Search Box

MUSICAL HUNGAMA





Hushaaru (2018)



చిత్రం: హుషారు (2018)
సంగీతం: రధన్
సాహిత్యం: కిట్టు విశ్వప్రాగడ
గానం: సిద్ శ్రీరామ్
నటినటులు: తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ చందు, దినేష్ తేజ్,  దక్ష నగర్కార్, ప్రియ వడ్లమని, హేమల్ ఇంగిలే
దర్శకత్వం: శ్రీహర్ష కొనుగంటి
నిర్మాత: రియాజ్, బెక్కం వేణుగోపాల్
విడుదల తేది: 07.12.2018

ఉండిపోరాడే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే

అయ్యో అయ్యో పాదం
నేలపై ఆగనన్నది
మళ్ళీ మళ్ళీ గాల్లో
మేఘమై తేలుతున్నది

అందం అమ్మాయైతే
నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే
అడగాలంటే కౌగిలే

ఉండిపోరాడే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే

నిశిలో శశిలా నిన్నే చూసాక
మనసే మురిసే ఎగసే అలలాగ
ఏదో మైకంలో నేనే ఉన్నాలే
నాలో నేనంటు లేనులే

మండే ఎండల్లో వెండి వెన్నెలనే
ముందే నేనెప్పుడూ చూడలే
చీకట్లో కూడా నీడలా
నీవంటే నేను ఉండగా
వేరే జన్మంటు నాకే ఎందుకులే
నీతో ఈ నిమిషం చాలు

అందం అమ్మాయైతే
నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే
అడగాలంటే కౌగిలే

ఉండిపోరాడే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే


*****  *****  *****


చిత్రం: హుషారు (2018)
సంగీతం: రధన్
సాహిత్యం: కిట్టు విశ్వప్రాగడ
గానం: సిద్ శ్రీరామ్

(Sad Version)

చెప్పుకోలేనే బాధ నీతోనే
దాచుకోలేనే గుండెల్లో నేనే (2)

నిన్నే నమ్మి చేశానే నేరం
కళ్ళే తెరిచి వెళుతున్నా దూరం
ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా
ముందే నువు చేసిన మోసమే
గుప్పెట్లో దాచే నిప్పల్లే ఉందే
నీతో గడిపిన ఆ కాలమే
కన్నిరంటూ రాకున్నదే
బాధే తీరే దారుండదే
మగువకి మరుపంటే ఎంతో తేలికని
నిన్నే చూశాక తెలిసెను నేడే

కాలం చేసే గాయం మానే దారే లేనేలేదా
నా గుండెల్లో ముల్లే గుచ్చి
చంపేశావే నన్నిలా

చెప్పుకోలేనే బాధ నీతోనే
దాచుకోలేనే గుండెల్లో నేనే

No comments

AMAZON PRIME MOVIES

Most Recent

Default
google.com, pub-8613670326032963, DIRECT, f08c47fec0942fa0