చిత్రం: ఎందుకంటే ప్రేమంట (2012)
సంగీతం: జి. వి. ప్రకాష్ కుమార్
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి
గానం: హరిచరణ్ , చిత్ర
నటీనటులు: రామ్, తమన్నా
దర్శకత్వం: ఏ.కరుణాకర్
నిర్మాత: స్రవంతి రవికిశోర్
విడుదల తేది: 08.06.2012
పల్లవి:
నీ చూపులే నా ఊపిరి
ఓసారిలా చూడే చెలీ
అమవాసనై ఉన్నా చెలీ
అందించవే దీపావళి
ఎందుకే చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా
కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసీ చూడవెలా
నయనం హృదయం నీవే నీవై
సమయం వెనకే చేశా పయనం
తదుపరి జన్మ కైనా జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరాపనా
చరణం:
రోజూ కొత్తగా నీ సందర్శనం
ఆహా అన్నది నాలో స్పందనం
నిత్యం నువ్విలా నాకై చూడటం
ఎంతో వింతగా ఉందీ అనుభవం
నడి వేసవిలో మరిగిస్తూనే మురిపిస్తోందే నీ చల్లదనం
ఎద మంటంతా దాచేస్తూ వెన్నెలయింది ప్రేమ గుణం
నీకై వేచే నిట్టూరుపులే తూరుపు కానీ
నీ తలపులలో తలమునకవనీ ఎన్నో జన్మలనీ
నయనం హృదయం నీవే నీవై
సమయం వెనకే చేశా పయనం
తదుపరి జన్మ కైనా జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరాపనా
చరణం:
నీతో బంధమే రాసిందెవ్వరో
నిన్నే నాకిలా చూపిందెవ్వరో
నన్నీవైపుగా లాగిందెవ్వరో
నిన్నే చూడగా ఆపిందెవ్వరో
దరిదాపుల్లో పడిగాపుల్లోపడి నిలిచానే రహదారుల్లో
తొలి వెలుగల్లే వస్తాలే కలిసే రేపటి పొద్దుల్లో
నీ చూపులే నా ఊపిరి
ఓసారిలా చూడే చెలీ
అమవాసనై ఉన్నా చెలీ
అందించవే దీపావళి
ఎందుకే చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా
కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసీ చూడవెలా
నయనం హృదయం నీవే నీవై
సమయం వెనకే చేశా పయనం
తదుపరి జన్మ కైనా జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరాపనా
Endukante... Premanta! (2012)
Palli Balakrishna
Tuesday, August 15, 2017