Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "20va Shatabdam"
20va Shatabdam (1990)



చిత్రం: 20 వ శతాబ్దం (1990)
సంగీతం: జె. వి.రాఘవులు
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: సుమన్, దేవరాజ్ , లిజి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: ఆర్.వి.విజయ్ కుమార్
విడుదల తేది: 1990

అమ్మనుమించి దైవమున్నదా!
ఆత్మనుమించి అర్ధమున్నదా!
అమ్మనుమించి దైవమున్నదా!
ఆత్మనుమించి అర్ధమున్నదా!
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందిరిని కనే శక్తి అమ్మ ఒక్కటే!
అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే!
అందిరిని కనే శక్తి అమ్మ ఒక్కటే!
అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే!

అమ్మనుమించి దైవమున్నదా!
ఆత్మనుమించి అర్ధమున్నదా!
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందిరిని కనే శక్తి అమ్మ ఒక్కటే!
అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే!

రఘురాముడి లాంటి కొడుకు ఉన్నా
తగిన కోడలమ్మ లేని లోటు తీరాలి
సుగుణ రాశి సీత లాగ తాను
తోటి ఉగాదులే నా గడపకు తేవాలి
మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే
మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే
ఈలోగిలి కోవెలగా మారాలి

అమ్మనుమించి దైవమున్నదా!
ఆత్మనుమించి అర్ధమున్నదా!
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందిరిని కనే శక్తి అమ్మ ఒక్కటే!
అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే!

తప్పటడుగులేసిన చిననాడు
అయ్యో తండ్రి అని గుండెకద్దుకున్నావు
తప్పుటడుగులేసే ఈనాడు
నన్ను నిప్పుల్లోనడిపించు ఏనాడు
నింగికి నిచ్చెనలేసే మొనగాడినే
నింగికి నిచ్చెనలేసే మొనగాడినే
అయినా నీ ముంగిట అదే అదే పసివాడినే

అమ్మనుమించి దైవమున్నదా!
ఆత్మనుమించి అర్ధమున్నదా!
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందిరిని కనే శక్తి అమ్మ ఒక్కటే!
అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే!
అందిరిని కనే శక్తి అమ్మ ఒక్కటే!
అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే!


*********    **********   **********


చిత్రం:  20 వ శతాబ్దం ( 1990 )
సంగీతం:  జె.వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల ,  యస్.పి.బాలు  

పల్లవి:
నా ప్రేమ నవ పారిజాతం...  పలికింది ప్రియ సుప్రభాతం
నా ప్రేమ నవ పారిజాతం...  పలికింది ప్రియ సుప్రభాతం

నీ ఎద వీణపై మన కథ మీటగా
నీ ఎద వీణపై మన కథ మీటగా
అనురాగాల  రాగానై రానా నూరేళ్ళ బంధాన్ని కానా
నా ప్రేమ నవ పారిజాతం... పలికింది ప్రియ సుప్రభాతం

చరణం: 1
వేదంలో స్వరంలా స్థిరంగా .. సాగాలి సుఖంగా శుభంగా
స్నేహంలో యుగాలే క్షణాలై...  నిలవాలి వరాలై నిజాలై
గత జన్మ బంధాలు నేడు...  జతగూడి రావాలి తోడు

గగనాల పందిళ్లలోనా సగభాగమవుతాను నీకు
ఇక సుముహూర్త మంత్రాలలోనా శృతి చేయి అనురాగ వీణ

నా ప్రేమ నవ పారిజాతం...  పలికింది ప్రియ సుప్రభాతం
నా ప్రేమ నవ పారిజాతం...  పలికింది ప్రియ సుప్రభాతం

చరణం: 2
ఈనాడే ఫలించే తపస్సే ... ప్రేమించి వరించే వయస్సే
లోకాలే జయించే మనస్సే...  నీకొసం నిజంగా తపించే
సరసాల సమయాలలోనా మనసార పెనవేసుకోనా
అణువైన నా గుండెలోనా...  కడదాక నిను దాచుకోనా
ఇక సిరిమల్లి తలంబ్రాలలోనా...  పరువాలు పండించుకోనా

నా ప్రేమ నవ పారిజాతం...  పలికింది ప్రియ సుప్రభాతం
నీ ఎద వీణపై మన కథ మీటగా

నీ ఎద వీణపై మన కథ మీటగా
అనురాగాల  రాగానై రానా నూరేళ్ళ బంధాన్ని కానానా ప్రేమ నవ పారిజాతం... పలికింది ప్రియ సుప్రభాతం


Palli Balakrishna Monday, August 14, 2017

Most Recent

Default