Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Ajay Bhupathi"
Maha Samudram (2021)





చిత్రం: మహా సముద్రం (2021)
సంగీతం: చైతన్ భరద్వాజ్
నటీనటులు: శర్వానంద్, సిద్ధార్ద్, అదితి హైదరి, అనుఇమాన్యుయేల్
దర్శకత్వం: అజయ్ భూపతి
నిర్మాత: అనీల్ సుంకర
విడుదల తేది: 14.10.2021



Songs List:



హే రంభ..రంభ పాట సాహిత్యం

 

చిత్రం: మహా సముద్రం (2021)
సంగీతం: చైతన్ భరద్వాజ్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: చైతన్ భరద్వాజ్

హే మందే ఇక మందే… ఇసాఖపట్నం బీచు
తాగొచ్చు ఊగొచ్చు… ఏదైనా చెయ్యొచ్చు
కొట్టెయ్ జై కొట్టేయ్… మనమంతా రంభ ఫ్యాన్సు
కట్టేద్దాం బ్యానర్సు… పెట్టేద్దాం కటౌట్సు

కొర్రామీను మాదిరి వర్రా వర్రగుంటది
కుర్రాగాళ్ళ గుండెకి గాలం వేస్తదిరా
ఎర్ర పెదవి కొరికితే… సర్రాసరి నవ్వితే
బుర్ర తిరిగిపోతది… గిర్రా గిర్రా గిర్రా గిర్రా

ఓ రంభ రంభ… హే రంభ హే రంభ
రంభ రంభ రంభ రంభ
హే రంభ హే రంభ… పండగే ప్రారంభ
హే రంభ హే రంభ… రంభ రంభ రంభ రంభ
హే రంభ హే రంభ… ఎక్కడే గుడుంబా

సోడా ఐస్ లేకుండా రెండు నైంటీలు గనక పీకామనుకో
బాడీలో రంభ డాన్సు ఆడెద్దిరా మావా

ఈల కొట్టెయ్ కొట్టెయ్… సౌండ్ పెట్టెయ్ పెట్టెయ్
డాన్సు కట్టెయ్ కట్టెయ్… దుమ్మే రేగాలా
పూలు ఏసెయ్ ఏసెయ్… బీరు పోసెయ్ పోసెయ్
కోడి కోసెయ్ కోసెయ్, హే హే

హే దీని అందం… మత్తు మందు సమానమే
మునిగిపోదా దూకెయ్
దీని నడుం బాణాసంచా దుకాణమే
ముట్టుకుంటే అది చాలా చాలా ప్రమాదం

ఓ రంభ రంభ… హే రంభ హే రంభ
రంభ రంభ రంభ రంభ
హే రంభ హే రంభ… పండగే ప్రారంభ
హే రంభ హే రంభ… రంభ రంభ రంభ రంభ
హే రంభ హే రంభ… ఎక్కడే గుడుంబా

సాక్షాత్ శ్రీకృష్ణుడే… ఓ వేలితోటి కొండనెత్తాడే
అరె ఒంటి చేత్తో ఆంజనేయుడే
మరి సంజీవని ఎత్తుకొచ్చాడే
అయ్య బాబోయ్ మనవల్ల కాదు
మనమంతటి గొప్పోళ్ళం కాదు
ఓ సీసానైనా ఎత్తకపోతే ఎట్టా మావా..?

ఓ రంభ రంభ… హే రంభ హే రంభ
రంభ రంభ రంభ రంభ
హే రంభ హే రంభ… పండగే ప్రారంభ
హే రంభ హే రంభ… రంభ రంభ రంభ రంభ
హే రంభ హే రంభ… ఎక్కడే గుడుంబా



చెప్పకే చెప్పకే పాట సాహిత్యం

 
చిత్రం: మహా సముద్రం (2021)
సంగీతం: చైతన్ భరద్వాజ్
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: దీప్తి పార్థసారథి, చైతన్ భరద్వాజ్, చైతన్య ప్రసాద్

చెప్పకే చెప్పకే ఊసుపోని మాటలు
చాలులే వేలాకోలం ఊరుకో
నేర్పకే నేర్పకే లేనిపోని ఆశలు
మనసా మళ్ళీ రాకు వెళ్ళిపో

ఎగసే కలలే అలలై… యెదనే ముంచేసేలే
కదిలే కథలే కడలై… ఉప్పెనల్లే ఊపేసేలే
ఎందుకీ బంధాలన్నీ కలపకులే, నిలపకులే
గెంటేస్తాను గెంటేస్తాను… నిన్నిక ఇపుడే

మనసా కనబడితే ఎదురుగ నిలబడితే
చంపేస్తాను చంపేస్తాను తొందరపడితే

చల్లనైన చూపు నువ్వే… మంచి గంధపు మాట నువ్వే
ముళ్లకంచెలన్నీ తెంచి… పూల బాటవయ్యావే
మోయలేని హాయి నువ్వే… నన్నే మార్చిన మాయ నువ్వే
ముందు నువ్వు వెళ్తావుంటే… వెంట నీడనయ్యానే

వేసవి వేడిలో లేతగాలై వచ్చావే
మమతే కురిసి మనసే తడిసెలే
నువు నా జతగా ఉంటె… బతికా నే ధైర్యమై
తెలిసేనిపుడే ఇపుడే… జీవితాన మాధుర్యమే

వింతగా నన్నే నేను మరచితినే, మురిసితినే
నిన్నా లేని మొన్నా లేని… వెన్నెల విరిసే, మ్ మ్
మదికొక మది దొరికే… కలతల కథ ముగిసే
అంతే లేని సంతోషాల కాంతులు కురిసే

నువ్వు నేను వేరు అన్నా… నీవైపస్సలు చూడకన్నా
దొంగలాగ కళ్ళే నిన్నే… తొంగి తొంగి చూసాయే
పగ్గమేసి ఆపుతున్నా… ప్రేమే కాదిది స్వార్ధమన్నా
సిగ్గులేని కళ్ళే ముగ్గులోకి తోసాయే

నా మదే ఈ విధి ప్రేమ మదే అయిందే
కుదురే మరచి వరదై ఉరికెలే
తపమే తపమై జపమై… నిలిచా నీకోసమే
జడిలా ముసిరే కసిరే… జ్ఞాపకాల్ని తోసేసాలే

ప్రేమకే రూపం నువ్వు అని తెలిసే, మది మురిసే
గుండె తీసి దండే చేసి రమ్మని పిలిచే
ఎద ఇది నిలవదులే… నిను ఇక వదలదులే
ఆనందాల మహాసంద్రామాయను మనసే



హే తికమక పాట సాహిత్యం

 
చిత్రం: మహా సముద్రం (2021)
సంగీతం: చైతన్ భరద్వాజ్
సాహిత్యం: కిట్టు విస్సా ప్రగడ
గానం: హరిచరణ్, నూతన్ మోహన్,   చైతన్ భరద్వాజ్

హే తికమక మొదలే… ఎద సొద వినదే
అనుకుందే తడువా… తెగ నచ్చి నచ్చి పిచ్చే పట్టే

హే తెలియక తగిలే… తొలకరి చినుకే
మొహమాటం ఒడిలో… సరదాగా జారి వానై మారే

హే ఎటుపోనుందో దగ్గరగా ఉన్నా దూరాలే
చెలి గాలుల్లో పంతంగుల్లాగా తూలే

అడగాలన్నా చిత్తడి చూపుల్లో ఏముందో
పెదవంచుల్లో రహస్యంలోన తలమునకలివే

ఆ, తెగ తడబడుతూ పొరబడుతూ నిలబడితే ఎలా
అరకొర చనువే వద్దొద్దని అడక్క నిలిచే

ఆ, పదుగురి ఎదురే… కొరకొరగా ఎగబడితే ఎలా
తనువును తడిపే కలబడితే గప్ చుప్ అని మనస్సునడిగే

నక్కీ నక్కీ దాక్కుంటుంటే లోలో అందాలే
వెతికినది విసిరినది చూపు కౌగిలే

తట్టి తట్టి తాకిందేమో ప్రేమే వానల్లే
మిన్నే మన్నే మన ఇద్దర్లా మారాయే

ఏ క్షణమైనా తనలోని ప్రేమంతా
ఒక్కింతైనా టెన్ టూ ఫైవ్ తిరిగొస్తుందేమో
ఏ వివరం నచ్చి మెచ్చి ఉబ్బి తబ్బిబ్బయ్యిందో
ఎద కడలిలో అలలుగా ఎగసేనా

ఆ, పదుగురి ఎదురే… కొరకొరగా ఎగబడితే ఎలా
తనువును తడిపే కలబడితే గప్ చుప్ అని మనస్సునడిగే

నచ్చి నచ్చి పైపై వాలే ప్రేమే చూపించే
మగువనలా చులకనగా చూడరాదుగా

వచ్చి వచ్చి వాలిందేమో సీతాకోకల్లే
కన్నె కళ్ళే నా యద గుట్టే లాగాయే

హే ఎగసిందా లోలోన ఆరాటం
కాసేపైనా దాచే పని లేదా
నా కలలో కూడా నువ్వే వచ్చి
పిచ్చే పట్టించి ఏమెరుగక ఎదురుగా నిలవాలా

ఆ, పదుగురి ఎదురే… కొరకొరగా ఎగబడితే ఎలా
తనువును తడిపే కలబడితే గప్ చుప్ అని మనస్సునడిగే




జగడాలే రాని పాట సాహిత్యం

 
చిత్రం: మహా సముద్రం (2021)
సంగీతం: చైతన్ భరద్వాజ్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం:  హేమచంద్ర, చైతన్ భరద్వాజ్

ఎపుడు నువు తలెత్తుకో
నిను మించిన తోపెవడిక్కడ
వడిగా కలబడిపో
భయపడితే బతకవు ఎక్కడ

తిడితే నువు పడొద్దురోయ్
తేల్చేసెయ్ ఎక్కడికక్కడ
కొడితే ఎదురెలిపో
దీని తస్సాదియ్యా

నే చెప్పిన లక్షణాలు
చూపించవు పుస్తకాలు
నా వెంబడి నేరుగా… వస్తే చూపిస్తా

నేనొకడికి లొంగడాలు
ఓ పడిపడి మొక్కడాలు
నా ఒంటికి పడదుగా
తమాషాలొద్దు నాతో

జగడాలే రాని రాని చూసుకుందాం
చావోరేవో తేలిపోద్దిలే
కెరటాల తోటి పోటి దేనికంట
లెక్క పత్రం రాసుకోదులే

ఎపుడు నువు తలెత్తుకో
నిను మించిన తోపెవడిక్కడ
వడిగా కలబడిపో
భయపడితే బతకవు ఎక్కడ

తిడితే నువు పడొద్దురోయ్
తేల్చేసెయ్ ఎక్కడికక్కడ
కొడితే ఎదురెలిపో
ఎవడైతే ఏంటి కాతర

లోకమెపుడు అరె బ్రదరు
డేగ కళ్ళతో చూస్తు ఉంటది, వదులదురా
నువు అవ్వకు కోడి… మిగలదు బాడీ

అన్ని వేళల శాంతి మంత్రము
వల్లెవేయకు కట్టేస్తారు పాడి
ఆ సంగతి తెలుసు నాకు
కాబట్టే పొగరు నాకు
ఆ మాత్రం ఉండడం తప్పేం కాదంటా

మైండ్ ఉన్నోడెవ్వడైన
నాలాగే బతుకుతాడు
నే చెప్పే మాటకే
చెయ్యెత్తి మొక్కుతాడు

ఎపుడు నువు తలెత్తుకో
నిను మించిన తోపెవడిక్కడ
వడిగా కలబడిపో
భయపడితే బతకవు ఎక్కడ

తిడితే నువు పడొద్దురోయ్
తేల్చేసెయ్ ఎక్కడికక్కడ
కొడితే ఎదురెలిపో
దీని తస్సాదియ్యా

జగడాలే రాని రాని చూసుకుందాం
చావోరేవో తేలిపోద్దిలే
కెరటాల తోటి పోటి దేనికంట
లెక్క పత్రం రాసుకోదులే (2)



మనసు మరిగే మౌనమే పాట సాహిత్యం

 
మనసు మరిగే మౌనమే

Palli Balakrishna Thursday, August 19, 2021
Rx 100 (2018)




చిత్రం: Rx 100 (2018)
సంగీతం: చైతన్య భరద్వాజ్
నటీనటులు: కార్తిక్ , పాయల్ రాజ్పుత్
దర్శకుడు: అజయ్ భూపతి
నిర్మాత: అశోక్ రెడ్డి గుమ్మకొండ
విడుదల తేది: 13.07.2018



Songs List:



నిప్పై రగిలే పాట సాహిత్యం

 
చిత్రం: Rx 100 (2018)
సంగీతం: చైతన్య భరద్వాజ్
సాహిత్యం: చైతన్య వర్మ 
గానం: రాహుల్ సిప్లిగంజ్ 

నిప్పై రగిలే 




రెప్పలనిండా పాట సాహిత్యం

 
చిత్రం: Rx 100 (2018)
సంగీతం: చైతన్య భరద్వాజ్
సాహిత్యం: శ్రీమణి 
గానం: హరిచరణ్ 

రెప్పలనిండా కలగనకుండా
వెన్నెల్ల వాన అనుకోకుండా
పెదవలనిండా మాటలవాన
అలలు యెగసెనులె
ఈ మట్టిలోన పూసె రోజ పూలె
రాగాలు కురిసె వెదురులె
ఇన్నాళ్ళుగ ఇన్నెళ్ళుగ
నాలొ లేవి మహిమలే

కొడవలినిండా కుంకుమ పూలే
కడవలనిండ మందారాలే
పడవలనిండ పట్టు తెరలే
అడుగులనిండ ఆకశాలె వాలేనులెఏ

పట్టు గుబురు దాటె సీతకోక చిలుకలా
మిట్ట కలలు దాటె అందమైన నిజముల
పట్టి లాగెనె పట్టు తీగ నన్నిల
యెమయ్యిందో నాకేమయ్యిందో

వద్దంటున్న నీ ముద్దె నన్ను
రమ్మంటుందె నను చంపేసిందే
రై రై రంగులువై ఎన్నాడు చూడనిదై
గుండెలో బొమ్మల్లె పూసె

కొడవలినిండా కుంకుమ పూలే
కడవలనిండ మందారాలే
పడవలనిండ పట్టు తెరలే
అడుగులనిండ ఆకశాలె వాలేనులే

చంటి పాపలాగ చిందులేవొ వేస్తున్న
ఒంటరోన్ని ఇట్టా తుంటరోన్ని చేస్తున్న
వెండి వెన్నలై యెండలోనె కాస్తు వున్న
యేమయ్యిందో నాకెమయ్యిందో

రోజు చూసె నా దారులు కూడ
నేనె ఎవరొ మరి మరిచేసాయే
ఎన్నొ ఎన్నెన్నొ వింతలు నాలోన
యెన్నడు ఊహించనివేగా

కొడవలినిండా కుంకుమ పూలే
కడవలనిండ మందారాలే
పడవలనిండ పట్టు తెరలే
అడుగులనిండ ఆకశాలె వాలేనులే




అదిరే హృదయం పాట సాహిత్యం

 
చిత్రం: Rx 100 (2018)
సంగీతం: చైతన్య భరద్వాజ్
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: కార్తీక్ 

అదిరే హృదయం అదిరే అదరం
మధురం మధురం నీతో జత
ముదిరే ప్రణయం ముసిరే ప్రణయం
కరిగే పరువం నీ కౌగిట

నీ వలపుల ఒడిలో
తలపుల సుడిగాలిలో కడ తెరనా
ప్రియ ప్రియా సఖి ప్రియా
భ్రమా నిజం తెలియని వరమా
ఇలా ఇలా నువ్వాగిపో
కలై శిలై క్షణకాలమా

అందాల ఆడ సింహమా
చందనాల శిల్పమా
కోడె నాగు వేగమా
నన్నెచేరే నీవుగా
నీతో ఆడే ఆటలే
ముద్దుల సాగే వేటలే
పక్కని వీడి స్వర్గాలు దాటే ఎలా
మహా మహా ఆగాధమా
నిన్నే నిన్నే తెలియగ తరమా
ఇలా ఇలా నువ్వాగిపో
కలై శిలై క్షణకాలమా

చల్లరిపోతే మొహామ
మంటలాగా రేగుమ
కంట నీరై జారుమ
నరాల్లో నినదమ
నువ్వే నాతో లేనిదే
నాలోన ఏకం కానిదే
ఈలోకమంతా నా కంటికె సూన్యమే….
ఇదే ఇదే సుఖం ఇదే
ఇహం పరం ఇపుడిక మనమే
ఇలా ఇలా నువ్వాగిపో
కలై శిలై క్షణకాలమా

అదిరే హృదయం అదిరే అదరం
మధురం మధురం నీతో జత

నీ వలపుల ఒడిలో
తలపుల సుడిగాలిలో కడ తెరనా
ప్రియ ప్రియా సఖి ప్రియా
భ్రమా నిజం తెలియని వరమా
ఇలా ఇలా నువ్వాగిపో
కలై శిలై క్షణకాలమా



పిల్లా రా పాట సాహిత్యం

 
చిత్రం: Rx 100 (2018)
సంగీతం: చైతన్య భరద్వాజ్
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: అనురాగ్ కులకర్ణి

పల్లవి:
మబ్బుల్లోన వానవిల్లులా
మట్టిలోన నీటి జల్లులా
గుండెలోన ప్రేమ ముళ్లులా
దాగినావుగా

అందమైన ఆశతీరక
కాల్చుతుంది కొంటె కోరిక
ప్రేమ పిచ్చి పెంచడానికా 
చంపడానికా!

కోరుకున్న ప్రేయసివే
దూరమైన ఊర్వశివే
జాలిలేని రాక్షసివే
గుండెలోని నా కసివే

చేపకళ్ల రూపసివే
చిత్రమైన తాపసివే
చీకటింట నా శశివే
సరసకు చెలీ చెలీ రా..

ఎలా విడిచి బతకనే పిల్లా రా
నువ్వే కనబడవా కళ్లారా
నిన్నే తలచి తలచిలా ఉన్నాగా
నువ్వే ఎద సడివే అన్నాగా

ఎలా విడిచి బతకనే పిల్లా రా
నువ్వే కనబడవా కళ్లారా
నిన్నే తలచి తలచిలా ఉన్నాగా
నువ్వే ఎద సడివే...

మబ్బుల్లోన వానవిల్లులా
మట్టిలోన నీటి జల్లులా
గుండెలోన ప్రేమ ముళ్లులా 
దాగినావుగా

అందమైన ఆశతీరక
కాల్చుతుంది కొంటె కోరిక
ప్రేమ పిచ్చి పెంచడానికా 
చంపడానికా!

చరణం: 1
చిన్నాదాన ఓసి అందాల మైన
మాయగ మనసు జారి పడిపోయెనే
తపనతో నీవెంటే తిరిగెనే
నీ పేరే పలికెనే నీలాగే కులికెనే
నిన్ను చేరగా

ఎన్నాళ్ళైన అవి ఎన్నేళ్ళు అయినా
వందేళ్ళు అయినా వేచి ఉంటాను నిన్ను చూడగ
గండాలైన సుడి గుండాలు అయినా
ఉంటానిలా నేను నీకే తోడుగా

ఓ ప్రేమ మనం కలిసి ఒకటిగ ఉందామా
ఇదో ఎడతెగని హంగామా
ఎలా విడిచి బతకనే పిల్లా రా 
నువ్వే కనబడవా..

చరణం: 2
అయ్యో రామ ఓసి వయ్యారి భామ
నీవొక మరుపురాని మృదు భావమే
కిల కిల నీ నవ్వు తళుకులే
నీ కళ్ళ మెరుపులే కవ్విస్తూ కనపడే గుండెలోతులో

ఎం చేస్తున్నా నేను ఏ చోటవున్నా
చూస్తూనే ఉన్నా
కోటి స్వప్నాల ప్రేమ రూపము
గుండె కోసి నిన్ను అందులో దాచి
పూజించన రక్త మందారాలతో
కాలాన్నే మనం తిరిగి వెనకకే తోద్దామా
మళ్ళీ మన కథనే రాద్దామా

ఎలా విడిచి బతకనే పిల్లా రా 
నువ్వే కనబడవా...




రుధిరం మరిగి పాట సాహిత్యం

 
చిత్రం : RX-100 (2018)
సంగీతం : చైతన్ భరద్వాజ్
సాహిత్యం : సిరశ్రీ 
గానం : దీప్తి పార్ధసారధి , సాయి చరణ్ 


రుధిరం మరిగి 




మనసుని పట్టి పాట సాహిత్యం

 
చిత్రం : RX-100 (2018)
సంగీతం : చైతన్ భరద్వాజ్
సాహిత్యం : శ్రీమణి
గానం : హరిచరణ్, ఉమానేహ

యే ఎవరె ఎవరె మనసుని పట్టి
దారం కట్టి ఎగరేసారె గాలిపటంలా
యే ఎవరె ఎవరె అడుగును పట్టి
చక్రం కట్టి నడిపించారె పూల రధంలా
ఎవరెవరొ కాదది నీ లోపల
దాక్కుండె టక్కరి నేనేగా
ఎక్కడని చూస్తావె నీ పక్కనె ఉన్నానుగా
అరె ఈ మాటె మరో సారి చెప్పెయ్
అమ్రుతంల వింటానె వందల సార్లైనా
నీ పాట వస్తానె లక్షల మైళ్ళైనా నీ వెంట
తరకు తరకు తర తరకు తరకు తర తరకు తరకు తర

విన్నావ మైన గుండెల్లోనా హైన రాగలెన్నో
ఎగిరె టూన చేపల్లోన సోనా మెరుపులు ఎన్నో
నీలొ రెగిన వేగం కల చెరిపె గాలుల రాగం
అలజడిలొ గువ్వల గొడవె నే మరిచేస
చూశావ మబ్బుల ఒల్లె రుద్దె
మెరుపుల సబ్బులు ఎన్నొ
ఎర్రని సూర్యుని తిలకం దిద్దె
సాయంకాలం కన్ను
ఎమైనా... ఇంతందం చెక్కిందెవరొ
చెబుతార తమరు
ఎవరెవరొ కాదది
నీలోపల తన్నుకు వచ్చె సంతోషం ఉలిగా
చక్కగ చెక్కెందుకు నె చెలిగా నేనున్ననుగా
అరె ఈ మాటె మరో సారి చెప్పెయ్
అమ్రుతంల వింటానె వందల సార్లైనా
నీ పాట వస్తానె లక్షల మైళ్ళైనా నీ వెంట
తరకు తరకు తర తరకు తరకు తర తరకు తరకు తర

సెలయేరుకు పల్లం వైపె మల్లె
నడకలు నేర్పిందెవరు
నేలకు పచ్చని రంగే అద్ది
స్వచ్చత పంచిందెవరు
ఎందుకు మనకా గొడవ నీ మటైనా నువు వినవా
నా తియ్యని పెదవె తినవా ఓ అరనిమిషం
ఈ ప్రేమకు పేరె పెట్టిందెవరు ప్రాయం పంచిందెవరు
వలపుకి తలుపె తీసిందెవరు
తొలి ముద్దిచ్చిందెవరు
ఎమైనా... నాలొ ఈ హైరానా తగ్గించెదెవరు
ఎవరెవరొ కాదది
నీలొపల హద్దులు దాటిన అల్లరినె త్వరగా
దారిలొ పెట్టెందుకు తోడల్లె నేన్నున్ననుగా
అరె ఈ మాటె మరో సారి చెప్పెయ్
అమ్రుతంల వింటానె వందల సార్లైనా
నీ పాట వస్తానె లక్షల మైళ్ళైనా నీ వెంట
తరకు తరకు తర తరకు తరకు తర తరకు తరకు తర




దినకు దిన పాట సాహిత్యం

 
చిత్రం : RX-100 (2018)
సంగీతం : చైతన్ భరద్వాజ్
సాహిత్యం : చైతన్య వర్మ 
గానం : వరం 

దినకు దిన 

Palli Balakrishna Sunday, July 15, 2018

Most Recent

Default