Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Malli Pelli (2023)




చిత్రం: మళ్ళీ పెళ్లి (2023)
సంగీతం: సురేష్ బొబ్బిలి 
నటీనటులు: Dr. నరేష్ VK, పవిత్ర లోకేష్ 
దర్శకత్వం: M.S. రాజు
నిర్మాత: Dr. నరేష్ VK
విడుదల తేది: 26.05.2023



Songs List:


ఉరిమె కాలమా పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీ పెళ్లి (2023)
సంగీతం: సురేష్ బొబ్బిలి 
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: అనురాగ్ కులకర్ణి 

ఉరిమె కాలమా ఉరికేదాపుమా
బదులీ ఒకటే ప్రాణమయ్యే
ఇరు దేహాలిలా
ఉండే మాటే నిజమా సెలవియ్

ఏమో ఏమో ఏం చేస్తావో
నీతో ఏదీ కాలం కాదే
కలిపేస్తావో విడదిస్తావో
నీతో ఏది అర్ధం కాదే

ఏ, ఊరేదైనా తీరేదైనా
దారేదో వేస్తావే ఇద్దరికీ
ఈరోజేది లేనట్టున్నా
ఏం తెస్తావో రెప్పయ్యేసరికి

మౌనంలో ఏ వైనం దాచావో ఓ ఓ
పయనంలో ఏ మార్గం మార్చేస్తావో ఓ ఓ

ఏమో ఏమో ఏంచేస్తావో
నీతో ఏదీ కాలం కాదే
కలిపేస్తావో విడదిస్తావో
నీతో ఏది అర్ధం కాదే

సత్యం తెలుసు సర్వం తెలుసు
అయినా మాయేదో లాగేస్తుందా
పైనే వయసు లోలో నలుసు
ఏదో చూమంత్రం వేస్తూ ఉన్నా

ఏ మైకం కమ్మిందో మనసంతా ఓ ఓ
ఈలోకం కళ్లల్లో పడితే ఎట్టా ఓ ఓ

ఏమో ఏమో ఏంచేస్తావో
నీతో ఏదీ కాలం కాదే
కలిపేస్తావో విడదిస్తావో
నీతో ఏది అర్ధం కాదే

ఉరిమే కాలమా, ఆ ఆ ఆ
ఉరికేదాపుమా ఆ ఆ ఆ




రారా హుస్సారు నాతో పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీ పెళ్లి (2023)
సంగీతం: సురేష్ బొబ్బిలి 
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: ఇందు సనత్ 

రారా హుస్సారు నాతో 



కావేరి గాలిలా పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీ పెళ్లి (2023)
సంగీతం: సురేష్ బొబ్బిలి 
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: నరేష్ అయ్యర్ 

కావేరి గాలిలా తాకేసి పోకలా
నేనింక ఉండేదెలా
కావేరి గాలిలా తాకేసి పోకలా
నేనింక ఉండేదెలా… ఆ ఆ ఆఆ ఆ

ఆ ఆ తేనె అలల్లో తెలుతుందే
నా మనసే నీ ఊసులు వింటే
సోగ కనుల్లో సోలుతు ఉందే
నా సమయం నీ ఊహన ఉంటే

నీ వెనకాలే నీడగ మారి
సాగుతు ఉందే జన్మే నీ వెంటే

కావేరి గాలిలా తాకేసి పోకలా
కావేరి గాలిలా తాకేసి పోకలా

చేరువలోనే దూరము చూపి
చిన్నగ నవ్వే నీ చెలిమేంటో
జాబిలి నేడు చెంతనే ఉన్నా
వెన్నెల మాత్రం అందదేంటో

ఇంకొక జన్మే అనిపిస్తున్నా
జీవితమింకా మొదలే కాదేంటో

కావేరి గాలిలా తాకేసి పోకలా
కావేరి గాలిలా తాకేసి పోకలా




ఆకాశమే పడిపోని పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీ పెళ్లి (2023)
సంగీతం: సురేష్ బొబ్బిలి 
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: సంతోష్

ఆఆ ఆ ఆ
ఆఆ ఆ ఆ
ఆఆ ఆ ఆఆ ఆ ఆ

ఆకాశమే పడిపోని
భూగోళమే విడిపోని
మేం ఆపములే
ఈ పయనాన్నే

మాది మాకథ మేము గాక
ఎవ్వరు రాస్తారంట
మాయ రాతకు మోసపోక
సాగదా ఇక మా జంట

ఓ ప్రేమా,ఆ ఆ ఆ
ఈ ధీమా, ఆ ఆ ఆ
నీవల్లేనమ్మ ప్రేమ
ఓ ప్రేమా ఆ ఆ ఆ

ఆకాశమే పడిపోని
భూగోళమే విడిపోని
మేం ఆపములే
ఈ పయనాన్నే

Most Recent

Default

No comments