Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Kamran"
Sridevi Shoban Babu (2022)



చిత్రం: శ్రీదేవి శోభన్ బాబు (2022)
సంగీతం:  కమ్రాన్
నటీనటులు: సంతోష్ శోబన్, గౌరీ కిషన్
దర్శకత్వం: ప్రశాంత్ కుమార్ దిమ్మల 
నిర్మాణసంస్థ: గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్
విడుదల తేది: 2022



Songs List:



# పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీదేవి శోభన్ బాబు (2022)
సంగీతం:  కమ్రాన్
సాహిత్యం: రాకేందు మౌళి 
గానం: జునాయిద్ కుమార్ 

ఓ ఓ, నిదురను తరిమిందిలా
చెలి చూపుల ఊయలా
చెదిరెను కుదిరే ఇలా
ఇది కాదేమో కలా

అణువణువున అందమే నిండిన
కవితే నువ్వా, ఆ ఆ
దివి దారే తప్పిన దేవత
భువినే చేరెనా..!

లోకం మొత్తము ఏకం చేసినా
తూకం వేసినా సరిపోదు
ఎన్నో వింతలా ఒకే అద్భుతం
అది తనుకాకెవరూ

నిను చూశాక మతిపోయిందే
మది నామాటే విననంటుందే
నిను చూశాక (నిను చూశాక)
మతిపోయిందే (మతిపోయిందే)
మది నామాటే విననంటుందే

ఊహే ఎందుకే… ఎదురే నువ్వే ఉండగా
కలనే తలదనే… ఓఓ, నిజమే నీవుగా
నీకన్నా నాకున్న నిధి ఏది లేదన్న
ఏ సంపదైనా నాకొద్దందునే
ఆ నిన్న అటు మొన్న
నువ్వు లేని సమయాన
నా గతము గురుతుండదే

ఎదే మారినా కధే మారునా
విధే మారెనే మన కోసం
యధాలాపన సదా నీవని
తలపును తరిమినదీ

నిను చూశాక మతిపోయిందే
మది నామాటే విననంటుందే
నిను చూశాక (నిను చూశాక)
మతిపోయిందే (మతిపోయిందే)
మది నామాటే, ఏ ఏఏ… విననంటుందే

కలవని కాలమే మనమే
కలపగ పిలిచెనా
రాగల క్షణములో
నీతో జతగా నడవనా

ప్రతి పూటకో పండగా
నువు నేను మనమైతే
అడుగేసి పోదాం పదా
అవునంటే, ఏ ఏఏ

ఇదేంమ్మాయలో అదే హాయిలో
ఎదో లోయలో పడిపోయా
అమాంతం నిన్నే అదే చోటకే
తీసుకు వెళ్ళిపోనా

నిను చూశాక (నిను చూశాక)
మతిపోయిందే (మతిపోయిందే)
మది నామాటే, ఏ ఏఏ… విననంటుందే
నిను చూశాక మతిపోయిందే
మది నామాటే విననంటుందే

నిను చూశాక… మతిపోయిందే
మది నామాటే… విననంటుందే
నిను చూశాక… మతిపోయిందే


Palli Balakrishna Saturday, April 23, 2022
Tripura (2015)









చిత్రం: త్రిపుర (2015)
సంగీతం: కమ్రన్
సాహిత్యం: 
గానం: కార్తీక్
నటీనటులు: నవీన్ చంద్ర, స్వాతి
దర్శకత్వం: రాజ్ కిరణ్
నిర్మాత: ఏ. చినబాబు, ఎమ్. రాజశేఖర్
విడుదల తేది: 06.11.2015

నిను చూడకుండమనసు ఉండదే
మది పదే పదే నీవైపే లాగుతున్నదే
నీ చూపు లోన పిలుపు ఉన్నదే
అది సదా సదా నీ నీడై సాగమన్నదే

కునుకు రాదు కుదురు లేదు ఒక క్షణమైనా
అదుపు లేదు వలపు రాదు కలయికలోనా

నిను చూడకుండ మనసు ఉండదే
మది పదే పదే నీ వైపే లాగుతున్నదే

వేల ముత్యాలు కోటి రత్నాలు
నీ కాలి ముందుంచనా...
పూల మేఘాలు పుణ్య భోగాలు
నీ చేతికందించనా

అంతరిక్షంలో వింతలేవైనా
నీ ముందు బంధించనా
కోంత సేపైనా చేంత లేకుంటే
నా గుండే స్పందించునా

కిల కిల నిన్నే నవ్వించనా
కలతల్ని అన్ని కరిగించనా
మరి మరి నిన్నే ప్రేమించగా
మరు మరు జన్మే జన్మించనా

నిను చూడకుండ మనసు ఉండదే
మధి పదే పదే నీ వైపే లాగుతున్నదే

వెంట నువుంటే ప్రేమ దేశనా
మహరాజు నేనవ్వనా
జంట నువుంటే రాణి అందాల
రాజ్యాలు పాలించనా

కవుగిలింతల్లో కంచే వేసేసి
కాలాన్ని ఆపేయ్యనా
కంట నీరంటు జారనీకుండ
ప్రాణాన్ని అడ్డేయ్యనా

కల కల నువ్వే కరుణించితే
గల గల నేనే గెలిపించనా
కోర కోర మంటు కలహించితే
విలవిల మంటు విలపించనా

నిను చూడకుండ మనసు ఉండదే
మధి పదే పదే నీ వైపే లాగుతున్నదే


Palli Balakrishna Saturday, January 16, 2021

Most Recent

Default