Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box



చిత్రం: పోతేపోనీ...(2006)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: కులశేఖర్
గానం: కార్తిక్
నటీనటులు: శివబాలజి, సింధుతులాని
దర్శకత్వం: తమ్మారెడ్డి భరద్వాజ
నిర్మాత: వై.వి.ప్రవీణ్ కుమార్
విడుదల తేది: 03.02.2006

చెలి చెలియ చెలియ...

నిన్న లేదిలా మొన్న లేదిలా కొత్తగా ఉంది వింత వేధన
వేల ఆశలే పూలు పూచనే ఈ వేళా లోలోనా
ఎందుకో ఇలా గుండెలోపల ఎన్నడూ లేదు ఇంత యాతన
గాలి తాకినా ఆకు రాలిన హైరానా నాలోనా
ఇదివరకెరుగని వయసుకు తెలియని మనసున పలికెను తొలి తొలి సరిగమ
పరిచయమెరుగని మధువులు చిలికెను వరసలు కలిపెను పరువపు మధురిమ
తలపుల వరమా తపనల వనమా అడగని వరమా మాధనుడి మహిమా
తొలి అనుభవమా తెలియని సుఖమా ఎదలో ఎగసే లయలే వినుమా
నీలి మేఘమా జాలి చూపుమా వింత వేధనల వివరము తెలుసా
ఇంద్రజాలమా ఇంత మొహమా ఎందుకోసమని అడగవె మనసా
వాన విల్లులా మెరిసే సొగసా తేనే జల్లును కురిసే వరసా
ఆమె మాటలకు మనసు ఎగసిపడి పొంగిపోయినది తెలుసా వయసా
ఇది నిజామా కలవరమా చిలిపిగా చెలి పలికే ప్రియ స్వరమా
అతిశయమా పరవశమా మాట రాని మధి మధువనమా

నాలో...

చెలి పలుకే తొలి చినుకై పెనుమరుగై పరుగులు తీసేను
సాగే శృతి లయలే కోటి భావాలు రేపెను నా మదిలో విడిపోలేని కౌగిళ్ళలో...
వివరము తెలియక క్షణమొక యుగముగా అడుగులు కదలక వయసుకి తికమక
జిలిబిలి పలుకుల చిరు చిరు నగవుల గల గల వలపని మనసుకి తెలియక
నింగిని అడిగా నేలని అడిగా వెన్నెలనడిగా వేకువనడిగా
చినుకులనడిగా చిలకలనడిగా అలనే అడిగా కథనే అడిగా
ఏమి చేసిన ఆమె ఊసులే ఎందుకో మరి మనసున ఎగసే
ఏది చూసిన ఆమె రూపమే కంటి పాపలలో ఎదురుగ నిలిచే
ఆమె చూపులే బతికే కలలే తీపి తీపి తడి సెగలే రగిలే
ఆమె తాకగనే బతుకు మురిసిపడి వేల ఆశలను ఎదలో పలికే
నిద్దురలో మెళకువలో కనులకు జత కలిసే ప్రతి కలలో
ఎధ లయంలో అడుగులలో అందమైన ప్రతి అలజడిలో

నాలో...

చెరి సగమై తనువొకటై తపనలతో పదములు పాడెను
ఆమె తొలి చినుకై ప్రేమ బంధాలు వేసెను నా ఎదకి
అనురాగలే ఈ జన్మకి...

Palli Balakrishna Monday, July 31, 2017




చిత్రం: కృష్ణ (2008)
సంగీతం: చక్రి
నటీనటులు: రవితేజ, త్రిష
దర్శకత్వం: వి.వి.వినాయక్
నిర్మాత: బి. కాశీ విశ్వనాధం
విడుదల తేది: 11.01.2008



Songs List:



నీ సోకుమాడ పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణ (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చక్రి

నీ సోకుమాడ అమ్మో నీ జిమ్మడ 
తిప్పుకుంటుతిరిగావే నీ ఒంపులు ఊడిపడా 
దొంగ చూపు చెబుతుంటే నీ రంగు పెదవి చెబుతుందే 
తిక్క నడక చెబుతుందే తై తక్కనడుము చెబుతుందే 
నా పైన నీ ప్రేమ నోరార చెప్పరాదే నీ నోరు మండ 

ఎపుడెప్పుడో ఇంకెప్పుడే నీకు నాకు లింకెపుడే 
ఎపుడెప్పుడే లవ్వెపుడే నీలో ఒంటికి జివ్వెపుడే 
వయసై పోతే ఉడికే ఐసైపోతే 
మోజే పోతే కోరిక క్లోజైపోతే 
తెలుపవుతుంది తల్లోని జుట్టు వదులవుతుంది ఒంట్లోని 
పట్టు అనవసరంగా చెయ్యద్దు బెట్టు అందాలన్ని నా చేత 
పెట్టు అతి చెయ్యకుండా 

అంతేలే అంతేలే ఆడోళ్ళంతా అంతేలే 
పైపైనే పంతాలే లోలో తకధిం దింతాలే 
వదిలెయ్ అంటే అర్ధం ఇంకా వాటెయ్ 
నోర్ముయ్ అంటే అర్ధం పెదవే కలిపెయ్ 
గసిరామంటే కవ్వించినట్టు నసిగా మంటే ఉసిగొలిపినట్టు 
తిట్టామంటే తెర తీసినట్టు కొట్టామంటే కను నింపినట్టు 
తెలిసిందే జాన 




మురిపించే మైనా పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణ (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: కౌశల్య, ఫరీద్

మురిపించే మైనా ఓ మైనా మైనా మైనా 
మనసొదిలేసానే నీలోనా 
మురిపించేమైనా నా మైనా మైనా 
మతిపారేసావే నీ పైనా 
నువు చూస్తేనే చెడిపోతున్నా నీకై నే పడి చస్తున్నా 
నీతోనే నడిచొస్తానా హే వెయ్యనా 
చెయ్యి వేస్తే నే చిలికవుతున్నా రాస్తేనే పరికవుతున్నా 
చేస్తే నీ చెలి మవుతున్నా సరేనా 
తు లకజా తు లకజా తు లకజా లకజా లకజా సోనా 
తు లకజా లకజా లకజా జానే జానా

నచ్చావే నువ్వే నాకు చాన పాప 
ఇచ్చెయేనా నేనే నీకు రాజ్యాలైనా 
నీ రాజ్యం కన్నా సామ్రాజ్యం కన్నా 
యమధర్జాగున్నా రవితేజం మిన్నా 
పోనా పోనా వరదల్లె పొంగిపోనా 
కోనా కోనా వెయ్యేళ్ళు ఏలుకోనా 
తు లకజు తు లకజా తు లకజా లకజా లకజా సోనా 
తు లకజా లకజా లకజా జానే జానా 

తెప్పిస్తా నీకై నేను మెరుపుల మేన 
మురిపిస్తా నీపై నేను తారల వాన 
ఆ మెరుపుల కన్నా ఈ తారల కన్నా 
నీ మగసిరి మిన్నా నా ముద్దుల కన్నా 
జాన జాన కాజెయ్య నా ఖజానా 
ఖాన ఖాన కౌగిళ్ళ బంధిఖాన 
తు లకజా తు లకజా లకజా లకజా లకజా సోనా 
తు లకజా లకజా లకజా లకజా జానే జానా




దిల్‌ మాంగే మోర్‌ మోర్‌ పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణ (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: కునాల్, మహలక్ష్మీ అయ్యర్

దిల్‌ మాంగే మోర్‌ మోర్‌ దిల్‌మాంగె మోర్‌ మోర్‌ 
ఇన్నాళ్ళు బోర్‌ బోర్‌ ఇవ్వాళ జోర్‌ జోర్‌ 
పట్టాపట్టా నీ ఫోన్‌ నెంబర్‌ పట్టా పట్టా నీ డోర్‌ నెంబర్‌ 
పట్టన వేళ గుండెకు అయ్యే ఫంచర్‌ 
చిట్ట నవ్వే సెంటిమీటర్‌ పొట్టి నడుమే మిల్లిమీటర్‌ 
ఇట్టానన్ను పెట్టేసావే తార్చర్ 

వాడ బెజవాడ నీక్కూడా తిప్పించాలే 
ఆడ మరి ఈడ నీ నీడై నడిపించాలే 
నన్ను ముంచేశావే నీలో నా గుండె దడ 
ఇక పెంచేశావే నాలోనా గుండె దడ 
నీ మూడే చూశాలే నీ స్పీడే చూశాలే 
నే తోడా తోడా సర్దేస్తే నువు తేడా తేడాహే 

నన్నే మరి నన్నే మిక్సీలో రుబ్బేశావే 
మనసే నా మనస్సే చెంచాతో తోడేశావే 
ఓ జెంటిల్‌ మేన్‌లా ఉన్నా నే నిన్నటికి 
నన్ను మెంటల్‌ మేన్‌లా మార్చావే ఆఖరికి 
నువ్వంటే మంటహే నీతోటి తంటాహే 
నా వెంటే ఇట్టా పడుతుంటే టెమిటైపోతాలే





తరత్తా ఎత్తుకు పోతా పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణ (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: రఘుకుంచె, కౌశల్య

తరత్తా ఎత్తుకు పోతా తరత్తా హత్తుకుపోతా 
తరత్తా చిత్తడి చేస్తా గివ్ మి ఛాన్స్ గివ్ మి ఛాన్స్ 
తరత్తా మంతరమేస్తా తరత్తా మత్తెకిస్తా తరత్తా పిచ్చెకిస్తా 
గివ్ మి ఛాన్స్ గివ్ మి ఛాన్స్ 
ఓ బేబి ఓ బేబి సత్తా చూపిస్తా బేబి 
ఓ బేబి ఓబేబి శభాష్ అనిపిస్తా బేబి 
నా కోరికనంతా ఓ కొడవలి చేస్తా నీకులుకులు మొత్తం 
నే కోసుకుపోతా 
రారా కృష్ణా రాధాకృష్ణా బరిలేని ఫన్నీ కృష్ణా 
ఛీ పో కృష్ణా సిల్లి కృష్ణా పరువాన్ని కొల్లే కృష్ణా

ఎండ లోన ముద్దిస్తా మై వానలోన వాటేస్తా 
ఇక ఎండ వాన కలిపొస్తే ఆ పండు చేతికిస్తా 
ఉత్తరాన ఊపేస్తా ఇక దక్షిణాన దులిపేస్తా 
ఇక వాస్తు చూసుకోకుండా నీ ఆస్తి కరగదీస్తా 
నీ దూకుడు తగ్గిస్తా నా చెడుగుడు సాగిస్తా 
పిల్లగోనే తిప్పులు పెడతా పిల్లగో సరి హద్దులు పెడతా 
పిల్లగో నిన్ను అల్లాడిస్తా ఆడిస్తా 
పిల్లోనే తొందర పెడతా పిల్లో నే పంతంపడతా 
పిల్లో నేపైపై కొస్తా పీడిస్తా 
రారా కృష్ణా రాధాకృష్ణా రెచ్చావు రౌడి కృష్ణా 
గోపికృష్ణా అగ్ని కృష్ణా నాతీపికోరే కృష్ణా 

ఊరుకుంటె ఒకటిస్తా నువ్వు కోరుకుంటె రెండిస్తా 
ఆ మూడు ముళ్ళు నువ్వేస్తే నా ఏడు జన్మలిస్తాం 
అడుగుతుంటే ఇంతిస్తా నువ్వు అడుగకుంటే కొంతిస్తా 
నా అడుగులోనా అడుగేస్తా బ్రతుకంతా ధారపోస్తా 
నా గడపన దాటొస్తా రా రా రారాటు పిల్లోదాటేస్తా 
పిల్లగో నీవేలే పడతా పిల్లగో మురిపాలే పడతా పిల్లగో 
సగుపాలై పోతా లాలిస్తా 
పిల్లో నీ బరువైనస్తా పిల్లో యెద పరుపే వేస్తా 
పిల్లో పిల్లోడిని ఇస్తా కవ్విస్తా 
రా రా కృష్ణా రాధాకృష్ణా నచ్చావు నాజికృష్ణా 
పెళ్ళి కృష్ణాక్రేజి కృష్ణా నీ ప్రేమ నాదే కృష్ణా



తుమేరా జిల్‌ జిల్‌ పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణ (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్, సాధన సర్గమ్

తుమేరా జిల్‌ జిల్‌ ఓ ప్రియతమా 
తుమేరా మంజిల్‌ ఓ నేస్తమా 
తుమేరా జిల్‌ జిల్‌ ఓ ప్రియతమా 
తుమేరా మంజిల్‌ ఓ నేస్తమా 
తుమేరి తుంటరి తనమా తుమేరి ఊపిరి గుణమా 
తుమేరి తియ్యని జ్వరమా తుమేరి జీవన స్వరమా 
తుహిమేరా సర్వస్వమా 
మామ్మమ్మా మమ్మమ్మా తొలిప్రేమా 
మామ్మమ్మా మమ్మమ్మా చిరునామా 
మామ్మమ్మా మమ్మమ్మా యమధీమా 
మామ్మమ్మా మమ్మమ్మా హరేరామా 

నాబడి నువ్వే నా గుడి నువ్వే నా ఒడి నువ్వేగా 
ఈ అమ్మవొడి నువ్వేగా 
నానా గుస నువ్వే నాదశ నువ్వే పదనిస నవ్వేగా 
పడుచు నస నువ్వేగా 
కీచులాట నువ్వే కిస్సులాట నువ్వే 
నువ్వే దక్కే దూరమా నువ్వే తేలిక భారమా 
తుహిమేరా ఆ భారమా 
మామ్మమ్మా మమ్మమ్మా తొలిప్రేమా 
మామ్మమ్మా మమ్మమ్మా చిరునామా 
మామ్మమ్మా మమ్మమ్మా యమధీమా 
మామ్మమ్మా మమ్మమ్మా హరేరామా

నాసిగ నువ్వే నాసెగ నువ్వే నా పొగనువ్వేగా 
చిలిపి పగనువ్వేగా 
నాసిరి నువ్వే నా తరి నువ్వే నా సరి నువ్వేగా 
అసలు గురి నువ్వేగా 
మామ్మమ్మా మమ్మమ్మా తొలిప్రేమా 
మామ్మమ్మా మమ్మమ్మా చిరునామా 
మామ్మమ్మా మమ్మమ్మా యమధీమా 
మామ్మమ్మా మమ్మమ్మా హరేరామా 




అదరగొట్టు కొట్టు కొట్టు పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణ (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: శివాణి, వాసు

అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు బిడియాన్నే 
చెదరగొట్టు కొట్టు కొట్టు విర్గగ గొట్టు విరహన్నే 
మాంగల్యం తంతునా మంత్రాలే చదవనా 
మొగుడల్లే మారనా మురిపాలే పెంచనా 
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా 

నా చెంపలు నిమిరెయ్యనా చెవి రింగువై 
నా గుండెలుతడి వెయ్యవా ఓ గొలుసువై 
నా పైటను పట్టెయ్యవా పిన్నేసు నువ్వై
నీ చీకటి కరిగించనా కొవొత్తినై 
నీ భయమును తొలిగించనా తాయతునై 
నీ గదిలో వ్యాపించనా అగరత్తు నేనై 
వేలే పట్టెయ్ ఉంగరమయ్యి నాతో తిరిగెయే బొంగరమయ్యి 
ఒళ్ళే మోసెయ్ పల్లకివై నన్నే దాచెయ్ బంగరమయ్యి 
ఊకొడుతూ చేరనా ఊడిగమే చెయ్యనా 
ఊపిరిగా మారనా ఊయలనే ఊపనా 

ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా (3)

నా వెనకే వచ్చెయ్యవా అపరంజివై 
నా దాహం తీర్చెయ్యవా చిరపుంజివై 
నా నోటికి రుచిలియ్యవానారింజ నీవై 
నీవాకిట కురిసెయ్యనా చిరుజల్లునై 
ఈ రాత్రికి దొరికెయ్యనా రసగుల్లనై 
నీ ఆశలు తగ్గించనా వలదిళ్ళునేనై 
ఆరోగ్యానికి ముల్లంగివై ఆనందానికి సంపెంగివై 
సంగీతానికి సారంగివై రావే రావే అర్ధాంగివై 
ఉత్సాహం నింపగా ఉల్లాసం పెంచనా 
ఉమ్మా అందించనా ఉంగా తినిపించనా 
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా (3)


Palli Balakrishna




చిత్రం: మనసులోని మాట (1999)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
నటీనటులు: జగపతిబాబు, శ్రీకాంత్, మహిమా చౌదరి
దర్శకత్వం: ఎస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాత: పి.ఉషారాణి
విడుదల తేది: 02.04.1999



Songs List:



అంతమరీ గంతులేంటి పాట సాహిత్యం

 
చిత్రం: మనసులోని మాట (1999)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సునందా, ఉదిత్ నారాయణ్

అంతమరీ గంతులేంటి





ఈశ్వరా నింగి నేల పాట సాహిత్యం

 
చిత్రం: మనసులోని మాట (1999)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉదిత్ నారాయణ్

ఈశ్వరా నింగి నేల



హోయ్ హోయ్ గాలి ఈల వేసే పాట సాహిత్యం

 
చిత్రం: మనసులోని మాట (1999)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉన్ని కృష్ణన్, చిత్ర

హోయ్ హోయ్ గాలి ఈల వేసే




ఏ రాగముంది (కౌసల్యా సుప్రజా రామ) పాట సాహిత్యం

 
చిత్రం: మనసులోని మాట (1999)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే 
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ
ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు 

ఏ రాగముంది మేలుకొని ఉండి లేవనంటున్న మనసును పిలువగ
ఏ తాళముంది సీసమును పోసి మూసుకొని ఉన్న చెవులను తెరువగ
సంగీతమంటె ఏవిటో తెలిసి ఉండాలి మనకి ముందుగా అంత సందేహముంటె తీర్చుకో గురువులున్నరు కనుల ముందుగా వెల్లి
నీలి మేఘాన్ని గాలి వేగాన్ని నింగి మౌనాన్ని అడగరా కడలి 
ఆలపించేటి ఆతరంగాల అంతరంగాన్ని అడగరా మధుర 
ప్రాణ గీతాన్ని పాడుతూ ఉన్న ఎద సడి నడిగితె శ్రుతి లయ తెలుపద బ్రతుకును నడిపిన సంగతి తెలియద

ఏ రాగముంది మేలుకొనిఉండి లేవనంటున్న మనసును పిలువగ
ఏ తాళముంది సీసమును పోసి మూసుకొని ఉన్న చెవులను తెరువగ
ఏ సుప్రభాత గళముతో నేల స్వాగతిస్తుంది తొలితొలి వెలుగుని
ఏ జోలపాట చలువతో నింగి సేదదీర్చింది అలసిన పగటిని
స్వర్ణ తరుణాలు చంద్ర కిరణాలు జిలుగులొలికి పరుగు పలుకునెవరికి
మంచు మౌనాలు పంచమంలోన మధువు చిలుకు ఎవరి చెలిమి రవళికి
తోటలో చేరి పాట కచ్చేరి చేయమంటున్న వినోదమెవరిది
నేల అందాల పూల గంధాల చైత్ర గాత్రాల సునాదమెవరిది
పంచ వర్ణాల పింఛమై నేల నాట్యమాడేటి వేళలో మురిసి
వర్ష మేఘాల హర్ష రాగాలు వాద్యమయ్యేటి లీలలో తడిసి
నీరుగా నీరు ఏరుగా ఏరు వాకగా నారు చిగురులు తొడగగ
పైరు పైటేసి పుడమి పాడేటి పసిడి సంక్రాంతి పదగతులెవరివి
ఆరు కాలాలు ఏడు స్వరములతొ అందజేస్తున్న రసమయ మధురిమ
వినగల చెవులను కలిగిన హ్రుదయము తన ప్రతి పధమున చిలకద సుధలను

జోహారు నీకు సంద్రమా ఎంత ఓపికో అసలు అలసట కలగద
ఓహోహొ గాన గ్రంధమా ఎంత సాధనే దిశల ఎదలకు తెలియద
నీ గీతమెంత తడిమినా శిలలు సంగీత కళలు కావనీ ఎంత
నాదామృతాన తడిసినా యిసుక రవ్వంత కరగలేదనీ తెలిసి
అస్తమిస్తున్న సూర్య తేజాన్ని కడుపులో మోసి నిత్యము కొత్త
ఆయువిస్తున్న అమ్రుతంలాంటి ఆశతో ఎగసి ఆవిరై అష్ట దిక్కులూ దాటి
మబ్బులను మీటి నిలువున నిమిరితె గగనము కరగద
జలజల చినుకుల సిరులను కురవగ అణువణువణువున
తొణికితె స్వరసుధ అడుగడుగడుగున మధువని విరియదా......హా




నేలమీద జాబిలీ పాట సాహిత్యం

 
చిత్రం: మనసులోని మాట (1999)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఆ.. ఆ.. 
నేలమీద జాబిలీ సరేలే ఊహ కాని ఊర్వశీ
చూడగానే సుందరీ అదేలే మల్లెజాజి పందిరీ 
తోడు కోరే వయస్సు లాగ తొంగి చూసే మనస్సు లాగా 
ఉరికివచ్చే ఉషస్సులాగ వరములిచ్చే తపస్సులాగ 
సితారలా మెరిసిందీ షికారుగా కలిసిందీ 
శ్రీదేవి చూపుతోనె శృంగార దీపమెట్టినట్టుగా 
సింధూర సంధ్యవేళ సిగ్గంత బొట్టు పెట్టినట్టుగా 
ఆబాల పిచ్చుక అందాలు గుచ్చగ వాలిందమ్మ గాలివాటుగా 
వయ్యరాల గాలి వీచగా

పచ్చబొట్టు గుండెకేసి పైటచాటు చేసి
చందమామ లంచమిచ్చి నూలుపోగుతీసి 
ఇదే తొలీ అనుభూతీ రచించనీ రసగీతీ
సంధ్యారాగం సఖి సంగీతం పాడిన వేళా 
రాయని గ్రంధం రాధిక అందం అంకితమై.. 
ఆమనీ సోకుల అమెని తాకిన అనుభవమే.. 
ఎదలకు లోతున పెదవుల మధ్యన సాగర మధనం ఊగ తరంగం 
చెలి చూపు సోకగానే తొలిప్రేమ కన్ను కొట్టినట్టుగా 
లేలేత చీకటింటా నెలవంక ముద్దు పెట్టినట్టుగా 
చుశాక ఆమెనీ కన్నుల్లో ఆమనీ వేసిందమ్మ పూల ముగ్గులే 
పట్టిందమ్మ తేనే ఉగ్గులే 
ఆమె మూగ కళ్ళలోన సామవేదగానం
ఆమె చేయి తాకగానే హాయి వాయులీనం 
ఒకే క్షణం మైమరచీ అనుక్షణం ఆ తలపు




ప్రేమా ఓ ప్రేమా విన్నావా ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: మనసులోని మాట (1999)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర

ప్రేమా ఓ ప్రేమా విన్నావా ప్రేమ




ప్రేమించు ఒక్కసారి మిత్రమా పాట సాహిత్యం

 
చిత్రం: మనసులోని మాట (1999)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, ఉదిత్ నారాయణ్

ప్రేమించు ఒక్కసారి మిత్రమా


Palli Balakrishna




చిత్రం: ప్రేమకావాలి (2011)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: ఆది, ఇషా చావ్లా
దర్శకత్వం: కె. విజయ భాస్కర్
నిర్మాత: కె.అచ్చిరెడ్డి
విడుదల తేది: 25.02.2011



Songs List:



డం డం డం డోలు డోలు బాజే పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమకావాలి (2011)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: బెన్ని దయాళ్

డం డం డం డోలు డోలు బాజే




చిరునవ్వే విసిరావే పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమకావాలి (2011)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: విజయ్ ప్రకాశ్

చిరునవ్వే విసిరావే నిదురించే కలపై 
సిరిమువ్వై నడిచావే నిను కోరేటి ఈ గుండెపై 
వెలుగేదో పరిచావే నిను చూస్తున్న నా కళ్లపై

చిరునవ్వే విసిరావే నిదురించే కలపై
సిరిమువ్వై నడిచావే నిను కోరేటి ఈ గుండెపై 

సరదా సరదాలెన్నో అందించావే 
సమయం గుర్తే రాని సావాసంతో 
విరహం చెరలో నన్నే బంధించావే 
ఎపుడూ మరుపేరాని నీ అందంతో 
ఆహ్వానం పంపించానే ఆనందం రప్పించావే 
రెప్పల్లోన తుళ్లే చూపుల్తో 
ఆరాటం ఊరించావే మోమాటం వారించావే 
చేరువలోన చేసే దూరంతో చెలియా... ఆ...

చిరునవ్వే విసిరావే నిదురించే కలపై
సిరిమువ్వై నడిచావే నిను కోరేటి ఈ గుండెపై

అసలే వయసే నన్ను తరిమేస్తుంటే 
అపుడే ఎదురౌతావు ఏం చెయ్యాలే 
అసలీ తడబాటేంటని అడిగేస్తుంటే 
సరిగా నమ్మించే బదులేం చెప్పాలే 
తప్పేదో చేస్తున్నట్టు తప్పించుకుంటున్నట్టు 
ఎన్నాళ్లింక కాలం గడపాలే 
నీకోసం నేనున్నట్టు నీ ప్రాణం నమ్మేటట్టు 
ఎవ్వరితోనా కబురంపించాలే చెలియా... ఆ...

చిరునవ్వే విసిరావే నిదురించే కలపై
సిరిమువ్వై నడిచావే నిను కోరేటి ఈ గుండెపై 

వెలుగేదో పరిచావే నిను చూస్తున్న నా కళ్లపై

చిరునవ్వే విసిరావే నిదురించే కలపై
సిరిమువ్వై నడిచావే నిను కోరేటి ఈ గుండెపై 




తొలకరి చినుకై పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమకావాలి (2011)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: సాహితి
గానం: రంజిత్, శ్రేయా ఘోషల్

తొలకరి చినుకై





Listen to my heart.. పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమకావాలి (2011)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భువనచంద్ర
గానం: అంజు, అంజనా సౌమ్య

Listen to my heart..It's beating for you.. 
Listen to my heart..It's waiting for you.. 
Listen to my heart..Only for you my girl.. 

ఈ నిమిషం నిత్యమై పోనీ.. 
కాలమిలా కౌగిలై పోనీ.. 
రెక్కలతో తాకనీ చుక్కలని.. 
కను రెప్పలతో..తాగనీ వెన్నలని.. 
మల్లి మల్లి నిన్ను చూసుకొని.. 
కలే ఇలా నిజమైందని.. 
నిన్నే నిన్నే నే చేరుకూని 
ఊపిరే నీవని..

Listen to my heart..It's beating for you.. 
Listen to my heart..It's waiting for you.. 
Listen to my heart..Only for you my girl.. 


పలుకని పలుకే చెలియా..వినపడుతూ ఉంటె.. 
వినపడగానే మనసే..పరవశమవుతుంటే.. 
నీ అందాలకి..నాలో విరహలకి.. 
దూరమే తరగని.. 
Listen to my heart..It's beating for you.. 
Listen to my heart..It's waiting for you.. 

Listen to my heart..Only for you my girl.. 

తహ తహ లాడే తనువే..తడబడి పోతుంటే.. 
పెదవులు కలిసి ఒకటై.. వదలను లేమ్మంటే.. 
నీ మొహమాటము..నాలో ఆరాటము.. 
హద్దులే దాటని.. 
ఈ నిమిషం నిత్యమై పోనీ.. 
కాలమిలా కౌగిలై పోనీ.. 
రెక్కలతో తాకనీ చుక్కలని.. 
కను రెప్పలతో..తాగనీ వెన్నలని.. 
మల్లి మల్లి నిన్ను చుసుకూని.. 
కలే ఇలా నిజమైందని.. 
నిన్నే నిన్నే నే చేరుకూని.. 
ఊపిరే నీవని.. 
Listen to my heart..It's beating for you.. 
Listen to my heart..It's waiting for you.. 
Listen to my heart..Only for you my girl.. 
Listen to my heart..It's beating for you..
Listen to my heart..It's waiting for you..
Listen to my heart..Only for you my girl..

You Are My Girl




మనసంతా ముక్కలు చేసి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమకావాలి (2011)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కె.కె.

సనిరీస సనిరీస 
నిసరీసా నిసరీసా
దనిప మపదనిసా 
సనిరిసా సనిరిసా

మనసంతా ముక్కలు చేసి
పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం
ఊరించి ఊహలు పెంచి
తప్పుకుపోతావెందుకు ఆ పంతం
నీకై నీకై ప్రాణాలిస్తానన్నా
ఇంకా ఇంకా అలుసై పోతున్నానా
పొరపాటుంటే మన్నించవే 

మనసంతా ముక్కలు చేసి
పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం
ఊరించి ఊహలు పెంచి
తప్పుకుపోతావెందుకు ఆ పంతం
ఓ...

చరణం: 1
విరిసిన పువ్వుల కొమ్మ
తను పెనవేసిన ఒక రెమ్మ
ఎవరో తెంచేస్తు ఉంటే ఒప్పుకుంటదా
బుడి బుడి అడుగుల పాపైనా
తన ఆడుకొనేదొక బొమ్మైనా
ఎవరో లాగేసుకుంటే ఊరుకుంటదా
నువు నచ్చి మనసిచ్చి ఇపుడిక్కడేది చూస్తుంటే
కనుపాపల్లో కునుకుండదే... ఓ... ఓ...

మనసంతా ముక్కలు చేసి
పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం
ఊరించి ఊహలు పెంచి
తప్పుకుపోతావెందుకు ఆ పంతం
ఓ...

చరణం: 2
వెలుతురు ఉన్నపుడేగా నీ వెనుకనే ఉంటది నీడ
ఉంటా నడిరాతిరైన నీకు తోడుగా
చిగురులు తిన్నపుడేగా
ఆ కుహు కుహు కోయిల పాట
అవుతా నీ గుండె లయగా అన్నివేళలా
నిను కోరా ఇటు చేరా
నువు ఎటువైపో అడుగేస్తే
ఎదలోతుల్లో కుదురుండదే... ఓ... ఓ...

మనసంతా
మనసంతా ముక్కలు చేసి
పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం
ఊరించి ఊహలు పెంచి
తప్పుకుపోతావెందుకు ఆ పంతం
నీకై నీకై ప్రాణాలిస్తానన్నా
ఇంకా ఇంకా అలుసై పోతున్నానా
పొరపాటుంటే మన్నించవే 

మనసంతా ముక్కలు చేసి
పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం
ఊరించి ఊహలు పెంచి
తప్పుకుపోతావెందుకు ఆ పంతం ఓ...




నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమకావాలి (2011)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: చిత్ర, విజయ్ ప్రకాష్

నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే
నువ్వే నువ్వే నా కదిలే కలవయ్యావే 
నా ప్రేమ లోకం నువ్వే...
ప్రియతమా  హృదయమా
ప్రణయమా నా ప్రాణమా

నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే
నువ్వే నువ్వే నా కదిలే కలవయ్యావే
నా ప్రేమ లోకం నువ్వే... ఓ ఓ 
ప్రియతమా హృదయమా
ప్రణయమా నా ప్రాణమా

పైనుంచి గాలివెంటే నువ్వు నన్ను తాకుతుంటే
ఇంకొంచం కోరుకోన నీ స్నేహం
అనుకుంటే చిన్న మాటే పెదవుల్లో తేనె మాటే
నీ పేరే ప్రేమ అయిందా నా కోసం 
ఇంతలో నువ్ సొంతమై నాలో వున్నా
చాలని అనలేనుగా ఎంతైనా
ఏదో తీపి ఆవేదనా

ప్రియతమా హృదయమా
ప్రణయమా నా ప్రాణమా హో...

కలలే సూర్యోదయాలు పగలే చెంద్రోదయాలు
ప్రేతి పూట పండగే నీతో వుంటే
మనసంతా మల్లె పూలు విరభూసే పరిమళాలు
జతలోన ఉహలోనా నువ్వుంటే
నేనిలా నీకోసమే పుట్టానని
ప్రేమపై ముమ్మాటికి ఒట్టేయని
నీ ప్రేమ కావాలని...

ప్రియతమా హృదయమా
ప్రణయమా నా ప్రాణమా

ఓ ప్రియతమా - ప్రియతమా
హృదయమా - హృదయమా
ప్రణయమా నా ప్రాణమా

నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే
నువ్వే నువ్వే నా కదిలే కలవయ్యావే
నా ప్రేమ లోకం నువ్వే...ఓ 
ఓ ప్రియతమా - ప్రియతమా
హృదయమా - హృదయమా
ప్రణయమా నా ప్రాణమా


Palli Balakrishna

Ghajini (2005) Telugu Songs Lyrics Album Cover

Ghajini (2005) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Ghajini (2005) Music : Harris Jayaraj Starring : Suriya, Asin, Nayanthara, Pradeep Rawat Director : A. R. Murugadoss Producers : Salem Chandrasekharan Release Date : 29 September 2005

Oka Maaru Kalisina Song Lyrics in Telugu – Ghajini (2005)

‘Oka Maaru Kalisina’ song from Ghajini (2005) movie is composed by Harris Jayaraj and sung by Karthik.

SONG INFORMATION
Movie : Ghajini (2005) Music : Harris Jayaraj Lyricist : Veturi Singers : Karthik
చిత్రం: గజిని (2005) సంగీతం: హారీస్-జయరాజ్ సాహిత్యం: వేటూరి గానం: కార్తిక్ ఒకమారు కలిసిన అందం అలలాగ ఎగిసిన కాలం  ఒకమారు కలిసిన అందం అలలాగ ఎగిసిన కాలం  కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే  కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే  తన అల్లే కథలే పొడుపు వెదజల్లే కలలే మెరుపు  ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే  అది నన్ను పిలిచినది తరుణం నులివెచ్చగ తాకిన కిరణం  కనులు తెరిచిన కలువను చూశానే చూశానే చూశానే  ఒకమారు కలిసిన అందం అలలాగ ఎగిసిన కాలం  కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే  కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే  చరణం: 1  పాత పదనిస దేనికది నస నడకలు బ్రతుకున మార్చినదే  సాయంకాల వేళ దొరుకు చిరుతిండి వాసనలు వాడుక చేసిందే కుచ్చీ కూన చల్లగా... నీ... సా...  నను తాకె కొండమల్లికా... నీ... సా...  సరిజోడు నేనేగా అనుమానం ఇంకేలా ఒకమారు కలిసిన అందం అలలాగ ఎగిసిన కాలం  కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే  కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే  చరణం: 2  పేరు అడిగతె తేనె పలుకుల జల్లుల్లో ముద్దగా తడిశానే  పాలమడుగున మనసు అడుగున కలిసిన కనులను వలచానే  మంచున కడిగిన ముత్యమా నీ మెరిసే నగవే చందమా  హో... కనులారా చూడాలే తడి ఆరిపోవాలే ల ర లాల లర లల లాల... ఓ... ల ర లాల లర లల లాల... కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే  కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే  తన అల్లే కథలే పొడుపు వెదజల్లే కలలే మెరుపు  ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే  అది నన్ను పిలిచినది తరుణం నులివెచ్చగ తాకిన కిరణం  కనులు తెరిచిన కలువను చూశానే

Rahathulla Song Lyrics in Telugu – Ghajini (2005)

‘Rahathulla’ song from Ghajini (2005) movie is composed by Harris Jayaraj and sung by Anupamaa.

SONG INFORMATION
Movie : Ghajini (2005) Music : Harris Jayaraj Lyricist : Bhuvanachandra Singers : Anupamaa
చిత్రం: గజిని (2005) సంగీతం: హారీస్-జయరాజ్ సాహిత్యం: భువనచంద్ర గానం: అనుపమ & కోరస్ దారి నడుమ నారి తీగ కంట బడితే కనుల విందేగా రహాతుల్లా రహాతుల్లా రసగుల్లా వల్లా నా తలపుల తలుపును తెరవర ఇల్లా విరిగిన మనసుని అతికించేస్తా అరే తడిపొడి వయసుని ఉబికించేస్తా వెయ్యని- మారు వేషం ఊరంతా - పొంగిపోదా నా పాటే - పాడుకోవే చెలి వేగం పెడితేలే మౌనమో - నీలి మేఘం మోహమో -నీలి సంద్రం పాదమో - అర్ణ వర్ణం కసి వయసుకి దాసోహం వయసుకి దాసోహం రహాతుల్లా రహాతుల్లా రసగుల్లా వల్లా నా తలపుల తలుపును తెరవర ఇల్లా విరిగిన మనసుని అతికించేస్తా అరే తడిపొడి వయసుని ఉబికించేస్తా నే వలపుల వలపుల కవితను కవితను చదువు చదువు గురువా యద కదలను కదలను తెలిపెద తెలిపెద వినర వినర మరల మెరుపుల్నీ ఉరికిస్తా చూడు తళుకుల్ని చిలికిస్తా ఆడు తడిమీ వడి తడిమీ చూపే విసిరీ ఆడించేస్తా కథాకళీ రహాతుల్లా రహాతుల్లా రసగుల్లా వల్లా నా తలపుల తలుపును తెరవర ఇల్లా విరిగిన మనసుని అతికించేస్తా అరే తడిపొడి వయసుని ఉబికించేస్తా జడి వానలో వానలో వయసుని తడుపుతూ ఉరికి పడిన చిలక చిరు పెదవుల పెదవులమధువులు మధువులు వొలికే వొలికే విడక రోజంతా నాపాదం పడితే సంతోషం కోపాలే రావూ ఓ రా రమ్మని పిలిచెను యవ్వనం యవ్వనం ఓహో రహాతుల్లా రహాతుల్లా రసగుల్లా వల్లా నా తలపుల తలుపును తెరవర ఇల్లా విరిగిన మనసుని అతికించేస్తా అరే తడిపొడి వయసుని ఉబికించేస్తా వెయ్యని- మారు వేషం ఊరంతా - పొంగిపోదా నా పాటే - పాడుకోవే చెలి వేగం పెడితేలే మౌనమో - నీలి మేఘం మోహమో -నీలి సంద్రం పాదమో - అర్ణ వర్ణం కసి వయసుకి దాసోహం

Hrudayam Ekkadunnadi Song Lyrics in Telugu – Ghajini (2005)

‘Hrudayam Ekkadunnadi’ song from Ghajini (2005) movie is composed by Harris Jayaraj and sung by Harish Raghavendra, Bombay Jayashri.

SONG INFORMATION
Movie : Ghajini (2005) Music : Harris Jayaraj Lyricist : Vennelakanti Singers : Harish Raghavendra, Bombay Jayashri
చిత్రం: గజిని (2005) సంగీతం: హారీస్-జయరాజ్ సాహిత్యం: వెన్నలకంటి గానం: హరీష్ రాఘవేంద్ర, బాంబే జయశ్రీ హృదయం ఎక్కడున్నదీ హృదయంఎక్కడున్నదీ నీ చుట్టూనే తిరుగుతున్నదీ... అందమైన అబద్ధం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నదీ  చూపులకై వెతికా చూపుల్లోనే బతికా కళ్ళు తెరచి స్వప్నమే కన్నా  తొలిసారీ కళ్ళు తెరచి స్వప్నమే కన్నా  హృదయం ఎక్కడున్నదీ హృదయంఎక్కడున్నదీ నీ చుట్టూనే తిరుగుతున్నదీ... అందమైన అబద్ధం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నదీ  చూపులకై వెతికా చూపుల్లోనే బతికా కళ్ళు తెరచి స్వప్నమే కన్నా  తొలిసారీ కళ్ళు తెరచి స్వప్నమే కన్నా  చరణం: 1  కుందనం మెరుపు కన్నా బంధనం వయసుకున్నా చెలి అందం నేడే అందుకున్నా  గుండెలో కొసరుతున్నా కోరికే తెలుపుకున్నా చూపే వేసీ బతికిస్తావనుకున్నా  కంటిపాపలా పూవులనే నీ కనులలో కన్నా నీ కళ్ళే వాడిపోని పూవులమ్మా నీ కళ్ళే వాడిపోని పూవులమ్మా హృదయం ఎక్కడున్నదీ హృదయంఎక్కడున్నదీ నీ చుట్టూనే తిరుగుతున్నదీ... అందమైన అబద్ధం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నదీ  చూపులకై వెతికా చూపుల్లోనే బతికా కళ్ళు తెరచి స్వప్నమే కన్నా  తొలిసారీ కళ్ళు తెరచి స్వప్నమే కన్నా  చరణం: 2  మనసులో నిన్ను కన్నా మనసుతో పోల్చుకున్నా తలపుల పిలుపులు విన్నా సెగలలో కాలుతున్నా చలికినే వణుకుతున్నా నీడే లేని జాడే తెలుసుకున్నా మంచు చల్లనా ఎండ చల్లనా తాపంలోన మంచు చల్లనా కన్నా నీ కోపంలోనా ఎండ చల్లనా కన్నా నీ కోపంలోనా ఎండ చల్లనా హృదయం ఎక్కడున్నదీ హృదయంఎక్కడున్నదీ నీ చుట్టూనే తిరుగుతున్నదీ... అందమైన అబద్ధం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నదీ  చూపులకై వెతికా చూపుల్లోనే బతికా కళ్ళు తెరచి స్వప్నమే కన్నా  తొలిసారీ కళ్ళు తెరచి స్వప్నమే కన్నా 

Rangola Ola Song Lyrics in Telugu – Ghajini (2005)

‘Rangola Ola’ song from Ghajini (2005) movie is composed by Harris Jayaraj and sung by Tippu, Sujatha Mohan.

SONG INFORMATION
Movie : Ghajini (2005) Music : Harris Jayaraj Lyricist : Veturi Singers : Tippu, Sujatha Mohan
చిత్రం: గజిని (2005) సంగీతం: హారీస్-జయరాజ్ సాహిత్యం: వేటూరి గానం: టిప్పు, సుజాత మోహన్ రంగోల హోల హో రంగోల హోల హోల పిల్లా నీవేనా నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనే నా హో రంగోల హోల హోల రాజా నీవే రా నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనే రా కోమల వల్లి వల్లి, కనులతో కొంచం గిల్లి తిరిగిన చుట్టూ చల్లే విచ్చుకున్నా మళ్లీ కార్థవ రాయ రాయ మల్లెపువు నేనైపోయా మాలలే వేసానయ్యా నేను నీగుండె మీద చేరిపోయా హోయ్ రంగోల హోల హోల పిల్లా నీవేనా నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనే నా హోయ్ రంగోల హోల హోల రాజా నీవే రా నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనే రా ఓ... ఇలా ఇలా పసందులాయే హుషారులే మరింతలాయే అలాగిలా సరంగులాయే అలే ఆడగా ఎడా పెడా అదే జ్వరాల తటాలోన చలెక్కువయే చడామడ కొరుక్కు తిన్న హడావిడినా నా సరసకురావలే పిల్లా నిన్ను మరచుట కనులకు కళ్ళ కుడి ఎడమైన తడబడు ఆశ ఉనుకులకే మల్ల ఏ విడుపులు కసరను సారీ ఇది ఉడుపులు తెలిసిన పోరి కంచెలు దాటి కసపిస చేస్తే కత్తెరలేస్తాలే రంగోల హోల హోల రాజా నీవే రా నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనే రా యదే మరీ ఉర్రూతలూగే అదే శృతి తిల్లాన లాయే వరించిన క్షణాలు తాకే సుఖం సుఖమో తళుక్కుల కసక్కు రాణి చటుక్కున కసెక్కుతోందే పలారమే సుధారమాయే ఆరఆరగ నీ మనసుకు వేసై మందు నా మనసును లాగే ముందు దడ దడ గుండె గడబిడ మంటే వదలను నీ తోడు నే చెడుగుడు ఆడే ముందు నీ అడుగులు వేసై చిందు విడువను నిన్ను పద పద ముందు పట్టును వదలనులే హోయ్ రంగోలా రంగోల హోల హోల పిల్లా నీవేనా నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనే నా రంగోల హోల హోల రాజా నీవే రా నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనే రా కోమల - వల్లి వల్లి కనులతో - కొంచం గిల్లి తిరిగిన చుట్టూ చల్లే విచ్చుకున్నా మళ్లీ కార్థవ రాయ రాయ మల్లేపువు నేనైపోయా మాలలే వేసానయ్యా నేను నీగుండె మీద చేరిపోయా

X Pichi Y Pichi Song Lyrics in Telugu – Ghajini (2005)

‘X Pichi Y Pichi’ song from Ghajini (2005) movie is composed by Harris Jayaraj and sung by Mathangi, Nakul.

SONG INFORMATION
Movie : Ghajini (2005) Music : Harris Jayaraj Lyricist : Chandrabose Singers : Mathangi, Nakul
చిత్రం: గజిని (2005) సంగీతం: హారీస్-జయరాజ్ సాహిత్యం: చంద్రబోస్ గానం: మాతాంగి, నకుల్ ఎక్స్ పిచ్చి వై పిచ్చి ఎదో పిచ్చి ట్యుాన్ చేసి పాడానంటే ఎక్కును పిచ్చి ఎక్స్ పిచ్చి వై పిచ్చి ఎదో పిచ్చి ట్యుాన్ చేసి పాడానంటే ఎక్కును పిచ్చి నా పరువాలన్నీ నూరుపాళ్లు పడిచచ్చేరంటా పోరగాళ్ళు అడుగెట్టిన చోటల్లా అణుయుద్ధాలే మొదలయ్యే అంతే ఎక్స్ పిచ్చి వై పిచ్చి ఎదో పిచ్చి ట్యూన్ చేసి పాడానంటే ఎక్కును పిచ్చి నా పరువాలన్నీ నూరుపాళ్లు పడిచచ్చేరంటా పోరగాళ్ళు అడుగెట్టిన చోటల్లా అణుయుద్ధాలే మొదలయ్యే అంతే తన దారే అరిగేలా నా చుట్టూరా తిప్పుకోనా ఫేవికోలె అదిరేలా ఒక పట్టునే పట్టుకోనా బంగారు డాల్పినల్లే ఎగిరిదూకి రానా ఇంగ్లీషు చానలల్లే నిన్ను ముంచి పోనా ఎంతో ఉంది, ఇప్పుడయ్యింది కొంతే ఎక్స్ పిచ్చి వై పిచ్చి ఎదో పిచ్చి ట్యూన్ చేసి పాడానంటే ఎక్కును పిచ్చి నా పరువాలన్నీ నూరుపాళ్లు పడిచచ్చేరంటా పోరగాళ్ళు అడుగెట్టిన చోటల్లా అణుయుద్ధాలే మొదలయ్యే మృదువైన పేజిని రసికధలే ప్రచురించు ముల్లులేని రోజాని మదిలొనే సంధించు చిరుగాలి నన్ను చేరి గిచ్చి పెడుతూ వుంటే విరులన్ని నన్ను చేరి వెచ్చబడుతూ ఉంటే నా పెదవుల పాపలు అడిగెను ముద్దుల బంతే హే ఎక్స్ పిచ్చి వై పిచ్చి ఎదో పిచ్చి ట్యూన్ చేసి పాడానంటే ఎక్కును పిచ్చి నా పరువాలన్నీ - ఓ ఓహ పడిచచ్చేరంటా - ఊ అ అహ అడుగెట్టిన చోటల్లా అణుయుద్ధాలే మొదలయ్యే అంతే

Palli Balakrishna




చిత్రం: ముఠామేస్త్రి (1993)
సంగీతం: రాజ్ - కోటి
నటీనటులు: చిరంజీవి , మీనా, రోజా
దర్శకత్వం: ఏ. కోదండరామిరెడ్డి
నిర్మాతలు: కె.సి.శేఖర్ బాబు, డి.శివప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 17.01.1993



Songs List:



ఈ పేటకు నేనే మేస్త్రీ పాట సాహిత్యం

 
చిత్రం: ముఠామేస్త్రి (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు

హు... హు...
హు అధిరబల హు హై లెస్సా (2)

హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ (2)

ఈ పేటకు నేనే మేస్త్రీ నిరుపేదల పాలిట పెన్నిధి
ఈ పేటకు నేనే మేస్త్రీ నిరుపేదల పాలిట పెన్నిధి
కాయకష్టయం ఎరగని వాళ్ళకి ఖబర్దారు గస్తీ
నేనే - ముఠామేస్త్రి
హే నేనే - ముఠామేస్త్రి

హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ (2)

హే సూపర్ పాపకి సుకుమారి ని షేపులు కరగక తప్పుదులే
హో హో - ఆఁ, హో హో - ఆఁ, హో హో - ఆఁ దింతాక్ దింతాక్
కాకరకాయల కమలాక్షి నీ చేదుకు బెల్లం యమ రుచిలే
దేవుడిచ్చిన కాయలకే మనిషి పెంచెను పైరేటు
తిష్ట జీవి సాపాటు కష్ట జీవికి గ్రహాపాటు
గుంటూరు గోంగూర పులుపంతా వలపేరా
నీ కత్తికి దురదైతే నా చేమకు సరదారా
నీ కందకు దురదైతే నా చేమకు సరదారా
హ కసిగా ఉసిగా బతికే వాళ్లకు ఖలేజాల జాస్తి

నేనే - ముఠామేస్త్రి
హా నేనే - ముఠామేస్త్రి
హహాహుఁ ... హహాహుఁ...

హోయ్ హోయ్ హోయ్
హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ (2)

హోయ్ సోమరిపోతుల రాజ్యాలు సొరకాయల కోతలు చెల్లవురా
హో హో - ఖబడ్ధార్
హో హో - అవునుబే
హో హో - షటాంక్ షటాంక్
కాలే కడుపుల కష్టాలే మన లేబరిజానికి చేతులురా
హో హో - ఆఁ, హో హో - ఆఁ, హో హో - ఆఁ, తద్దింక్ తద్దింక్
దంచు మిర్చి మసాలా పెంచు మంచి ఇవాళా
వంచు ఒళ్లు ఇలాగ వడ్డు చేరు మాజాగా
నీ గంప ఎత్తనిదే నీ కొంప గడవదులే
న బస్తా వెయ్యనిదే నీ బండి నడవదులే
కులికే చిలకా బరిలో పడితే కులశాలు గస్తీ

నేనే - ముఠామేస్త్రి
హా నేనే - ముఠామేస్త్రి
జింతాక్ జింతాక్
అరెరరె రరెరరె
హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ (2)





అంజనీ పుత్రుడా పాట సాహిత్యం

 
చిత్రం: ముఠామేస్త్రి (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా
ఆహా - యాహా యయ యయ యయ యయ యాహా

ఆ అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా
ఆహా - యాహా యయ యయ యయ యయ
అమ్మనీ జిమ్మడా అందాల పావడా అమ్మడా గుమ్మడా నీ మీద నాకు యాహా
ఆహా - యాహా యయ యయ యయ యయ

మెచ్చుకో పుచ్చుకో మేస్త్రీ మణి
స్పీడుతో దంచకే చింతామణి
చలాకీలో ఎలా వీలో అలా కానీ
రావే టొమోటకి సయ్యాటకి

అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా
ఆహా - యాహా యయ యయ యయ యయ

నారి నాంచారామ్మో స్టోరి మారుధ్ధమ్మో బండి తోసే బజ్జిల పాప
మేస్త్రీ మారాజయ్యె నీ స్త్రీ నేనేనయ్యో బండినేలే మీసాల మామా
సరుకేమో అహా తెగ చీపు ఓహో తళుకేమో ఓహో యమ టాపు
పలుకేమో ఓహో పిడిబాకు అహా మనసేమో అహా నవ టాపు
పసివాడు కసివాడు నను పదే పదే కుమ్మేసెనే
అమ్మనీ జిమ్మడా అందాల పావడా అమ్మడా గుమ్మడా నీ మీద నాకు యాహా
ఆహా - యాహో

అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా
ఆహా - యాహా - యయ యయ యయ యయ

కాపు నీకే ఇస్తా ఊపు నీకే తెస్తా పక్కనీతో పండించుకుంటా
బేరం నిన్నేచేస్తా లాభం లాగించేస్తా మంచమంతా వడ్డించు కుంటా
మడిసేమో ఒహో యముడంటా అహా మగడైతే అహా యమ జంటా
కదిలిస్తే అబ్బో తీగంటా అహా కదిలిందా అదే డొంకంటా
చలి రాణి అలివేని నను ఎడా పెడా కవ్వించకే

అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా
హ ఆహా - యాహో
అమ్మనీ జిమ్మడా అందాల పావడా అమ్మడా గుమ్మడా నీ మీద నాకు యాహా
హ ఆహా - యాహో యయ యయ యయ యయ
మెచ్చుకో పుచ్చుకో మేస్త్రీ మణి
అరె స్పీడుతో దంచకే చింతామణి
చాలకీలో ఎలా వీలో అలా కానీ
రావే టొమోటకి సయ్యాటకి

అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా
ఆహా - యాహా - యయ యయ యయ యయ యాహా




చికి చికి చాం పాట సాహిత్యం

 
చిత్రం: ముఠామేస్త్రి (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో, చిత్ర

హో... ఓ...   -   ఓ... హో...
ఏ... హే...    -   ఏ... హే...
ఓ... ఓ... ఓ...    -   ఓ... హో... ఓ...

చికి చికి చాం చిచాంకు చాం (2)

చికి చికి చాం చిచాంకు చాం చికుచాం పిల్లా పందెం కట్టో
చికి చికి చాం చిచాంకు చాం చికుచాం ఒళ్ళో మేళం పెట్టు
నే కాదన్నానా సుందరి  సుందరి సుందరి
చాపేయ్ మంటావా పోకిరి రా మరి దా మరి
కొత్తంగా కొంగొత్తగా వయ్యారం దండెత్తగా
మొత్తంగా గమ్మత్తుగా జోడించి ఈడొచ్చేగా

చికి చికి చాం చిచాంకు చాం చికుచాం (2)

చికి చికి చాం చిచాంకు చాం చికుచాం పిల్లా పందెం కట్టో
చికి చికి చాం చిచాంకు చాం చికుచాం ఒళ్ళో మేళం పెట్టు

వస్తా విడిదికొస్తా పెదవి దూస్తా పదును చూస్తా
వస్తే నిలువరిస్తా వడుపు చూసి ముడుపులిస్తా
అయితే సరే కొట్టించుకోన కావేరి
ఓకే ప్రియా షంషేరు గుంది రా రా రి
చిలకకొచ్చింది ఊపు చీరకివ్వాలి షాక్
నెత్తికెక్కింది కైపు ఆదరగొట్టాలి టాపు
అరయారో తలబడు హీరో

చికి చికి చాం చిచాంకు చాం చికుచాం (2)

చికి చికి చాం చిచాంకు చాం చికుచాం పిల్లా పందెం కట్టో
చికి చికి చాం చిచాంకు చాం చికుచాం ఒళ్ళో మేళం పెట్టు

కానీ కొదమసింహం పదునుపెట్టా కధన రంగం
ఏమీ పడుచు పొంకం తప్పదింకా గర్వభంగం
మమామియా నీ బాంచనింకా లాగించు
తస్సాదియా తర్ఫీదు ఇంకా చాలించు
వయసు పదహారు రయ్యో వడిసి పట్టెయ్ బాయ్యో
పరుచుకో పక్క పాప కేక పెట్టాలి కోక
అదిరేలా వలపుల కూజా

చికి చికి చాం చిచాంకు చాం చికుచాం (2)

చికి చికి చాం చిచాంకు చాం చికుచాం పిల్లా పందెం కట్టో
చికి చికి చాం చిచాంకు చాం చికుచాం ఒళ్ళో మేళం పెట్టు
నే కాదన్నానా సుందరి  సుందరి సుందరి
చాపేయ్ మంటావా పోకిరి రా మరి దా మరి
కొత్తంగా కొంగొత్తగా వయ్యారం దండెత్తగా
మొత్తంగా గమ్మత్తుగా జోడించి ఈడొచ్చేగా

చికి చికి చాం చిచాంకు చాం చికుచాం (2)

చికి చికి చాం చిచాంకు చాం చికుచాం పిల్లా పందెం కట్టో
చికి చికి చాం చిచాంకు చాం చికుచాం ఒళ్ళో మేళం పెట్టు




ఎంత ఘాటు ప్రేమయో పాట సాహిత్యం

 
చిత్రం: ముఠామేస్త్రి (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర, యస్. పి. బాలు

ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా
ఏటవాలు చూపులో మౌనగీతమా
వచ్చీరాని వయ్యారాలే వయసాయే
మళ్ళీ మళ్ళీ సాయంత్రాలే మనసాయే
నిజమా...  -  అమ్మమ్మా…

చిలిపి కనుల కబురు వింటే బిడియమో ఏమో సుడులు రేగింది
పెదవి తొనల మెరుపు కంటే ఉరుములా నాలో ఉడుకు రేగింది
గుబులో దిగులో వగలైపోయే వేళలో
తనువు తనువు తపనై తాకే వేడిలో
మల్లి జాజి జున్నులా చలి వెన్నెల ముసిరేనిలా
నిజమా...  -  అమ్మమ్మా…

ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా
ఏటవాలు చూపులో మౌనగీతమా

చిగురు తొడిగే సొగసుకంటే పొగరుగా ప్రాయం రగిలిపోయింది
ఉలికి నడుము కదుపుతుంటే తొలకరింతల్లో తొడిమ రాలింది
కుడివైపదిరే శకునాలన్ని హాయిలే
ప్రియమో ఏమో నయగారాలే నీదిలే
గోరింటాకు పూపొద చలి ఆపదా ఇక ఆపదా
నిజమా...  -  అమ్మమ్మా…

ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా
ఏటవాలు చూపులో మౌనగీతమా



జోరుగున్నాది పాట సాహిత్యం

 
చిత్రం: ముఠామేస్త్రి (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర, యస్. పి. బాలు

జోరుగున్నాది గులాబి గుంటది చంటిది ఒంటరిగా
జోడుకడతావా అన్నాడే గుంటడు తుంటరిగా
అరె జోరుగున్నాది గులాబి గుంటది చంటిది ఒంటరిగా
జోడుకడతావా అన్నాడే గుంటడు తుంటరిగా
తిరకాసు పెట్టొద్దే తిరగలి బుల్లో
మరదలినై పోతున్నా మావా నీ ఒళ్ళో... హో
యమ జోర్ జోర్ జోరుగుంది జోడి కట్టేసే
యద హోర్ హోర్ హోరుమంది బోణీ కొట్టేసేయ్

జోరుగున్నాది గులాబి గుంటది చంటిది ఒంటరిగా
జోడుకడతావా అన్నాడే గుంటడు తుంటరిగా

జింగిలాల  జింగిలాల జింగిలాల  జింగిలాల లగో లగో లగో జింగిలాల
జింగిలాల  జింగిలాల జింగిలాల  జింగిలాల

చిలిపి చీరలో అగడం పగడం ఎవారికోసముంచావే
వివరించాలంటే నా సిగ్గే చిరునామా
అరె చెరుకు పొలములో చెలిమే మధురం ఇరుకు ఎక్కువవుతుంటే
గడియైనా మావా గడిపేద్దాం రారా
అరె నిన్నే చూస్తిని కన్నే వేస్తిని వన్నే కోస్తినే భామ
అరె గౌనే వేస్తిని కవ్వించేస్తిని లవ్వే చేయిమావా
దేవి లావాదేవి నీతోనే
పగలే పేచీ రాత్రే రాజీలే...

యమ జోర్ జోర్ జోరుగుంది జోడి కట్టేసే
యద హోర్ హోర్ హోరుమంది బోణీ కొట్టేసేయ్
జోరుగున్నాది గులాబి గుంటది చంటిది ఒంటరిగా
జోడుకడతావా అన్నాడే గుంటడు తుంటరిగా

హోయన హొయ్ హొయ్ హొయ్ హొయ్ హోయన హోయన హొయ్
హోయన హొయ్ హొయ్ హొయ్ హొయ్ హోయన హోయన హొయ్

అరె హొయన  హొయన, అరె హొయన  హొయన

మగడి పొగరులో మరువం జవదం ఎవరికిచ్చుకుంటావు
అని తల్లో మెచ్చా చెలి తల్లో గుచ్చా
పడుచు గోపురం నఖరం శిఖరం తగిలి కుంపటేస్తుంటే
తొలి ఈడే నవ్వే చలి తోడే నువ్వే
మరి నువ్వే నా చిరు నేనే మేజరు రోజు హాజరవుతాలే
ఓసి పిల్లా సుందరి మల్లే పందిరి అంతా తొందరేలే
ఆజా రోజా తీశా దర్వాజా
బాజా లేలి తాజా మ్యారేజా హొయ్ హొయ్ హొయ్ హొయ్

యమ జోర్ జోర్ జోరుగుంది జోడి కట్టేసే
యద హోర్ హోర్ హోరుమంది బోణీ కొట్టేసేయ్
అరెరెరరరె జోరుగున్నాది గులాబి గుంటది చంటిది ఒంటరిగా
జోడుకడతావా అన్నాడే గుంటడు తుంటరిగా
ఆఁ తిరకాసు పెట్టొద్దే తిరగలి బుల్లో
మరదలినై పోతున్నా మావా నీ ఒళ్ళో... హో
యమ జోర్ జోర్ జోరుగుంది జోడి కట్టేసే
యద హోర్ హోర్ హోరుమంది బోణీ కొట్టేసేయ్




వాన గడియారంలో పాట సాహిత్యం

 
చిత్రం: ముఠామేస్త్రి (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు

We are Drawer (3)

హా వాన గడియారంలో  నీటిముళ్లు గంట కొడితే
ఆడ మళయాలంలో అందగత్తె కన్ను కొడితే
తెగించరా  తెగించరా దెయ్యంతోనా అహోబిలా
మేకప్ లేక గీకప లేక్ కకావికా  కకావికా చుప్

ద ద ద ద వాన గడియారంలో  నీటిముళ్లు గంట కొడితే
ఆడ మళయాలంలో అందగత్తె కన్ను కొడితే

గిల్లిపెట్టే లిల్లిఫ్రూట్ల కొల్లగొట్టే బడ్లో
తెల్లబోయే పిల్లదాని పావుర కోరస్సుల్లో
హా పీకి పీకి గడుసు పిల్ల పెళ్ళు
పొట్టివాళ్ళ పొగరులో
తొక్కిసలాడిన తగ్గని వెన్నెల పాప
దిక్కెవరన్నది ఏ మగదిక్కు లేక

వాన గడియారంలో  నీటిముళ్లు గంట కొడితే
ఆడ మళయాలంలో అందగత్తె కన్ను కొడితే

We are Jangle Boys (3)

మద్దిచెట్టు ముద్దుపెట్టే మూలుగు ముట్టడవుల్లో
ఖడ్గ ముక్కు కన్ను కొట్టే కౌగిలి కారడవుల్లో
చిక్కు కున్న చిలిపి జక్కనవ్వా దిక్కుతోడు ఎవరహో

ఆపద మొక్కుల దేవుడు ఒకడేనంటా
ఏ పొదమాటున నక్కాడో మొగుడంటా

Mr Bat man (3)

సాక సికా శుకా సేక  కత్తి కర్రం కజ్జి కవ్వి హూ


వాన గడియారంలో  నీటిముళ్లు గంట కొడితే
ఆడ మళయాలంలో అందగత్తె కన్ను కొడితే

Palli Balakrishna




చిత్రం: నేను ప్రేమిస్తున్నాను (1997)
సంగీతం: సిర్పీ
నటీనటులు: జె.డి.చక్రవర్తి, రచన బెనర్జీ
దర్శకత్వం: ఈ. వి.వి.సత్యన్నారాయణ
నిర్మాత: ఆర్.బి.చౌదరి
విడుదల తేది: 06.06.1997



Songs List:



లూలి లూలి పాట సాహిత్యం

 
చిత్రం: నేను ప్రేమిస్తున్నాను (1997)
సంగీతం: సిర్పీ
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి. బాలు, మనో

లూలి లూలి




అందరి ముందర పాట సాహిత్యం

 
చిత్రం: నేను ప్రేమిస్తున్నాను (1997)
సంగీతం: సిర్పీ
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం: యస్.పి. బాలు, కె.యస్.చిత్ర 

అందరి ముందర 



ప్రేమా దీవించుమా పాట సాహిత్యం

 
చిత్రం: నేను ప్రేమిస్తున్నాను (1997)
సంగీతం: సిర్పీ
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం: మనో 

ప్రేమా దీవించుమా 




ప్రేమతో నిను పాట సాహిత్యం

 
చిత్రం: నేను ప్రేమిస్తున్నాను (1997)
సంగీతం: సిర్పీ
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం: మనో,  కె.యస్.చిత్ర 

ప్రేమతో నిను 



ఓ కోవెల్లో దీపంలా పాట సాహిత్యం

 
చిత్రం: నేను ప్రేమిస్తున్నాను (1997)
సంగీతం: సిర్పీ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, మనో

అరె అరే తొందరగా పాడరా బాబు 
అవతల సిగరెట్ సాంగా చూసే సాంగా అని 
ఆడియెన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు
తొందరగా పాడు కమాన్ సింగ్

ఓ కోవెల్లో దీపంలా కావ్యంలో భావంలా 
తెలుగింటి కాంతరా తోలి సంధ్య కాంతిరా
నాయదలో ఊయలూగుతోందిరా ఊగుతోందిరా
కోవెల్లో దీపంలా తెలుగింటి కాంతరా తోలి సంధ్య కాంతిరా

బాగానే ఉందికాని ఇంతకి నువ్వు ప్రేమిస్తున్నట్టు ఆ అమ్మాయికి తెలుసా?
ఉహూఁ మరి ఆ అమ్మాయి నో అంటే ఏమి చేస్తావ్
దేవదాసునైపోతా 
నీకు మందు అలవాటు లేదుకదరా చేసుకుంటా తాగుతుంటా 
ఆ సీను తరువాత ముందు ఆ పిల్ల ఊరు పేరు చెప్పు

సౌందర్యం అమ్మడి ఊరు లావణ్యం ఆ చెలి పేరు 
కూర్చోని ఉంటే చూసే గుండెలు ఊగాలి
తను కదిలిందంటే సాగే కాలం ఆగాలి
ఆ నవ్వుకు నేనే దాసోహం ఏ పువ్వుకు లేదే ఆ సుకుమారం
ఓ కోవెల్లో దీపంలా తెలుగింటి కాంతరా తోలి సంధ్య కాంతిరా

ఆహా ఓహో ఏంటిరా మనోడు సూపర్ గా చెప్తున్నాడురా 
నువ్వుండవోయ్ అరే తొందరగా చెప్పరాబాబు ఆఁ

ఊహల్లో ఊర్వశులైనా ఊరించే మేనకలైనా
ఆ చిన్నారిని చూశారంటే చినబోరా
తన చెలికత్తెలుగా ఉంటే చాలని అనుకోరా
ఏ కలలో లేదే ఆ అందం తను కనిపిస్తేనే కళ్ళకు అర్ధం

ఓ కోవెల్లో దీపంలా కావ్యంలో భావంలా 
తెలుగింటి కాంతరా తోలి సంధ్య కాంతిరా
నాయదలో ఊయలూగుతోందిరా ఊగుతోందిరా
కోవెల్లో దీపంలా తెలుగింటి కాంతరా తోలి సంధ్య కాంతిరా
లల లాల లాల లా... లల లాల లాల లా
లల లాల లాల లా... లల లాల లాల లా




బేబీ బేబీ పాట సాహిత్యం

 
చిత్రం: నేను ప్రేమిస్తున్నాను (1997)
సంగీతం: సిర్పీ
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: హరిహరన్,  కె.యస్.చిత్ర 

బేబీ బేబీ

Palli Balakrishna



చిత్రం: విచిత్ర సోదరులు (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు
నటీనటులు: కమల్ హాసన్, రూపిణి, గౌతమి
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
నిర్మాత: బి.సీతారామయ్య
విడుదల తేది: 17.04.1989

నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే

నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే
ఆ నింగినెన్నటికీ ఈ భూమి చేరదనీ
నాడు తెలియదులే ఈనాడు తెలిసెనులే
ఓ చెలీ... నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే

ఆడుకుంది నాతో జాలిలేని దైవం
పొందలేక నిన్నూ ఓడిపోయే జీవితం
జోరువానలోనా ఉప్పునైతి నేనే
హొరుగాలిలోనా ఊకనైతి నేనే
గాలి మేడలే కట్టుకున్నా చిత్రమే అది చిత్రమే
సత్యమేదో తెలుసుకున్నా చిత్రమే అది చిత్రమే
కథ ముగిసెను కాదా కల చెదిరెను కాదా
అంతే... నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే

కళ్ళలోన నేను కట్టుకున్న కోట
నేడు కూలిపోయే ఆశ తీరు పూట
కోరుకున్న యోగం జారుకుంది నేడు
చీకటేమో నాలో చేరుకుంది చూడు
రాసి ఉన్న తలరాత తప్పదు చిత్రమే అది చిత్రమే
గుండె కోతలే నాకు ఇప్పుడు చిత్రమే అది చిత్రమే

కథ ముగిసెను కాదా కల చెదిరెను కాదా
అంతే... నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే
ఆ నింగినెన్నటికీ ఈ భూమి చేరదనీ
నాడు తెలియదులే ఈనాడు తెలిసెనులే
ఓ చెలీ... నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే


Palli Balakrishna




చిత్రం: ఆత్మబంధువు (1985)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: జెమిని గణేషన్, రాధ
దర్శకత్వం & నిర్మాత: పి. భారతీరాజా
విడుదల తేది: 15.08.1985



Songs List:



మనిషికో స్నేహం పాట సాహిత్యం

 
చిత్రం: ఆత్మబంధువు (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

మనిషికో స్నేహం మనసుకో దాహం
లేనిదే జీవం లేదు జీవితం కానే కాదు
మమతనే మధువు లేనిదే చేదు
మనిషికో స్నేహం మనసుకో దాహం

ఒక చిలక ఒద్దికైంది మరు చిలక మచ్చికైంది
వయసేమో మరిచింది మనసొకటై కలిసింది
కట్టగట్టి ఆపాలన్నా గంగ పొంగులాగేనా
ప్రేమలేని నాడీ నేల పూవులిన్ని పూచేనా
మనిషిలేని నాడు దేవుడైన లేడు
మంచిని కాచే వాడు దేవుడికి తోడు

మనిషికో స్నేహం మనసుకో దాహం
మనిషికో స్నేహం మనసుకో దాహం
లేనిదే జీవం లేదు జీవితం కానే కాదు
మమతనే మధువు లేనిదే చేదు
మనిషికో స్నేహం మనసుకో దాహం 

వయసు వయసు కలుసుకుంటే
పూరి గుడిసె రాచనగరు...
ఇచ్చుకోను పుచ్చుకోను..
ముద్దులుంటే పొద్దుచాలదు
ప్రేమ నీకు కావాలంటే పిరికివాడు కారాదు
గువ్వ గూడు కట్టే చోట కుంపటెట్టి పోరాదు
ఓర్వలేని సంఘం ఒప్పుకోదు నేస్తం
జాతి మత భేదాలన్నీ స్వార్థపరుల మోసం

మనిషికో స్నేహం మనసుకో దాహం
మనిషికో స్నేహం మనసుకో దాహం
లేనిదే జీవం లేదు జీవితం కానే కాదు
మమతనే మధువు లేనిదే చేదు
మనిషికో స్నేహం మనసుకో దాహం




పట్టి తెచ్చానులే..పాట సాహిత్యం

 
చిత్రం: ఆత్మ బంధువు (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం:  యస్.జానకి, యస్.పి.బాలు

పట్టి తెచ్చానులే..పండు వెన్నెల్నీ నేనే..
అహ నా మావ కోసం !
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్నీ నేనే..
అహ నా మావ కోసం
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్నీ నేనే..
అహ నా మావ కోసం

ఏది ఏది చూడనీవే దాన్ని..
కళ్ళు ముయ్యి చూపుతానూ అన్నీ..
ఏది ఏది చూడనీవే దాన్ని..
కళ్ళు ముయ్యి చూపుతానూ అన్నీ..
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్నీ నేనే..
అహ నా మల్లి కోసం

మనసున సెగలెగసే..ఏం మాయో వెలుపల చలి కరిచే
వయసుకు అది వరసా..వరసైన పిల్లదానికది తెలుసా
మాపిటికి చలిమంటేస్తా..కాచుకో కాసంతా
ఎందుకే నను ఎగదోస్తా..అందుకే పడి చస్తా

చింతాకులా..చీరా గట్టీ..పూచిందీ పూదోటా
కన్నే పువ్వూ..కన్నూ కొడితే..తుమ్మెదకూ దొంగాటా
దోబూచి నీ ఆటా..ఊహూ !

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్నీ నేనే..అహ నా మల్లి కోసం
ఏది ఏది చూడనీవే దాన్ని..
కళ్ళు ముయ్యి చూపుతానూ అన్నీ..
ఏది ఏది చూడనీవే దాన్ని..
కళ్ళు ముయ్యి చూపుతానూ అన్నీ..
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్నీ నేనే..
అహ నా మల్లి కోసం

పొద్దు ఉంది ముద్దులివ్వనా..ఇచ్చాక ముద్దులన్ని మూట గట్టనా
మూటలన్ని విప్పి చూడనా..చూసాక నూటొకటి లెక్కజెప్పనా
నోటికీ నూరైతేనే..కోటికీ కొరతేనా
కోటికీ కోటైతేనే..కోరికలు కొసరేనా

నోరున్నదీ..మాటున్నదీ..అడిగేస్తే ఏం తప్పు
రాతిరయ్యిందీ..రాజుకుందీ..చిటపటగా చిరునిప్పు
అరె పోవే పిల్లా అంతా దూకు..
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్నీ నేనే..అహ నా మావ కోసం
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్నీ నేనే..అహ నా మావ కోసం

ఏది ఏది చూడనీవే దాన్ని..
కళ్ళు ముయ్యి చూపుతానూ అన్నీ..
ఏది ఏది చూడనీవే దాన్ని..
కళ్ళు ముయ్యి చూపుతానూ అన్నీ..
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్నీ నేనే..అహ నా మల్లి కోసం




మూగైన హృదయమా పాట సాహిత్యం

 
చిత్రం: ఆత్మ బంధువు (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

మూగైన హృదయమా నీ గోడు తెలుపుమా
ఓదార్చి తల్లివలే లాలించే
ఎడదను ఇమ్మనీ అడుగుమా
మూగైన హృదయమా నీ గోడు తెలుపుమా

కాచావు భారము అయినావు మౌనము
రాకాసి మేఘము మూసేస్తే చీకటులు ముంచేస్తే
అణగడు సూర్యుడు ఆరడు
మనసన్నది మాసిపోనిది
సొత్తు ఉన్నది సుఖమే లేనిది

ఈ వేదనా ఎన్నినాళ్లదీ 
ఓదార్చినా ఒడ్డు లేనిది

నా పాటకే గొంతు పలికింది లేదు
నా కళ్లకీనాడు కన్నీళ్లు రావు

తడిలేని నేలైనావు 
తొలకరులు కురిసే తీరు
ఎవ్వరూ అన్నది... 
నిన్నెరిగిన మనిషి అన్నది

మూగైన హృదయమా నీ గోడు తెలుపుమా
ఓదార్చి తల్లివలే లాలించే
ఎడదను ఇమ్మనీ అడుగుమా

మనసేడ్చినా పెదవి నవ్వెను
పైపైది ఈ పగటి వేషము
నీ గుండెలో కోవెలున్నది
ఏ దేవతో వేచియున్నది
ఇన్నాళ్లు మూసిన ఈ పాడు గుడిని
ఏ దేవతిక వచ్చి తెరిచేదనీ
ఈ కోకిలుంటే చాలు జరిగేను ఏదైనాను
ఎవ్వరీ కోయిల... చిగురాశల చిట్టి కోయిల

అరె నీవా కోయిల ఏ కొమ్మ కోయిల
విన్నానే కనులెదుట కన్నానే
పొంగులై హృదయము పొర లెనే
నేనే ఆ కోయిల ఉన్నా నీ లోపల
విన్నాను కనులెదుట కన్నాను
మారునా... నీ వెత తీరునా 



నీదాన్నీ ఉన్నాననీ పాట సాహిత్యం

 
చిత్రం: ఆత్మ బంధువు (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.జానకి 

నీదాన్నీ ఉన్నాననీ నా తోడై నువ్వున్నావనీ
గుండెలోనా ఉన్నా ఊసు..



నేరేడు తోటంతా పాట సాహిత్యం

 
చిత్రం: ఆత్మ బంధువు (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

పల్లవి:
నేరేడు తోటంతా ఆ... నేడే పండింది నేడే పండింది
నోరే ఊరిందమ్మా ఆ... నన్నిపుడే రమ్మందమ్మా
నీలాల కళ్లదాన నా జోడి పిల్లదాన ..నేరేడు తోటంతా ఆ..

చరణం: 1
నేడే పండింది నేడే పండింది..
రుచినే సూడాలంటే... ఇది పొద్దు కాదంది ఇది ఈ పొద్దు కాదంది
అరె ఎలమావి కొమ్మల్లో...ఎదురొచ్చి నాతోటి ఎవరన్న పాడేది
పంట భలే పండిందనీ...పాట ఏదో పాడానే ..పాట ఏదో పాడానే

పాట సద్దు విన్నావటే ..పాట సద్దూ విన్నావటే
పాటసద్దూ విన్నావటే..
పాట సద్దు విన్నానయ్యా..నీ పాట సద్దు విన్నానయ్యా
కూ అంటే కో అన్నాను.. కోకిలమ్మనయ్యాను .. కోకిలమ్మనయ్యాను

ఏ... ఇననట్టే ఊరించకే నా సత్తా చూస్తావులే నీ ఆట నే కట్టిస్తాను
పంతానికి వచ్చావంటే ..ఓడిస్తాను పందెమెంతా ఓ..డిస్తాను పందెమెంతా
వయసున్న వాణ్ణే నేను .. నువ్వే ఓడిపోతావు
అహ నువ్వే ఓడి... అహ నువ్వే ఓడి...




ఏ గువ్వా... ముద్దు గువ్వా...పాట సాహిత్యం

 
చిత్రం: ఆత్మ బంధువు (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

పల్లవి:
ఏ గువ్వా... ముద్దు గువ్వా...
ఏ గువ్వా... చిట్టిగువ్వా...
ఓ జోడు ఉంటే దాన్ని తోడితెచ్చి
మా పంచలోకి వచ్చి గూడుకట్టు
పోట్లాట ఇల్లు కట్టు బంగారు గూడు
ఇప్పుడిల్లాలు లేదు వచ్చి నాతోటి పాడు ..

చరణం: 1
ఏ గువ్వా... చిట్టిగువ్వా...
ఏ గువ్వా... అయ్య అన్నదాంట్లో ఎంతో అర్థముంది
కాని కొంపలోనే కొంత గోడు ఉంది
పెళ్ళాన్నై వచ్చి నా గూడు చూసి
అద్దివ్వమంటే... అహ్హహ్హా ఏం చేయనయ్యా

ఏ గువ్వా... చిట్టిగువ్వా...
ఏ ఎవరే... అది ఎవరే...

Palli Balakrishna




చిత్రం: మేఘసందేశం (1982)
సంగీతం: రమేష్ నాయుడు
నటీనటులు: నాగేశ్వరరావు, జయప్రద, జయసుధ
దర్శకత్వం & నిర్మాత: దాసరి నారాయణరావు
విడుదల తేది: 24.09.1982



Songs List:



ఆకాశ దేశాన ఆషాఢ మాసాన పాట సాహిత్యం

 
చిత్రం: మేఘసందేశం (1982)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి
గానం: కె.జేసుదాసు

ఆకాశ దేశాన ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి  మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి మేఘసందేశం  మేఘసందేశం 

వానకారు కోయిలపై తెల్లవారి వెన్నెలనై
వానకారు కోయిలపై తెల్లవారి వెన్నెలనై
ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని
కడిమివోలే నిలిచానని
ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో
విన్నవించు నా చెలికి విన్న వేదన నా విరహ వేదన

ఆకాశ దేశాన ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి  మేఘమా

రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని
శిథిల జీవినైనానని
తొలకరి మెరుపుల లేఖలతో





ఆకులో ఆకునై పాట సాహిత్యం

 
చిత్రం: మేఘసందేశం (1982)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి
గానం: పి.సుశీల

ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

గలగలని వీచు చిరుగాలిలో కెరటమై
గలగలని వీచు చిరుగాలిలో కెరటమై
జలజలని పారు సెల పాటలో తేటనై
పగడాల చిగురాకు తెరచాటు చేటినై
పరువంపు విడిచేడే చిన్నారి సిగ్గునై
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
చగలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఆకలా దాహమా చింతలా వంతలా
ఈ తరలీవెర్రినై ఏకతమా తిరుగాడ
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా




ముందు తెలిసెనా ప్రభూ పాట సాహిత్యం

 
చిత్రం: మేఘసందేశం (1982)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి
గానం: పి. సుశీల

మందమతిని నీవు వచ్చుమధుర క్షణమేదో..కాస్త
ముందు తెలిసెనా ప్రభూ

అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
సుందర మందార కుంద సుమదళములు పరువనా
సుందర మందార కుంద సుమదళములు పరువనా
దారి పొడుగునా తడిచిన పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచినా చాలును

ముందు తెలిసెనా ప్రభూ
ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చుమధుర క్షణమేదో..కాస్త
ముందు తెలిసెనా ప్రభూ

బ్రతుకంతా ఎదురుచూతు పట్టున రానే రావు
బ్రతుకంతా ఎదురుచూతు పట్టున రానే రావు
ఎదుర రయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు
ఎదుర రయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు
కదలనీక నిముషము నను వదలిపోక నిలుపగ
నీ పదముల బందింపలేను హృదయము సంకెల చేసి

ముందు తెలిసెనా ప్రభూ
ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చుమధుర క్షణమేదో..కాస్త
ముందు తెలిసెనా ప్రభూ




నవరస సుమ మాలికా పాట సాహిత్యం

 
చిత్రం: మేఘసందేశం (1982)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి
గానం: కె.జె. యేసుదాసు

నవరస సుమ మాలికా
నా జీవనాధార నవరాగ మాలికా
నవరస సుమ మాలికా
సని సరి గరి సరి మపని పనిస గరి
గరి సనిద దని తపమ గరి నిసగ
నవరస  సుమ మాలికా
సగమ గమప గమ గప మగసగ సని
పనిసగ సగమ గమప నిని పమప
త్యాగయ్య క్షేత్రయ్య అన్నమయ్య
తెలుగింటిలోన వెలిగించిన..
తెలుగింటిలోన వెలిగించినా నాద సుధామయ రసదీపిక
నవరస సుమ మలికా

అందాలు అలలైన మందాకిని
మందార మకరంద రసవాహిని
ఆమె చరణాలు అరుణ కిరణాలు
ఆమె నయనాలు నీల గగనాలు
ఆ జవ్వనాలు నా జన్మకు దొరికిన నైరుతి ఋతుపవనాలు
ఆ చిరునవ్వు లేత నెలవంక
ఆ చిరునవ్వు లేత నెలవంక దిగివచ్చెనేమో ఇలవంక

నవరస సుమా మాలికా
నవరస సుమా మాలికా
నా జీవనాధార నవరాగ మాలికా
నవరస సుమా మాలికా
నవరస సుమా మాలికా

శృంగార రసరాజ కల్లోలిని
కార్తీక పూర్ణేందు కలహారిని
ఆమె అధరాలు ప్రణయ మధురాలు
ఆమె చలనాలు శిల్ప గమనాలు
ఆ దర్శనాలు నా జన్మకు మిగిలిన సుందర సుఖ తరుణాలు
ఆ కనుచూపు నాకు కడదాక
ఆ కనుచూపు నాకు కడదాక పిలుపైనా లేని ప్రియలేఖ

నవరస సుమా మాలికా
నవరస సుమా మాలికా
నా జీవనాధార నవరాగ మాలికా
నవరస సుమా మాలికా
నవరస సుమా మాలికా




నిన్నటిదాకా శిలనైనా పాట సాహిత్యం

 
చిత్రం: మేఘసందేశం (1982)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల

నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో
గోదారి గంగనై పొంగుతు ఉన్నా
నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా

సరస సరాగాల సుమ రాణిని
స్వరస సంగీతాల సారంగిని
సరస సరాగాల సుమ రాణిని
స్వరస సంగీతాల సారంగిని

మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుక
మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుక
మవ్వంపు నటనాల మాతంగిని
కైలాస శిఖరాగ్ర శైలూశిఖా నాట్య
ఢోలలూగేవేళ రావేల నన్నేల

నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో
గోదారి గంగనై పొంగుతు ఉన్నా

నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా

నిన్నే ఆరాధించు నీ దాసిని
ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని
నిన్నే ఆరాధించు నీ దాసిని
ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని

పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే
పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే
చిరునవ్వులో నేను సిరి మల్లిని
స్వప్న ప్రపంచాల సౌందర్య దీపాలు 
చెంత వెలిగేవేళ ఈ చింత నీకేల

నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో
గోదారి గంగనై పొంగుతు ఉన్నా...

నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా




పాడనా వాణి కళ్యాణిగా పాట సాహిత్యం

 
చిత్రం: మేఘసందేశం (1982)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి
గానం: బాలమురళి కృష్ణ

ఆ... ఆ... ఆ... ఆ... ఆ
గమదని సని పమ నిరిగమ రిగ నిరిస
మమగ గదప దపమ గనిద నిదప మదని
సని గరి సనిద పసని దపమ
నిసని దపమ నిసని గమదని సని పర్మరిగ

పాడనా వాణి కళ్యాణిగా
పాడనా వాణి కళ్యాణిగా
స్వరరాణి పాదాల పారాణిగా
పాడనా వాణి కళ్యాణిగా
నా పూజకు శర్వాణిగా నా భాషకు గీర్వాణిగా
శరీర పంజర స్వర ప్రపంచగ మధురవాణి సుఖవాణిగా... ఆ... ఆ
పాడనా వాణి కళ్యాణిగా
పాడనా వాణి కళ్యాణిగా

తనువణువణువున్ను తంబుర నాదము నవనాడుల శృతి చేయగా...ఆ...ఆ
గరిస్స నిదని మద నిదా నిదపద గమ సని దపమ
ఎద మృదంగమై తాళ లయగతులు ఘమకములకు జతకూడగా
అక్షర దీపారాధనలో స్వర లక్షణ హారతులీయగా
అక్షర దీపారాధనలో స్వర లక్షణ హారతులీయగా
తరంతరము నిరంతరము గానాభిషేకమొనరించి తరించగా
పాడనా వాణి కళ్యాణిగా
పాడనా వాణి కళ్యాణిగా

స్వర ముఖరిత నిర్ఝరులు లహరులై దేవి పాదములు కడుగగా
లయ విచలిత గగనములు మేఘమై తానములే చేయించగా
సంగీతామృత సేవనలే నిజ సాహిత్యాభినివేశములై
సంగీతామృత సేవనలే నిజ సాహిత్యాభినివేశములై
తరంతరము నిరంతరము గీతాభిషేకమొనరించి తరించిగా

పాడనా వాణి కళ్యాణిగా
పాడనా వాణి కళ్యాణిగా
స్వరరాణి పాదాల పారాణిగా
పాడనా వాణి కళ్యాణిగా
నా పూజకు శర్వాణిగా నా భాషకు గీర్వాణిగా
శరీర పంజర స్వర ప్రపంచగ మధురవాణి సుఖవాణిగా...ఆ...ఆ





ప్రియే చారుశీలే పాట సాహిత్యం

 
చిత్రం: మేఘసందేశం (1982)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: జయదేవుడు
గానం: కె. జేసుదాసు, పి. సుశీల

ప్రియే చారుశీలే




రాధికా... కృష్ణా.. పాట సాహిత్యం

 
చిత్రం: మేఘసందేశం (1982)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: జయదేవుడు
గానం: కె. జేసుదాసు, పి. సుశీల

రాధికా... కృష్ణా..
తవ విరహే...కేశవా..
స్థన విని హితమపి హార ముదారం
స్థన విని హితమపి హార ముదారం
సా మనుతే కృశ తనురివ భారం
సరసమ సృనమపి మలయజ పంకం
సరసమ సృనమపి మలయజ పంకం
రాధికా కృష్ణా రధికా
తవ విరహే కేశవా
రాధికా కృష్ణా రధికా

శ్వసిత పవన మనుపమ పరిణాహం
శ్వసిత పవన మనుపమ పరిణాహం
మదన దహన మిప వహతి సదాహం
దిశి దిశి కిరతి సజల కణజాలం
దిశి దిశి కిరతి సజల కణజాలం
నయన నళిన మివ విగలిత నాళం
నయన నళిన మివ విగలిత నాళం
రాధికా కృష్ణా రధికా

తవ విరహే కేశవా కేశవా
రాధికా కృష్ణా రధికా
తవ విరహే కేశవా 
రాధికా కృష్ణా రధికా

నయన విశయ మపి కిసలయ తల్పం
నయన విశయ మపి కిసలయ తల్పం
కలయతి విహిత హుతాశన కల్పం
కలయతి విహిత హుతాశన కల్పం
త్యజతి న పాణితలేన కపోలం
త్యజతి న పాణితలేన కపోలం
బాల శశిన మిప సాయం అలోలం
బాల శశిన మిప సాయం అలోలం

రాధికా కృష్ణా రధికా
తవ విరహే కేశవా 
రాధికా కృష్ణా రధికా

హరిరితి హరిరితి జపతి సకామం
హరిరితి హరిరితి జపతి సకామం
విరహ విహిత మరణేన నికామం
హరీ.. హరీ.. హరీ..
హరిరితి హరిరితి జపతి సకామం
విరహ విహిత మరణేన నికామం
శ్రీ జయదేవ భణితమితి కీతం
శ్రీ జయదేవ భణితమితి కీతం
సుఖయతు కేశవా పదము పునీతం

రాధికా కృష్ణా రధికా
తవ విరహే కేశవా 
రాధికా కృష్ణా రధికా




శీత వేళ రానీయకు పాట సాహిత్యం

 
చిత్రం: మేఘసందేశం (1982)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి
గానం: కె. జేసుదాసు, పి. సుశీల

శీత వేళ రానీయకు రానీయకు
శిశిరానికి చోటియ్యకు చోటియ్యకు
శీత వేళ రానీయకు రానీయకు
శిశిరానికి చోటియ్యకు చోటియ్యకు
ఎదలోపల కూలతారు ఏనాటికి పోనీయకు
శీత వేళ రానీయకు రానీయకు
శిశిరానికి చోటియ్యకు చోటియ్యకు

ఉగ్రమైన వేసంగి వాక్కులు
ఆగ్రహించి పైబడినా అదరిపోవకు అదరిపోవకు
ఉగ్రమైన వేసంగి వాక్కులు
ఆగ్రహించి పైబడినా అదరిపోవకు అదరిపోవకు
ఉక్కుమ్మడిగా వర్ష మేఘం
వెక్కి వెక్కి రోధించినా లెక్కచేయకు లెక్కచేయకు

శీత వేళ రానీయకు రానీయకు
శిశిరానికి చోటియ్యకు చోటియ్యకు
శీత వేళ రానీయకు రానీయకు
శిశిరానికి చోటియ్యకు చోటియ్యకు

ఛైత్రంలో పొగరెక్కిన కొత్త కోర్కెలు
శరత్తులో కైపెక్కే తియ్యని కలలు
ఛైత్రంలో పొగరెక్కిన కొత్త కోర్కెలు
శరత్తులో కైపెక్కే తియ్యని కలలు
మనసారా తీర్చుకో మనుజడ పండించుకో
లోకానికి పొలిమేరలు నీ లోకం నిలుపుకో

శీత వేళ రానీయకు రానీయకు
శిశిరానికి చోటియ్యకు చోటియ్యకు
శీత వేళ రానీయకు రానీయకు
శిశిరానికి చోటియ్యకు చోటియ్యకు

ఉదయాన మగత నిదర చెదరిపోవు వేళ
మబ్బులలో ప్రతి తారక మాయమయ్యే వేళ
ముసలితనపు అడగుల సడి ముంగిట వినబడెనా
ముసలితనపు అడగుల సడి ముంగిట వినబడెనా
వీటలేడని చెప్పించు వీలుకాదని పంపించు
వీలుకాదని పంపించు

శీత వేళ రానీయకు రానీయకు
శిశిరానికి చోటియ్యకు చోటియ్యకు
ఎదలోపల కూలతారు ఏనాటికి పోనీయకు
శీత వేళ రానీయకు రానీయకు
శిశిరానికి చోటియ్యకు చోటియ్యకు




సిగలో అవి విరులో పాట సాహిత్యం

 
చిత్రం: మేఘసందేశం (1982)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి
గానం: కె. జేసుదాసు, పి. సుశీల

సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో
సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో
సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో

ఎదుట నా ఎదుట ఏవో సోయగాల మాలికలు
ఎదుట నా ఎదుట ఏవో సోయగాల మాలికలు
మదిలోన గదిలోన
మదిలోన గదిలోన మత్తిలిన కొత్త కోరికలు
నిలువనీవు నా తలపులు మరీ మరీ ప్రియా ప్రియా
నిలువనీవు నా తలపులు నీ కనుల ఆ పిలుపులు

సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో
సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో

జరిగి ఇటు ఒరిగి పరవశాన ఇటులే కరిగి
జరిగి ఇటు ఒరిగి పరవశాన ఇటులే కరిగి
చిరునవ్వుల అరవిడిన చిగురాకు పెదవుల మరిగి
చిరునవ్వుల అరవిడిన చిగురాకు పెదవుల మరిగి
మరలి రాలేవు నా చూపులు మరీ మరీ ప్రియా ప్రియా
మరలి రాలేవు నా చూపులు మధువుకై మొదలు తుమ్మెదలు

సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో
సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో

Palli Balakrishna



చిత్రం: వసంత కోకిల (1982)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్. పి.బాలు
నటీనటులు: కమల్ హాసన్, శ్రీదేవి, సిల్క్ స్మిత
దర్శకత్వం: బాలు మహేంద్ర
నిర్మాతలు: యస్. వెంకట సుబ్బారావు, కె.రామకోటయ్య
విడుదల తేది: 1982

కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా ఆమని విరిసే తోటగా
లాలి లాలో జోలాలిలో లాలి లాలో జోలాలిలో

మోసం తెలియని లోకం మనదీ
తీయగ సాగే రాగం మనదీ
ఎందుకు కలిపాడో బొమ్మలను నడిపే వాడెవడో
నీకూ నాకూ సరిజోడని కలలోనైనా విడరాదనీ

కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా ఆమని విరిసే తోటగా
లాలి లాలో జోలాలిలో  లాలి లాలో జోలాలిలో

కారడవులలో కనిపించావూ
నా మనసేమో కదిలించావూ
గుడిలో పూజారై నా హృదయం నీకై పరిచాను
ఈ అనుబంధం ఏ జన్మదీ ఉంటే చాలు నీ సన్నిధి

కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా ఆమని విరిసే తోటగా
లాలి లాలో జోలాలిలో  లాలి లాలో జోలాలిలో


(సినిమా చివరిలో వచ్చే మూడవ చరణం)

ఎవరికి ఎవరో ఎదురవుతారూ
మనసూ మనసూ ముడిపెడతారూ
ఎందుకు వస్తారో కాదనీ ఎందుకు పోతారో
బ్రతుకే రైలుగా సాగేనటా  నీతో నువ్వే మిగిలేవటా

కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా ఆమని విరిసే తోటగా
లాలిజో జోలాలిజో  లాలిజో జోలాలిజో

Palli Balakrishna





చిత్రం: మాయలోడు (1993)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
నటీనటులు: రాజేంద్రప్రసాద్, సౌందర్య
దర్శకత్వం: యస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాత: కె.అచ్చిరెడ్డి
విడుదల తేది: 19.07.1993



Songs List:



నీ మాయలోడు పాట సాహిత్యం

 
చిత్రం: మాయలోడు (1993)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: విశ్వనాథ శాస్త్రి 
గానం: యస్.పి.బాలు, చిత్ర

నీ మాయలోడు 




చలాకి చిలిపి పాట సాహిత్యం

 
చిత్రం: మాయలోడు (1993)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

చలాకి చిలిపి 



చూమంతర్ కాలి పాట సాహిత్యం

 
చిత్రం: మాయలోడు (1993)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

చూమంతర్ కాలి




చినుకు చినుకు అందెలతో పాట సాహిత్యం

 
చిత్రం: మాయలోడు (1993)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: యస్.పి.బాలు, చిత్ర

(సౌందర్య, బాబూమోహన్ పై ఈ పాట చిత్రీకరణ జరిగింది)

పల్లవి:
చినుకు చినుకు అందెలతో 
చిట పట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని 
జారవిడిచి వల్లు మరిచి 
వాన జాన ఆడింది వయ్యారంగా 
నీల్ల పూలు జల్లింది  సింగారంగా

చినుకు చినుకు అందెలతో 
చిట పట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని 
జారవిడిచి వల్లు మరిచి 
వాన జాన ఆడింది వయ్యారంగా 
నీల్ల పూలు జల్లింది  సింగారంగా

చరణం: 1
నింగి నేల ఈవేల చలికి వనికి పోతుంటే 
బిగికౌగిలి పొదరింటికి పద పద మంది 
ఈ కౌగిలింతలోన ఏలో గుండెల్లో ఎండకాసె ఏలో
అరెయ్ పైన మొబ్బు ఉరిమింది 
పడుచు జింక బెదిరింది 
వలవేయక సెలయేరై పెనవేసింది 
అరెయ్ చినుకమ్మ మెరుపమ్మ ఏలో
చిటుకేసే బుగ్గమీద ఏలో 
తలపు తొలివలపూ ఇక తకజమ్ తకజమ్
వయసూ తడి సొగసూ అరవిరిసే సమయమ్  
ఆహ - ఊహూ,  ఓహొ హొ హొ

చినుకు చినుకు అందెలతో 
చిట పట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని 
జారవిడిచి వల్లు మరిచి
వాన జాన ఆడింది వయ్యారంగా 
నీల్ల పూలు జల్లింది  సింగారంగా

చరణం: 2
మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది 
యదలోపల చలిగాలుల సుడిరేగింది 
వానొచ్చే వరదొచ్చే ఏలో వయసంటే తెలిసొచ్చే ఏలో
నేలచూపు పోయింది వాలుచూపుసై అంది 
చలికోరిక అల ఓకగ తల ఊపింది
అరెయ్ సరసాల సింధులోన ఏలో 
సరిగంగ తానాలు ఏలో 
ఒడిలో ఇక ఒకటై తక తకతై అంటే 
సరసానికి  దొరసానికి ముడిపెడుతుంటే 
ఆహా - ఊహూ
ఓహో హొ హో 

చినుకు చినుకు అందెలతో 
చిట పట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని 
జారవిడిచి వల్లు మరిచి 
వాన జాన ఆడింది వయ్యారంగా 
నీల్ల పూలు జల్లింది  సింగారంగా

చినుకు చినుకు అందెలతో 
చిట పట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని 
జారవిడిచి వల్లు మరిచి 
వాన జాన ఆడింది వయ్యారంగా 
నీల్ల పూలు జల్లింది  సింగారంగా



ఉడుతా ఉడుతా పాట సాహిత్యం

 
చిత్రం: మాయలోడు (1993)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

ఉడుతా ఉడుతా 

Palli Balakrishna

Most Recent

Default