Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Neetu Chandra"
Vishnu (2003)


చిత్రం: విష్ణు (2003)
సంగీతం: ఇస్మాయిల్ దర్బార్
నటీనటులు: మంచు విష్ణు, శిల్పా ఆనంద్
దర్శకత్వం: షాజీ కైలాస్
నిర్మాత: మోహన్ బాబు
విడుదల తేది: 03.10.2003

Palli Balakrishna Tuesday, February 19, 2019
Godavari (2006)


చిత్రం: గోదావరి (2006)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: వేటూరి
గానం: ఉన్నికృష్ణన్, చిత్ర
నటీనటులు: సుమంత్ , కమిలినీ ముఖర్జీ , నీతూ చంద్ర
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
నిర్మాత: జి. వి.జి. రాజు
విడుదల తేది: 19.05.2006

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
ఆ... ఆ మాట దాచా కాలాలు వేచా
నడిచా నేనే నీడలా...

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా

అ...చిన్న తప్పు అని చిత్తగించమని అన్నా వినదు
అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసు
కన్నీరైనా గౌతమి కన్నా
తెల్లారైనా పున్నమి కన్నా
మూగైపోయా నేనిలా...

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా

నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్నా
కన్ను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్నా
గతమేదైనా స్వాగతమననా
నీ జతలోనే బ్రతుకనుకోనా
రాముని కోసం సీతలా

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
ఆ... ఆ మాట దాచా కాలాలు వేచా
నడిచా నేనే నీడలా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా


********   *********   ********


చిత్రం: గోదావరి (2006)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

షడ్జమాం భవతి వేదం
పంచమాం భవతి నాదం
శృతి శిఖరే నిగమ ఝరే స్వరలహరే

సా స పా ప ప ప ప మ రి స స ని స
సా స పా ప ప ప ప మ ద ప ప
సా స పా ప ప ప ప మ రి స స ని స
సా స పా ప ప ప ప మ ని ద ప

ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి
ఏసెయ్ చాప జోర్సేయ్ నావ వార్సేయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా

ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వేయ్యంగానె లాభసాటి బేరం
ఇళ్ళే వోడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్ని అడిగే నీటి అద్దం
ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ?
నది ఊరేగింపులో పడవ మీద రాగా
ప్రభువు తాను కాదా

ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

గోదారమ్మ కుంకంబొట్టు దిద్దె మిరప ఎరుపు
లంకానాధుడింకా ఆగనంటు పండు కొరుకు
చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి
సందేహాల మబ్బే పట్టె చూసే కంటికి
లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు
అల పాపి కొండలా నలుపు కడగలేక
నవ్వు తనకు రాగా

ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి
ఏసెయ్ చాప జోర్సేయ్ నావ వార్సేయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా

ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరీ


********   *********   ********


చిత్రం: గోదావరి (2006)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: వేటూరి
గానం: సునీత

అందంగాలేనా అసలేం బాలేనా
అంత లెవలెందుకోయ్ నీకు ఉఁ

అందంగాలేనా అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా
అందంగాలేనా అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా
అలుసైపోయానా అసలేమి కానా
వేషాలు చాల్లే పొమ్మనా
అందంగాలేనా అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా

కనులు కలపవాయే మనసు తెలుపవాయే
పెదవి కదపవాయే  మాటవరసకి
కలికి చిలకనాయే కలత నిదురలాయే
మరువలేక నిన్నే మదనపడితినే
ఉత్తుత్తిగా చూసి ఉడికించవేలా
నువ్వోచ్చి అడగాలి అన్నట్టు
నే బెట్టు చేసాను ఇన్నాళ్ళుగా

అందంగాలేనా అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా

నీకు మనసు ఇచ్చా ఇచ్చి నపుడే నచ్చా
కనుల కబురు తెచ్చా తెలుసు నీకదీ
తెలుగు ఆడపడచు తెలుపలేదు మనసు
మహాతెలియనట్టు నటనలే అది
ఎన్నెల్లో గోదారి తిన్నెల్లో నన్ను
తరగల్లే నురగల్లే ఏనాడు
తాకేసి తడిపేసిపోలేదుగా

అందంగాలేనా అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా
అందంగాలేనా అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా
అలుసైపోయానా అసలేమి కానా
వేషాలు చాల్లే పొమ్మనా
అందంగాలేనా అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా


********   *********   ********


చిత్రం: గోదావరి (2006)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: వేటూరి
గానం: శ్రేయ గోషల్

టప్పులు  టిప్పులు దుప్పటి చిల్లులు
గాలి వాన హోరు జల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపలు
చెంగుమన్న నీటి జింకలు
జిల్లు జిల్లున జల్లు ముద్దులు
చేసిపోయే ముద్ద ముద్దగా
మబ్బు మబ్బున మెరుపు తీగ పొద్దులు
కళ్ళలోన కన్ను గీటగా
గాలుల మేడల చినుకుమన్న జాడలా

టప్పులు  టిప్పులు దుప్పటి చిల్లులు
గాలి వాన హోరు జల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపలు
చెంగుమన్న నీటి జింకలు

గాలి వాన తోడై వచ్చీ ఊయ్యాలూపగా
వాన రేవు పిల్ల పెద్ద సయ్యాటాడగా
గూటి పడవలో కోటి జంటలు
కూత పెట్టు లేత వలపులు
లంగరేసినా అంది చావని
రంగసాని చాటు పిలుపులు
రాకడో పోకడో రాములోరికెరుకలే

టప్పులు  టిప్పులు దుప్పటి చిల్లులు
గాలి వాన హోరు జల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపలు
చెంగుమన్న నీటి జింకలు

ఏరు నీరు ఓ దారైతే ఎదురీదాలిలే
ఎండా వాన కొండా కోనా నీళ్ళాడాలిలే
ఘల్లు ఘల్లున సాని కిన్నెర
ఓటమింక గజ్జె కట్టెలే
నింగి నంటని  గంగ వంటిది
పండు ముసలి శబరి పళ్ళివే
వాన రా ఓ నరా తోకలేని వానరా

టప్పులు  టిప్పులు దుప్పటి చిల్లులు
గాలి వాన హోరు జల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపలు
చెంగుమన్న నీటి జింకలు
జిల్లు జిల్లున జల్లు ముద్దులు
చేసిపోయే ముద్ద ముద్దగా
మబ్బు మబ్బున మెరుపు తీగ పొద్దులు
కళ్ళలోన కన్ను గీటగా
గాలుల మేడల చినుకుమన్న జాడలా

టప్పులు  టిప్పులు దుప్పటి చిల్లులు
గాలి వాన హోరు జల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపలు
చెంగుమన్న నీటి జింకలు


********   *********   ********


చిత్రం: గోదావరి (2006)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: వేటూరి
గానం: గాయత్రి

నీలగగన ఘనవిచలన ధరణిజ శ్రీరమణ...
మధురవదన నళిననయన మనవి వినరా రామా
రామ చక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరో మొగుడంట
రామ చక్కని సీతకి...

చరణం: 1
ఉడుత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుడి విల్లును ఎత్తిన ఆ రాముడే
ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో
రామ చక్కని సీతకి...

చరణం: 2
ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే
చూడలేదని పెదవి చెప్పి చెప్పలేమని కనులు చెప్పి
నల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు
రామ చక్కని సీతకి...

చరణం: 3
చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డు నిలిచే
చూసుకోమని మనసు తెల్పి మనసు మాటలు కాదుగా
రామ చక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకా ఎవరో మొగుడంట
ఇందువదన కుందరదన మందగమన భామా
ఎందువలన ఇందువదన ఇంతమధన... ప్రేమా...


********   *********   ********


చిత్రం: గోదావరి (2006)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: వేటూరి
గానం: శంకర్ మహదేవన్, చిత్ర, కె.యమ్. రాధాకృష్ణన్

విధి లేదు ఇది లేదు ప్రతి రోజు నీదేలేరా
పడిలేచే కెరటాల సరిజోడి నీవేలేరా
ఈ దేశం అందించే ఆదేశం నీకేరా
ఈ శంఖం పూరించే ఆవేశం రానిరా
రేపు మాపు నీవేరా

మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవెరా
తలకుల తారల్లో వెలుగుల ధారల్లో
తలకుల తారల్లో వెలుగుల ధారల్లో
మనసా గెలుపు నీదేరా.... నీదేరా...

చరణం: 1
మనస్సులోనే మార్గముంది తెలుసుకోర ఇక
పూరి లేని దేని బాణమింక చేరుకోదు ఎలా
ప్రతి రోజు నీకొక పాఠమే
చదువుకుంటూ పద
ఇక నిన్ను నీవు మోసగిస్తూ మోసపోతే వృదా

చరణం: 2
ఆమనొస్తే కొమ్మల్లన్ని కోయిలమ్మలు కదా
ఆమె నీకై సాగి వస్తే ప్రేమ ఋతువే సదా
దేవుడైన రాముడైనది ప్రేమ కోసం కదా
ప్రతి జీవితం ఓ వెలుగు నీడల
బొమ్మలాటే కదా

Palli Balakrishna Wednesday, August 16, 2017
Manam (2014)


చిత్రం: మనం (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: మాస్టర్ భరత్ & కోరస్
నటీనటులు: నాగార్జున, శ్రేయ శరన్, నాగచైతన్య , సమంత
దర్శకత్వం: విక్రమ్ కుమార్
నిర్మాత: నాగార్జున
విడుదల తేది: 23.05.2014

నననాననా నననాననా నాన నాననా
నననాననా నననాననా నాన నాననా ఓ...

లలలల లలాల లలలల లలాల
లలలల లలాల లాలలా

కనిపెంచినా మా అమ్మకే అమ్మయ్యానుగా
నడిపించినా మా నాన్నకే నాన్నయ్యానుగా
ఒకరిది కన్ను ఒకరిది చూపూ ఇరువురి కలయిక కంటిచూపూ
ఒకరిది మాటా ఒకరిది భావం
ఇరువురి కధలిక కదిపిన కధ ఇది
ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తీయగా...
ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా
ఇది మనసును తడిమిన తడిపిన క్షణముకదా...

నాననా నననా నాన నాననా నానా నాన
నాననా నననా నాన నాననా నననా నాన

హా... అ ఆ ఇ ఈ నేర్పిన అమ్మకు గురువును అవుతున్నా
హా... అడుగులు నడకలు నేర్పిన నాన్నకు మార్గం అవుతున్నా
పిల్లలువీల్లే అవుతుండగా ఆ అల్లరి నేనే చూస్తుండగా
కన్నోలతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కధ ఇది ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తీయగా...
ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా
ఇది మనసును తడిమిన తడిపిన క్షణముకదా...

అ అ కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా
కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా
జోలలు నాకే పాడారుగా ఆ జాలిని మరచిపోలేనుగా
మీరూపినా ఆ ఊయల నా హృదయపు లయలళొ పదిలము కద ఇది ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తీయగా...
ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా
ఇది మనసును తడిమిన తడిపిన క్షణముకదా... అ... అ... అ

నననన ననాన నననన ననాన
నననన ననాన నానా నానా
నననన ననాన నననన ననాన
నననన ననాన నానా నానా




******   *******   ********




చిత్రం: మనం (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిచరన్

నననాననా నననాననా నాన నాననా
నననాననా నననాననా నాన నాననా ఓ...

కనిపెంచినా మా అమ్మకే అమ్మయ్యానుగా
నడిపించినా మా నాన్నకే నాన్నయ్యానుగా
ఒకరిది కన్ను ఒకరిది చూపూ ఇరువురి కలయిక కంటిచూపూ
ఒకరిది మాటా ఒకరిది భావం ఇరువురి కధలిక కదిపిన కధ ఇది
ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తీయగా...
ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా
ఇది మనసును తడిమిన తడిపిన క్షణముకదా...

హా దీరనా దిరనా నాన దీరనా దీరనాన
దీరనా దిరనా నాన దీరనా దీరనాన

హా... అ ఆ ఇ ఈ నేర్పిన అమ్మకు గురువును అవుతున్నా
ఓ... అడుగులు నడకలు నేర్పిన నాన్నకు మార్గం అవుతున్నా
పిల్లలువీల్లే అవుతుండగా ఆ అల్లరి నేనే చూస్తుండగా
కన్నోలతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కధ ఇది
ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తీయగా...
ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా
ఇది మనసును తడిమిన తడిపిన క్షణముకదా...

అ అ కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా
ఓ కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా
జోలలు నాకే పాడారుగా ఆ జాలిని మరచిపోలేనుగా
మీరూపినా ఆ ఊయల నా హృదయపు లయలళొ పదిలము కద ఇది
ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తీయగా...
ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా
ఇది మనసును తడిమిన తడిపిన క్షణముకదా... అ... అ... అ...




***********   *********   **********




చిత్రం: మనం (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: వనమాలి
గానం: అర్జిత్ సింగ్

ఓ కనులను తాకే ఓకలా చూపే నిన్నిలా
నన్నే మార్చినా నువ్వైయేలా...
ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా
నీనవ్వులే నేడిలా ఓ ఆయి నీలో ఉన్నా
నీలోనే ఉన్నా నిప్రేమే నేకోరుతున్నా
నీలో ఉన్నా నీతోడై ఉన్నా నిన్నే నేప్రేమించినా
ఓ కనులను తాకే ఓకలా... ఓ...ఓ

హో ఇన్నాళ్లూ ఆనందం వెల్లువాయనె
ఏమైందో ఈనిమిషం దూరమాయనే
వెన్నెలింక చీకటయ్యేలా నవ్వులింక మాయమయ్యేలా
బాధలింక నీడలాగ నాతో సాగేనా
నాలో రేగింది  ఓ గాయమే దారే చూపేనా ఈకాలం...
నీవేనేలా నీమౌనంనేలా నీ ఊసే ఈగుండెలోనా నీతోలేనా అహా...
ఓ కనులను తాకే ఓకలా... ఓ...ఓ

చంద ఓ చందమామా రావా మావెంటే రావా
పైనే నువ్వుదాక్కున్నావా...
వానా ఓ వెన్నెల వానా రావా నువ్వైనా రావా మాతో నువ్వు చిందేస్తావా...
ఓ ఈదూరం ఎందాకా తీసుకెల్లునో ఈమౌనం ఏనాటికి
వీడిపోవునో బంధమింక ఆవిరయ్యేనా
పంతమింక ఊపిరయ్యేనా నీటిమీద రాతలాగ
ప్రేమే మారేనా ఇంకా ఈజీవితం ఎందుకో
కంట కన్నీరు నింపేందుకో... ఓ...ఓ
నీతో రానా నీ నీడైపోనా నీకోపం వెంటాడుతున్నా
నీలో లేనా అహా...




*******   ********   ********


చిత్రం: మనం (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శ్రేయాఘోషల్, అశ్విన్ శేఖర్, హరి, అనూప్ రూబెన్స్

యాయాయే యాయాయా
యాయాయా యాయా యాయా యా

హో చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే
చిరు చిరు చిరు చిరు చిరు చిందులు మనసే వేసెనే
చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి  ఊహలు ఎదలో ఊగెనే
ఏంచెయ్యనూ ఏంచెయ్యనూ ఏంచెయ్యనూ...
తొలిచూపు నీపైనే తొలిపలుకు నీతోనే
తొలి అడుగు నీకై సాగెనే హో హో హో
తొలిప్రేమ నువ్వేలే తుదివరకు నీతోనే
ఈ మాట నాలో దాగెనే హే హే
చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే
చిరు చిరు  ఊహలు ఎదలో ఊగెనే...

ఉఁ యాయాయే ఉఁ యాయాయా
యాయాయా యాయా యాయా యా

ఓ... ఐ లవ్ యూ...ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
అంటే... ఇలా ఇవ్వు, ఇలా ఇవ్వు
హో ప్రేమతో వచ్చానే స్నేహమే గెలిచానే
స్నేహమూ ప్రేమ రెండు నావే...
హో వెలుగుతో వచ్చానే నీడలా మారానే
వెలుగు నీడల్లో తోడు నీవే
గుండెలో నీవల్లే సవ్వడే పెరిగేనే గుండె తడి నువ్వయ్యావులే

చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే హు హూ
చిరు చిరు  ఊహలు ఎదలో ఊగెనే హు హూ

హో... నేస్తమై వచ్చావే పుస్తలై నిలిచావే
బహుమతిచ్చావే జీవితాన్నే...
హో... ఇద్దరే ఉన్నామే ఒక్కరై అదితామే ముగ్గురైపోయె ముద్దులోనే
ప్రేమనే పంచావే పాపలాచూసావే మన ప్రేమ  పాపైందిలే...
చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే
ఓహో చిరు చిరు  ఊహలు ఎదలో ఊగెనే...

హో చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే
చిరు చిరు చిరు చిరు చిరు చిందులు మనసే వేసెనే
ఓ... చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి  ఊహలు ఎదలో ఊగెనే
ఏంచెయ్యనూ...
తొలిప్రేమ నువ్వేలే తుదివరకు నీతోనే
ఈ మాట మాలో మోగెనే హే హే
చిన్ని చిన్ని ఆశలు మాలో రేగెనే  హొ హో
చిరు చిరు  ఊహలు ఎదలో ఊగెనే...




********    *******   *********




చిత్రం: మనం (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనూప్ రూబెన్స్
గానం: అనూప్ రూబెన్స్, జస్ప్రీత్ జస్జ్

టాటా టట్టట్టట్ట టట్టాట టట్టట్టా టాటా టట్టట్టట్ట ఎవ్రీబడీ...
టాటా టట్టట్టట్ట టట్టాట టట్టట్టా టాటా టట్టట్టట్ట...

బాటిల్ ఖోలో... ధీంతన ధీంతన
గ్లాసు తీసుకో... ధీంతన ధీంతన
ఫుల్లు నింపు... ధీంతన ధీంతన
కొట్టు డ్రింకు... ధీంతన ధీంతన

టాటా టట్టట్టట్ట టట్టాట టట్టట్టా

కిక్కు వస్తది... ధీంతన ధీంతన
మస్తి చేస్కో...ధీంతన ధీంతన
నైటు మొత్తం...ధీంతన ధీంతన
కింగు నువ్వే... ధీంతన ధీంతన

సుక్కేసి చూసెయ్ రో ఆ సుక్కల్ని తాకెయ్ రో
బాధల్ని దించెయ్ రో లైఫు ని నవ్వుల్తొ నింపెయ్ రో
ఆ డ్రింకు డ్రింకు హెయ్...
ఆ ఫుల్లుగ డ్రింకు హెయ్...
ఏ రోజైనా ఏ టైం అయినా ఇది తాగుట నువ్వే కింగే రో

పీయో పీయో రే అరె ఫుల్ టూ పీయో రే
అరె పీయో పీయో రే  అ ఫుల్ టూ

నేను పుట్టాను...

ఆ పీయో పీయో రే అరె ఫుల్ టూ పీయో రే
అరె పీయో పీయో రే అ ఫుల్ టూ

నేను పుట్టాను...

నేను పుట్టాను లోకం మెచ్చింది
నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
నాకింకా లోకం తో పని ఏముందీ
డోంట్ కేర్... కేర్ కేర్ కేర్ కేర్...

టాటా టట్టట్టట్ట టట్టాట టట్టట్టా  టాటా టట్టట్టట్ట

హేయ్ బాటిల్ ఖోలో... ధీంతన ధీంతన
గ్లాసు తీసుకో... ధీంతన ధీంతన
ఫుల్లు నింపు...ధీంతన ధీంతన
హే కొట్టు డ్రింకు... ధీంతన ధీంతన

పీయో పీయో రే అరె ఫుల్ టూ పీయో రే
అరె పీయో పీయో రే అ ఫుల్ టూ

నేను పుట్టాను...

ఆ పీయో పీయో రే అరె ఫుల్ టూ పీయో రే
అరె పీయో పీయో రే అ ఫుల్ టూ

నేను పుట్టాను లోకం మెచ్చింది
నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
నాకింకా లోకం తో పని ఏముందీ
డోంట్ కేర్... కేర్ కేర్ కేర్ కేర్...

టాటా టట్టట్టట్ట టట్టాట టట్టట్టా టాటా టట్టట్టట్ట
టాటా టట్టట్టట్ట








Palli Balakrishna Sunday, July 16, 2017

Most Recent

Default