Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Naadi Aada Janme (1965)




చిత్రం:  నాదీ ఆడజన్మే (1965)
సంగీతం:  ఆర్. సుదర్శనం 
నటీనటులు: యన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వి.రంగారావు 
దర్శకత్వం: ఏ.సి.త్రిలోక్ చందర్ 
నిర్మాత: ఎస్.వి.రంగారావు 
విడుదల తేది: 07.01.1965



Songs List:

కన్నయ్య నల్లని పాట సాహిత్యం

 
చిత్రం:  నాదీ ఆడజన్మే (1965)
సంగీతం:  ఆర్. సుదర్శనం 
సాహిత్యం: దాశరధి 
గానం:  పి.సుశీల 

పల్లవి: 
కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ.. 
నిన్ను కనలేని కనులుండునా 
కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ.. 
నిన్ను కనలేని కనులుండునా 
నిన్ను ప్రేమింతురే.. నిన్ను పూజింతురే 
నన్ను గనినంత నిందింతురే 

కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ.. 
నిన్ను కనలేని కనులుండునా 
నిన్ను ప్రేమింతురే.. నిన్ను పూజింతురే 
నన్ను గనినంత నిందింతురే 
కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ.. 
నిన్ను కనలేని కనులుండునా..ఆ.. 

చరణం: 1
గుణమెంత లేనింట పడవైతువా.. 
నన్ను వెలివేయువారికే బలిచేతువా 
గుణమెంత లేనింట పడవైతువా.. 
నన్ను వెలివేయువారికే బలిచేతువా 
సిరి జూచుకుని నన్ను మరిచావయా.. 
సిరి జూచుకుని నన్ను మరిచావయా.. 
మంచి గుడి చూచుకొని నీవు మురిసేవయా 

కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ.. 
నిన్ను కనలేని కనులుండునా 

చరణం: 2
బంగారు మనసునే ఒసగినావు.. 
అందు అందాల గుణమునే పొదిగినావు 
బంగారు మనసునే ఒసగినావు.. 
అందు అందాల గుణమునే పొదిగినావు 

మోముపై నలుపునే పులిమినావు.. 
మోముపై నలుపునే పులిమినావు.. 
ఇట్లు నన్నేల బ్రతికించదలచినావు 

కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ.. 
నిన్ను కనలేని కనులుండునా 
నిన్ను ప్రేమింతురే.. నిన్ను పూజింతురే 
నన్ను గనినంత నిందింతురే 
కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ.. 
నిన్ను కనలేని కనులుండునా




చిన్నారి పొన్నారి పువ్వు పాట సాహిత్యం

 
చిత్రం:  నాదీ ఆడజన్మే (1965)
సంగీతం:  ఆర్. సుదర్శనం 
సాహిత్యం: దాశరధి 
గానం: ఘంటసాల, పి.సుశీల 

పల్లవి:
చిన్నారి పొన్నారి పువ్వు
విరబూసి విరబూసి నవ్వు
మన ఇంటి పొదరింటి పువ్వూ
నిను చూసి నను చూసి నవ్వూ

చిన్నారి పొన్నారి పువ్వు
విరబూసి విరబూసి నవ్వు
మన ఇంటి పొదరింటి పువ్వూ
నిను చూసి నను చూసి నవ్వూ

చరణం: 1
ఆహ హా..ఊహు హూ..ల.ల.ల.ల.ల.ల.లా.లా.
ల.ల.ల.ల.ల.ల.లా.లా.

హృదయాన కదలాడు బాబూ
రేపు ఉయ్యాల జంపాలలూగూ

హృదయాన కదలాడు బాబూ
రేపు ఉయ్యాల జంపాలలూగూ

పసివాడు పలికేటి మాటా
ముత్యాల రతనాల మూటా

చిన్నారి పొన్నారి పువ్వు
విరబూసి విరబూసి నవ్వు
మన ఇంటి పొదరింటి పువ్వూ
నిను చూసి నను చూసి నవ్వూ

చరణం: 2
ఆహ హా..ఊహు హూ..ల.ల.ల.ల.ల.ల.లా.లా.
ల.ల.ల.ల.ల.ల.లా.లా.

ఒడిలోన పవళించు వేళా
నేను పాడేను ఒక జోల పాటా

ఒడిలోన పవళించు వేళా
నేను పాడేను ఒక జోల పాటా

కనుమూసి నిదురించు బాబూ
కలలందు జోగాడగలడు

చిన్నారి పొన్నారి పువ్వు
విరబూసి విరబూసి నవ్వు
మన ఇంటి పొదరింటి పువ్వూ
నిను చూసి నను చూసి నవ్వూ..

ఆహ హా..ఆహ హా..ఆహా...



నా మాట నమ్మితివేల పాట సాహిత్యం

 
చిత్రం:  నాదీ ఆడజన్మే (1965)
సంగీతం:  ఆర్. సుదర్శనం 
సాహిత్యం: దాశరధి 
గానం:  పి.సుశీల 

నా మాట నమ్మితివేల 

Most Recent

Default

2 comments

Unknown said...


పల్లవి:
లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఎబౌట్ టర్న్

హోయ్....హొయ్ హొయ్.హోయ్
నా మాట నమ్మితివేల.
నామీద కోపమదేల
నను వీడిపోవుట మేలా.
ఏనాటికీ నిన్ను విడజాల

నా మాట నమ్మితివేల.
నామీద కోపమదేల
నను వీడిపోవుట మేలా.
ఏనాటికీ నిన్ను విడజాల
లెఫ్ట్.రైట్.లెఫ్ట్.రైట్.
లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఎబౌట్ టర్న్

చరణం1:
కనులే సైగతో నన్ను రమ్మన్నవే
అయ్యయ్యో అంతలో వద్దు పొమ్మన్నవే
కనులే సైగతో నన్ను రమ్మన్నవే
అయ్యయ్యో అంతలో వద్దు పొమ్మన్నవే
ఈ తైతై నాట్యాలేలా..ఇక పైపై కోపాలేలా
నను వీడిపోవుట మేలా.
ఏనాటికీ నిన్ను విడజాలా

నా మాట నమ్మితివేల.
నామీద కోపమదేల
నను వీడిపోవుట మేలా.
ఏనాటికీ నిన్ను విడజాల
లెఫ్ట్.రైట్.లెఫ్ట్.రైట్.
లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఎబౌట్ టర్న్

చరణం2:
నవ్వులే పువ్వులై నన్ను కవ్వించెనే
ముక్కుపై కోపమే నన్ను మురిపించెనే
నవ్వులే పువ్వులై నన్ను కవ్వించెనే
ముక్కుపై కోపమే నన్ను మురిపించెనే
నీ మదిలో రగిలే ప్రే..మ
ఇక దాచేవెందుకె భా..మ
నను వీడిపోవగ మేలా.
ఏనాటికీ నిన్ను విడజాల

నా మాట నమ్మితివేల.
నామీద కోపమదేల
నను వీడిపోవుట మేలా.
ఏనాటికీ నిన్ను విడజాల
లెఫ్ట్.రైట్.లెఫ్ట్.రైట్.
లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఎబౌట్ టర్న్

Unknown said...

Please check the male version song lyrics script by me and publish if you like this. I worked on this song lyrics as I didn't find when I checked