Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Gomtesh Upadhye"
Neeve (2016)


చిత్రం: నీవే (2016)
సంగీతం: ఫణి కళ్యాణ్
సాహిత్యం: శ్రీజో
గానం: యాజిన్ నజీర్, సమీరా భరద్వాజ్
నటీనటులు: నిరంజన్ హరీష్ , శ్రేయదేశ్ పాండే
దర్శకత్వం:
నిర్మాత:
విడుదల తేది:

నీవే... తొలి ప్రణయము నీవే
తెలి మనసున నీవే
ప్రేమ ఝల్లువే నీవే... నీవే

కలలు మొదలు నీవల్లే
మనసు కడలి అలలు నీవల్లే
కనులు తడుపు నీవే
కలత చెరుపు నీవే
చివరి మలుపు నీవే

నీవే... యెటు కదలిన నీవే
నను వదిలిన నీవే
ఎదో మాయవే
ఆఁ ప్రేమే... మది వెతికిన నీడే
మనసడిగిన తోడే నా జీవమే

చరణం: 1
నిలువనీదు క్షణమైనా
వదలనన్న నీ ధ్యాసా
కలహమైన సుఖమల్లే
మారుతున్న సంబరం

ఒకరికొకరు ఎదురైతే
నిమిషమైన యుగమేగా
ఒక్కోసారి కనుమరుగై
ఆపకింక ఊపిరీ

నీవే... గడిచిన కథ నీవే
నడిపిన విధి నీవే నా ప్రాణమే
ఆఁ పాదం... వెతికిన ప్రతి తీరం
తెలిపిన శశి దీపం నీ స్నేహమే

చరణం: 2
నీ జతే విడిచే
ఊహనే తాళనులే
వేరొకా జగమే
నేనికా ఎరుగనులే

గుండెలోని లయ నీవే
నాట్యమాడు శృతి నేనే
నువ్వు నేను మనమైతే
అదో కావ్యమే

నీవే నను గెలిచిన సైన్యం
నను వెతికిన గమ్యం నీవే నా వరం
ఆఁ ప్రేమే... తొలి కదలికలోనే
మనసులు ముడి వేసే ఇదో సాగరం

Palli Balakrishna Sunday, July 16, 2017

Most Recent

Default