చిత్రం: మళ్లీ పెళ్లి (1970) సంగీతం: కె.వి.మహదేవన్ నటీనటులు: కృష్ణ , కృష్ణంరాజు, విజయనిర్మల, హేమలత దర్శకత్వం: సి.ఎస్.రావు నిర్మాత: టి.సూర్యనారాయణ విడుదల తేది: 14.02.1970
Songs List:
సొంపుగా పెండ్లికూతురున పాట సాహిత్యం
శుభ ముహూర్తంబున సొంపుగా పెండ్లికూతురును గావించు సంతోష శోభ మక్కువ మీరంగ మంగళ స్నానాలు కావింప జేయ ప్రగాడ శోభ కళ్యాణ వరముకై గౌరిని పూజింప పొలతి కన్నుల నిండు పుణ్యశోభ మేళ తాళాలతో మేలైన భక్తితో మాంగళ్యముల దెచ్చు మహిత శోభ కన్న వారల కనులార కనెడివార్ల మోములందున వెలుగు ప్రమోదశోభ మరచిపోలేని జన్మలో మాసిపోని శోభలకు శోభ పెండ్లి విశుభ్రశోభ...
జీవితం ఎంతో తియ్యనిది పాట సాహిత్యం
చిత్రం: మళ్లీ పెళ్లి (1970) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: అప్పారావు గానం: పి.సుశీల, ఎస్.పి.బాలు జీవితం ఎంతో తియ్యనిది అది అంతా నీలో ఉన్నది ఒక్క క్షణం వదలకు ఒంటరిగా ఉండకు అలుమగల సంసారం అందమైన నందనం మనవితీర చూసుకో మధుర గీతి పాడుకో గది తలుపులు మూసినా మది తలపులు మాయవు అఱమరికలు ఎందుకు చిఱునవ్వులు దాచకు అనుబంధం పెంచుకో అనురాగం పంచుకో ఒక్క క్షణం వొదలకు ఒంటరిగ వుండకు
ఆగమంటే ఆగలేను పాట సాహిత్యం
చిత్రం: మళ్లీ పెళ్లి (1970) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: పి.సుశీల, ఎస్.పి.బాలు ఆగమంటే ఆగలేను జాగుచేస్తే ఊరుకోను అడిగింది ఇవ్వకుంటే అరగడియ ఓపలేను ముట్టుకుంటే కందిపోతా పట్టబోతే పారిపోతా పందిట్లో తాళి కడితే తొందర్లో సొంతమౌతా నాకోసము పూసిన పువ్వా పొద మాటున దాచకు నువ్వు పూచిన పుష్పాలు తోటకు అందాలు పొరబడి తుంచకు నువ్వు నీ ఘుమ ఘుమలు నా తహతహలు ఇంక కువ కువలు కావాలి నేడు నీ ఆశలు నాకూ ఉన్నా నను సిగ్గుల సంకెళ్లు కలవు సంకెళ్లు తెంచాలి ఉవ్విళ్లు పెంచాలి కౌగిళ్ల కరగాలి మనము ఈ సిగ్గులనే విరిమొగ్గలను నీకు కానుక యిస్తాను రేపు
ఈ చిన్నది పాట సాహిత్యం
చిత్రం: మళ్లీ పెళ్లి (1970) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: అప్పారావు గానం: ఎల్. ఆర్. ఈశ్వరి ఈ చిన్నది లేవయసుది ఎవరిది ఎవరిది మీలో ఎవరిది మేలిమి బుగ్గల వన్నెతనం మెరిసే సిగుల కన్నెతనం అదిరే పెదవుల జాణతనం రేగే కోర్కెల కొంటెతనం ఎవరికి ఎవరికీ మీలో ఎవరికి సరదా కోరే పరువం సరదా దాటిన యౌవ్వనం వల పై పొంగే సింగారం వరదై పారే వయ్యారం ఎవరికీ ఎవరికి- మీలో ఎవరికీ
మలయ పవనాలు పాట సాహిత్యం
చిత్రం: మళ్లీ పెళ్లి (1970) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: జానకి మలయ పవనాలు వీచి మధువనాలు పూచి పగలే వెన్నెల కాచి దిగులు దూరమైతే - మనసు కెంతో చల్లన మమత కెంతో వెచ్చన నీ రెండవేళ గగనాన ఓ రెండు మబ్బులు పరువాన వడివడిగా పరుగులిడి కొండ ఒడిలో కరిగిపోతే మనసు కెంతో చల్లన మనువు కెంతో వెచ్చన బరువు తొలగిన గుండె పరిమళించే వేళ పలవరించే మూగ తలపు పాటపాడే వేళ అలలాగ ఆశ చెలరేగి లతలాగ ప్రేమ కొనసాగి అనురాగం జగమైతే వెలుగులన్ని విందులైతే మనసుకెంతో చల్లని మరపు రాని దేవెన
ఇదేనా భారతీయము పాట సాహిత్యం
చిత్రం: మళ్లీ పెళ్లి (1970) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల ఇదేనా భారతీయము ఇదేనా సదాచారము ఇది భారతీయ మేనా ఇది సదాచారమేనా దేవుడు వేసిన దివ్య బంధము మనిషి తెంపుటేనా తీయని కమ్మని దీవెనలన్నీ తీవ్ర శాపమేనా కలసిన మనసుల కరిగిన తనువుల కాగితాలు విడదీసేనా కంటి నీళ్ళు తొలి పంట కల్వాలై కలతల పైరే పండేనా అనుమానాలకు అనురాగాలు ఆహుతి కావలెనా ఆ పెనుభూతానికి వనిత జీవితం ప్రళయము కావలెనా ఇదేనా భారతీయము ఇదేనా సదాచారము ...
ఈ మౌనమేల నమ్మా పాట సాహిత్యం
చిత్రం: మళ్లీ పెళ్లి (1970) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: జానకి అమ్మా! ! గౌరీ! భవానీ! జననీ! యీ మౌనమేలనమ్మా! నీ మహిమ చూపవమ్మా! నేనోచిన నోములు చేసిన పూజలు యింతేనా తల్లీ! నామస్మరణ నిస్ఫలమైతే బ్రతక లేను తల్లీ !! పతి దేహములో సగము నీవని మరచిపోకుమమ్మా నీ భక్తురాలికా భాగ్యము నోసగ జాగు సేయకమ్మా చోటు లేని నాబోటి దానికి నీవే శరణమ్మా దావానలము దహించసాగె దారి చూపవమ్మా దారి చూపవమ్మా ! దారిచూపవమ్మా !
No comments
Post a Comment