చిత్రం: తోడికోడళ్ళు (1957)
సంగీతం: మాస్టర్ వేణు
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి
మాటలు: ఆచార్య ఆత్రేయ
అసిస్టెంట్ డైరెక్టర్: వి. మధుసూదనరావు
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
నిర్మాత: డి.మధుసూధనరావు
విడుదల తేది: 11.01.1957
Songs List:
కారులో షికారుకెళ్ళే పాట సాహిత్యం
చిత్రం: తోడికోడళ్ళు (1957)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల
పల్లవి:
కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిచాన
బుగ్గమీద గులాబిరంగు ఎలా వచ్చెనో చెప్పగలవా
కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిచాన
బుగ్గమీద గులాబిరంగు ఎలా వచ్చెనో చెప్పగలవా
నిన్నుమించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే
నిన్నుమించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే
వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చిచేరెను తెలుసుకో
చరణం: 1
చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదానా
చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదానా
మేడగట్టిన చలువరాయి ఎలా వచ్చెనో చెప్పగలవా
కడుపుకాలే కష్టజీవులు ఒడలు విరిచి గనులు తొలిచి
కడుపుకాలే కష్టజీవులు ఒడలు విరిచి గనులు తొలిచి
చమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారు తెలుసుకో
చరణం: 2
గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా
గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా
జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా
చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు
చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు
చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో
కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన
నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకో ఈ నిజానిజాలు
శ్రీరస్తు శుభమస్తు పాట సాహిత్యం
చిత్రం: తోడికోడళ్ళు (1957)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: సుశీల
శ్రీరస్తు శుభమస్తు
టౌన్ పక్కకెల్లోద్దురా పాట సాహిత్యం
చిత్రం: తోడికోడళ్ళు (1957)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల, జిక్కీ
టౌన్ పక్కకెల్లోద్దురా తింటానిక్కూడు చాలదే,
జాంగిరీ ఉంటానికిల్లు చాలదే
బస్తీకి పోదాం పైసా తెద్దామే రావేనా రంగసానీ!!
టౌను పక్కకెల్లొద్దురా డింగరీ! డాంబికాలు పోవొద్దురా
టౌను పక్కెళ్ళేవు డౌనైపోతావురా రబ్బీ బంగారు సామి!
రెక్కలన్నీ ఇరుసుకుంట రిక్షాలు లాక్కుంట
చిల్లరంత జేర్చుకుంట సినిమాలు చూసుకుంట
షికార్లు కొడదామే - పిల్లా జలసా చేద్దామే
కూలి దొరకదూ నాలిదొరకదూ
గొంతు తడుపుకొన నీరు దొరకదూ
రేయింబగలూ రిక్షా లాగిన
అద్దెకు పోనూ అణా మిగలదు
గడప గడపకు కడుపు బట్టుకుని ఆకలాకలని అంగలార్చితే
గేటు బిగించీ కొట్టొస్తారు!
కుక్కలనే ఉసి కొల్పిస్తారు
ఫ్యాక్టరీలలో పని సులువంట
గంటయిపోతే ఇంట్లో ఉంట
వారం వారం బట్వాడంట
ఒరే అరే అన వీల్లేదంట
కాఫీ తోటే గడపొచ్చంట కబుర్లు చెప్పుకు బ్రతకొచ్చంట
చూడ చిత్రమంట పిల్లా! చోద్యమౌతదంట
పిప్పయి పోయే పిచ్చి ఖర్చులు పోకిరి మూకల సావాసాలు
చీట్ల పేకలు సిగసిగ పట్లు తాగుడు వాగుడు తన్నులాటలు
ఇంటి చుట్టునా ఈగలు దోమలు
ఇరుకు సందులు మురుగు వాసనలు
అంటురోగములు తగిలి చచ్చినా
అవతల కీడ్చే దిక్కు ఉండదు
ఏలికేస్తేను కాలికేస్తావు ఎనక్కు రమ్మని గోల జేస్తావు
ఏ దారంటే గోదారంటవు ఇరుకున బెట్టి కొరుక్కుతింటవ్
దిక్కు దోచనీదే పిల్లా! తికమక జేసేవే
బస్తీకి నే బోను నీతో ఉంటానే! రాణీ నా రంగసానీ
గొడ్డూ గోదా మేపుకుందాం! కోళ్ళూ మేకలు పెంచుకుందాం
కూరానారా జరుపుకుందాం! పాలూ పెరుగు అమ్ముకుందాం
పిల్లా జెల్లను సూచుకుందాం! కలో గంజియో తాగి పడుందాం
టౌను పకక్కెళ్ళద్దండోయ్ బాబూ
డాంబికాలు పోవద్దండోయ్
టౌను పకకెళ్ళేరు డౌనైపోతారు!
తానే తందాన తాన తందాన! తందాన తాన
ఆడుతు పాడుతు పనిచేస్తుంటే పాట సాహిత్యం
చిత్రం: తోడికోడళ్ళు (1957)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
ఆడుతు పాడుతు పనిచేస్తుంటే
అలుపు సొలుపేమున్నది
ఇద్దరమొకటై చేయి కలిపితే
ఎదురేమున్నది మనకు కొదవేమున్నది
ఆడుతు పాడుతు పనిచేస్తుంటే
అలుపు సొలుపేమున్నది
ఇద్దరమొకటై చేయి కలిపితే
ఎదురేమున్నది మనకు కొదవేమున్నది
చరణం: 1
ఒంపులు తిరిగి వయ్యారంగా
ఊపుతు విసరుతు తోడేస్తుంటే
ఒంపులు తిరిగి వయ్యారంగా
ఊపుతు విసరుతు తోడేస్తుంటే
నీ గాజులు ఘల్లని మోగుతుంటే
నా మనసు ఝల్లుమంటున్నదీ
నా మనసు ఝల్లుమంటున్నదీ
ఆడు పాడుతు పని చేస్తుంటే
అలుపు సొలుపేమున్నది
ఇద్దరమొకటై చేయి కలిపితే
ఎదురేమున్నది మనకు కొదవేమున్నది
చరణం: 2
తీరని కోరికలూరింపంగా
ఓరకంట నను చూస్తూ ఉంటే
తీరని కోరికలూరింపంగా
ఓరకంట నను చూస్తూ ఉంటే
చిలిపి నవ్వులు చిందులు తొక్కి
సిగ్గు ముంచుకొస్తున్నదీ
నును సిగ్గు ముంచుకొస్తున్నదీ
ఆడతు పాడుతు పని చేస్తుంటే
అలుపు సొలుపేమున్నది
ఇద్దరమొకటై చేయి కలిపితే
ఎదురేమున్నది మనకు కొదవేమున్నది
చరణం: 3
చెదరి జారిన కుంకుమ రేఖలు
పెదవులపైన మెరుస్తు ఉంటే
చెదరి జారిన కుంకుమ రేఖలు
పెదవులపైన మెరుస్తు ఉంటే
తియ్యని తలపులు నాలో ఏమో
తియ్యని తలపులు నాలో ఏమో
తికమక చేస్తూ ఉన్నవి
అహ తిక మక చేస్తూ ఉన్నవి
ఆడుపాడుతు పని చేస్తుంటే
అలుపుసొలుపేమున్నది
ఇద్దరమొకటై చేయి కలిపితే
ఎదురేమున్నది మనకు కొదవేమున్నది
మాటల్లో మోమాటం నిలిపి
రాగంలో అనురాగం కలిపి
మాటల్లో మోమాటం నిలిపి
రాగంలో అనురాగం కలిపి
పాట పాడుతుంటే నామది పరవశమైపోతున్నదీ
పరవశమైపోతున్నదీ
ఆ....
ఆడతు పాడుతు పని చేస్తుంటే
అలుపు సొలుపేమున్నది
ఇద్దరమొకటై చేయి కలిపితే
ఎదురేమున్నది మనకు కొదవేమున్నది
నలుగురు కలిసీ పాట సాహిత్యం
చిత్రం: తోడికోడళ్ళు (1957)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల
నలుగురు కలిసీ పొరుపులు మరిచీ
చెయ్యాలి ఉమ్మడి వ్యవసాయం మన కిస్తుందెక్కువ ఫలసాయం
ఇది రైతులకెంతో సదుపాయం
ఒక సంసారం వందెకరాలను పండించటమే అరుదుకదా
అది భరించలేని బరువు కదా
పది కుటుంబములు వెయ్యెకరాలను
సాగు చెయ్యడం సులువు కదా
మహారాజులూ జమిందారులూ మచ్చుకు దొరకని కాలంలో
ఈ ప్రజలేఏ ఏలే రాజ్యంలో ఇతరుల కష్టం దోచుకు తినడం
ఇదియే సూత్రం ఒక్కడూ మాత్రం భూమిని గుత్తకు కొనరాదు
కడు సోమరిపోతై మనరాదు
నేలా నీరూ గాలీ వెలుగూ కొందరి సొత్తని అనరాదు
అవి అందరి హక్కై అలరారు
ఒకొక్క వ్యక్తీ, సమస్త శక్తీ ధారపోసి పనిచెయ్యాలి
ధన ధాన్యరాశులే పెంచాలి
కూటికి గుడ్డకు లోటులేక తనకవసరమైనవి పొందాలి
కలకాలం ఈ కలత పాట సాహిత్యం
చిత్రం: తోడికోడళ్ళు (1957)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: తాపీ ధర్మారావు
గానం: సుశీల
కలకాలం ఈ కలత
జోజో ..... జోజో .....
జోజో .....జోజో .....
కలకాలమీ కలత నిలిచేది కాదు
కనుమూసి కాసేపు నిదిరించు బాబు
నిదిరించు బాబూ "కలకాలమీ"
పెంచింది పెద్దమ్మ ముద్దార నిన్ను
మమకారమొకసారి మరచునా తాను
త్వరలోనే మనమంతా కలిసేము బాబు "త్వరలో"
మదిలోన ఆ చింత మానరా నా తండ్రి
కనుమూసి కాసేపు నిదురించు బాబు
జోజో .....జోజో .....జోజో .....జోజో .....
చలచల్లగా సాగు సంసారమందు
చెలరేగె మా పోరు నలిగావు నీవు
మా నేరముల నెల్ల మన్నించు బాబు "మా నేరము"
మదిలోన ఆ చింత మానరా నా తండ్రి "కలకాలమీ"
ఎంతెంత దూరం పాట సాహిత్యం
చిత్రం: తోడికోడళ్ళు (1957)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: సుశీల , కె.రాణి
ఎంతెంత దూరం
నీ సోకు చూడకుండ పాట సాహిత్యం
చిత్రం: తోడికోడళ్ళు (1957)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: కొసరాజు
గానం: మాధవపెద్ది సత్యం, జిక్కీ
నీ సోకు చూడకుండ నవనీతమ్మ
నే నిముసమైన బతకలేనె ముద్దుల గుమ్మ
నీ నీడ వదిలి ఉండలేనే ముద్దుల గుమ్మ
ఎంత మాయగాడవురా రమణయ్ మావ
నిన్నే తల్లి కన్నదిరా వయ్యారి మావ
నీ కెన్ని విద్యలున్నయ్ రా వయ్యారి మావ
నీవు చూసే చూపులకు వన్నెలాడీ
నీరుగారి పోతానె చిన్నెలాడి
మనసు దాచుకోలేను నవనీతమ్మ
పది మాటలైన చెప్పలేను ముద్దులగుమ్మా
ముచ్చట్లు చెబుతావు వన్నెకాడ
మోసపుచ్చి పోతావు చిన్నవాడ
మాటవరసకైన నువ్వు రమణయ్ మావా
నీ తోటి సరసమాడి పడుచు పిల్లా
నెల్లూరు వెళతానే గడుసు పిల్లా
మళ్ళి తిరిగి వస్తానే నవనీతమ్మా
నిను మరచిపోయి ఉండలేనె ముద్దులగుమ్మా
నెల్లూరు పోతేను నీటుగాడా
తెల్ల బియ్యం తెస్తావా నీటు గాడా
పక్క ఊళ్ళో నువ్వుంటె రమణయ్ మావ
నే ప్రాణాలు నిల్పలేను రమణయ్ మావ
గాలిపటం గాలిపటం పాట సాహిత్యం
చిత్రం: తోడికోడళ్ళు (1957)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల, సుశీల , కె.రాణి
గాలిపటం గాలిపటం
పొద్దైన తిరగక ముందే పాట సాహిత్యం
చిత్రం: తోడికోడళ్ళు (1957)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం:
గానం: జిక్కీ
పొద్దైన తిరగక ముందే
భలే మావయ్య పాట సాహిత్యం
చిత్రం: తోడికోడళ్ళు (1957)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: జిక్కీ
భలే మావయ్య