Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Aada Nemali





పాట: ఆడ నెమలి
సంగీతం: ఎస్.కె.మదీన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: కనకవ్వ, మంగ్లీ
సేకరణ:కనకవ్వ

ఆడ నెమలి ( నర్సపేల్లే గండిలోన గంగధారి ) పాట సాహిత్యం

 
పాట: ఆడనెమలి
సంగీతం: ఎస్.కె.మదీన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: కనకవ్వ, మంగ్లీ
సేకరణ:కనకవ్వ 

నర్సపేల్లే  గండిలోన  గంగధారి
ఆడి  నెమలీ ఆటలకు గంగధారి  (2)
ఆడి  నెమలీ ఆటలకు గంగధారి
మొగ నెమలి మోస పాయే గంగధారి (2)
ఇద్దరాము గూడు దాము గంగధారి
ఒద్దిమాను కొరుగుదాము గంగధారి (2)

నిన్ను నన్ను చూసినంక 
మంది క౦ట్లే మంటలాయే 
ముద్ధు ముచ్చట ఓర్వలేక 
ముక్కు మూతి  తిప్పుడాయే 
పట్టుకోర నువ్వు పిట్టలోల ఎగిరి బుంగ చేయ్యి

నర్సపేల్లే.. ఏ.. నర్సపేల్లే..

నర్సపేల్లే  గండిలోన గంగధారి
ఆడి  నెమలీ ఆటలకు గంగధారి  (2)
ఆడి  నెమలీ ఆటలకు గంగధారి
మొగ నెమలి మోస పాయే గంగధారి (2)

ఇద్దరిది కంటి  నీరు గంగధారి
ఒద్దిమాను కుంటే నిండే గంగధారి (2)
ఒద్దిమాను కుంట ఏనుక గంగధారి
ఇద్ధుమిరుస  సన్న వడ్లు గంగధారి (2)
ఇద్ధుమిరుస  సన్న వడ్లు గంగధారి
ఇద్దరికీ తలంబ్రాలు గంగధారి  (2)

కస్సు బుస్సు మనకు రయ్య 
పాల పొంగు లెక్క నువ్వు
నీళ్ళు సళ్లీ నట్టు జల్లి 
సల్లబడినవంటే సాలు 
ఏలు పట్టుకోని తిరుగు 
ఎంటి లెక్క చూసుకుంటా 

నర్సపేల్లే.. ఏ.. నర్సపేల్లే..

నర్సపేల్లే  గండిలోన గంగధారి
ఆడి  నెమలీ ఆటలకు గంగధారి  (2)
ఆడి  నెమలీ ఆటలకు గంగధారి
మొగ నెమలి మోస పాయే గంగధారి (2)

నువ్వు నేను కూడినప్పుడు గంగధారి 
కొత్త కుండల తేనె వోలె  గంగధారి  (2)
కొత్త కుండల తేనె వోలె  గంగధారి 
పాత కుండల పాశమోలే గంగధారి  (2)
పాత కుండల పాశమోలే గంగధారి 
పాలనేతుల బాసలాయే గంగధారి  (2)
పాలనేతుల బాసలాయే గంగధారి 
పాసిపోయే దీనమచ్చే గంగధారి (2)

 పాసిపోతే పాయే ఆశ సావకున్నదాయే 
గోస లాన్ని తీరిపోయే మాస మచ్చే చూడరయ్యో 
రాసముప్పడైనను తీగలెక్క అల్లుకుంట 

నర్సపేల్లే.. నర్స .. నర్సపేల్లే..

నర్సపేల్లే  గండిలోన గంగధారి
ఆడి  నెమలీ ఆటలకు గంగధారి  (2)

ఆడి  నెమలీ ఆటలకు గంగధారి
మొగ నెమలి మోస పాయే గంగధారి

Most Recent

Default

No comments