పెదవి
నా ఎద పై నీదే పదవి
మనజీవితమే ఒక సరదా
ఇకలేనేలేదు పరదా
యో...యో...యో




జో జో లాలీ లాలీ పాట సాహిత్యం

 
చిత్రం: పుట్టిల్లు (1953)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: 
గానం: ఎ.పి. కోమల

జో జో లాలీ లాలీ 
జోజో కుమారా సుందరాకారా 
నాకు వెలుగును చూపుతాపూ 
నాపాలి జాబిల్లి నీవూ

ఓ నా చిన్నితండ్రీ నాకన్నతండ్రీ 
నగుమోము నొకసారిచూపి
చిగురాకు చిరుచేతులూపి
చిరునవ్వు వెన్నెలలు కురియరాబాబూ 
నాపాలి జాబిల్లి వీవు నాకు వెలుగును చూపుతావు 

ఓ నా ముద్దుపాపా నాకంటిపాప
చదువులో బాగరాణించి
పదిమందిలో పేరుగాంచి
తెలుగు తల్లి పేరు నిలుపరాబాబూ
నాపాలిజాబిల్లీ నీవూ నాకు వెలుగును చూపుతావూ
జోజో!




వినరా భారత వీరకుమారా పాట సాహిత్యం

 
చిత్రం: పుట్టిల్లు (1953)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: 
గానం: 
 
వినరా భారత వీరకుమారా - విజయము మనదేరా 
ధీరతమెరయగ వైరి గుండియలు జారిపడగనపుడు
ఓ హె దేవా వి॥ దేవా
ఓరుగంటి సింహాసన మెక్కెను పనిత రుద్రమాంబ 
రుద్రమ భగ్గునమండెరా - సైఁ
రుద్రరూపమును దాల్చెరా - సైఁ
బిరబిర నడుము బిగెంచెరా - సైఁ 
పురవడి పరవడి జేసించా

భళానంటిభాయి తమ్ముడా - మేలు భకానోయి దాదానా 
రణభేరి గర్జించేరా - సైఁ 
ధణ ఢణ ధణధణ మ్రోగెరా - సైఁ 
భద్రగజముపై నెక్కి రా - సైఁ 
పఠాకత్తి ఝుళిపించెరా - సైఁ 
పచ్చలు తాపిన కత్తిరా 
కత్తిగాదు అది మిత్తేరా 
బలగాన్నె కదిలించిందా 
వైరులపై లభించిందా

తెలుగునాట రుద్రమ్మ ఖడ్గమే తళతళమెరసిందా 
శరవేగంబున శత్రు సేనలో చొరబడె రుద్రమ్మ 
ధరిణిమిద అరివీరుల శిరములు తరిగి బోసెనమ్మా 
దీరవిహారముచేసె రణంబున విడివడి రుద్రమ్మా 
వైరిబలంబులు చెల్లాచెదరై పరుగులెత్తేనమ్మ 
ఆంతట రుద్రమ - విశాలాంధ్రపై - విజయ ధ్వజమెత్తెనె దేవా !

అంతట

ప్రజామోదముగ ముప్పది ఏడులు పాలించినదామె 
అట్టిజాతిలో పుట్టిన స్త్రీలకు పట్టినగతివినుడో
పట్టెడుకూటికి బానిసయై పడుపాట్లు పాట్లు గాదో
ఇంటి కుక్క  కున్నంతవిలువ నేడిల్లాలికి లేదా
ఇంటిదాసిగా నుంటానని
ప్రతినెంత వేడుకొనినా
జాలివలచక నవ్వి పకపక కాలదన్నె మగడు
ఆలిని బటబట బైటికీడ్చునా
అపనిందలు మోపి
వలవల కులసతి
కన్నీరొలకబోయుటేలా
నిలువ నీడలేదాయెగదమ్మా
నీకు సుగుణశీల





ఎందుకురా మీకెందుకురా పాట సాహిత్యం

 
చిత్రం: పుట్టిల్లు (1953)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: 
గానం: 

ఎందుకురా మీకెందుకురా 
ఆలీమగడూ నడానజగడం
తాలిగట్టినోడ్ని నన్ను. కాలదన్ని పోతనంటే 
పూరుకుంట మెట్టాగో మరి మీరేచెప్పండి, 
పెద్దలు తీరుపుచెప్పండి బాబులు తేలిచి చెప్పండి 

సిలకా గోరింకలమల్లె కలిసి మెలసుండే 
మీకు ఎందులకే మీకెందులకే 
ఆలీమగడూ నడానజగడం 
ఎందులకే మీకెందులకే
పొద్దున్నే లేచీ పోతాడేడకొ 
బువ్వకుమాత్రం వస్తాడు 
మచ్చుకైనా ఒకకానీ ఇంటికి 
తెచ్చిన రోజేలేదూ నా కిచ్చిన రోజేలేదు
పిల్లా మేకను సాకేదెట్లో
మీరేచెప్పండి పెద్దలు తిరుపు చెప్పండి 
బాబులు తేలిచి చెప్పండి. 

ఎక్కడి కెడితేనేమి?
తైతక్క లాడితేనేమి?
తెగించి ఆడది మొగుణ్ణి బట్టుక 
అజలు ఆడుగుతుండా నన్నది 
అదమా యిస్తుందా 

పిల్లలకన్నం పెట్టకపోగా
పెళ్లాంరెక్కల కష్టంతింటూ
బజారు వెంటా బతాయికొడుతూ
తిరిగేవాళ్లూ మొగోళ్లా?
బతికేవోళ్లూ మొగోళ్లా? 
పెద్దమొగోగోళ్లా బలేమొగోళ్లూ

సెబాసైనమాటడిగిందాడదీ 
జవాబియ్య వేరా? మొగోడా జవాఓయ్య వేరా? 
మొద్దులాగ నిలబడతావేరా 
పెద్దల ఎదుటా దగ్దమ్మా ఓ దద్దమ్మా?

పెద్దలు చెప్పినదింటా
బుద్ధిగలిగి నేనుంటా
బిడ్డతోడుచెబుతున్నా
చేసిన తప్పుకు లెంపలేసుకొని 
బుద్ధిగలిగి నేనుంటా
బుద్ధిగలిగి నేనుంటా
బిడ్డతోడు. చెబుతున్నా
బుద్ధికలిగినీవుంటే ఓమామ 
ఇద్దరముసుఖపడతాం ఓమామ 
మనమిద్దరముసుఖపడతాం
ఓమామ
ఓహె పిల్లా ఓ హెరా మామా

సంసారంలో సారం దొరికితే
ఆనందం పరమానందం 
ఆలీమగడూ తోడునీడగా 
ఆడిన, పాడిన, ఆనందం అనందం, 
పరమానందం పరమానండం, బ్రహ్మానందం.




తాతయ్యా! తాతయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: పుట్టిల్లు (1953)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: 
గానం: పి.సుశీల

తాతయ్యా! తాతయ్యా 
నీకూ నాకూ తాతయ్యా 
మనతెలుగుజాతికే తాతయ్య 
ఈ కందుకూరి తాతయ్యా 

మూడుకాళ్లతో నడిచేముదుసలి 
మూడో పెళ్ళికి ముస్తాబై 
మూడేళ్లయిన దాటనిపిల్లకు
తాడుగట్ట తగదన్నాడు 
ఆది తాడుగాదు ఉరితాడన్నాడు. 
సంసారమనేదొకబండి 
ఆలీమగడూ చక్రాలూ రెండుచక్రములూ 
సరిసమానముగ ఉంటేనే బండన్నాడు 
లేకుంటే అది మొండన్నాడూ
పతికిబానిసై మొతుకు దూరమై 
గతుకులమారి బ్రతుకై 'తల్లడిల్లు 
నీ తల్లిని నేటికి స్వేచ్ఛాజీవిని చేశాడూ 
స్త్రీ జాతికి జీవం పోశారు.
చితికిపోయిన స్త్రీలోకానికి 
నూతనమార్గము చూపి 
తాతకు మంచి ఖ్యాతిగడించి. 
జాతికి మేలూకూర్చుమురా 
నీ తల్లీ ఆశలు తీర్చుము రా

Palli Balakrishna Friday, August 20, 2021

Most Recent

Default